
ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ప్రారంభం
కొల్లూరు : రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు మండలంలోని క్రాపలో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జూనియర్ విభాగంలో 10 నిమిషాల వ్యవధిలో పోటీలను నిర్వహించారు. సోమవారం సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలోని ఐదు మండలాలలో ఇప్పటి వరకు బండ, బండి లాగుడు పోటీల్లో పాల్గొనని టైరు బండి ఎద్దులకు మాత్రం మంగళవారం పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ విభాగాలలో ప్రథమ బహుమతి నుంచి 8వ స్థానం వరకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయి టైరు బండి విభాగంలో ఆరు స్థానాల్లో నిలిచిన ఎడ్లకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.