
20న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు
కారంచేడు: ఈ నెల 20వ తేదీన గ్రామ దేవత స్వర్ణమ్మ తల్లి తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థారడ్లెడ్ల పరుగు పందెం పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి రూ. 20 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాలుగో బహుమతి రూ. 5 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు దుర్గారావు (77308 30949), సాయికిరణ్ (63001 50488), నంగనం తేజ (80742 60245) ఫోను నంబర్లలో సంప్రదించాలని కోరారు.
పథకాలను రైతులు
సద్వినియోగం చేసుకోవాలి
రేపల్లె: రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ ఏడీ నాంచారయ్య అన్నారు. పట్టణంలోని పశు వైద్యశాలలో పశు యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన దాణాను మంగళవారం ఆయన పంపిణీ చేసి, మాట్లాడారు. పశువులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. యజమానులు తమ పశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్, పశు వైద్యాధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.