
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
గుంటూరు వెస్ట్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిందేనని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ మాట్లాడుతూ 2004 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన వారి సంఖ్య 3.5 లక్షలు ఉందన్నారు. ఈ ఉద్యోగుల భవిష్యత్తును నూతన పెన్షన్ స్కీం ద్వారా ప్రభుత్వాలు కొలిమిలోకి నెట్టేసినట్లు అయ్యిందన్నారు. తమ పోరాటాల ఫలితంగా 2017లో గ్యాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్‌లు సాధించామని చెప్పారు. ఏపీఈఏఈ జిల్లా అద్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల కనీస సమస్యలు కూడా పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరుకాదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. అనంతంర జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో కార్యదర్శి లక్ష్మీనారాయణ, సుబ్బారావు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సీపీఎస్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్