
ప్రజారవాణాలో డ్రైవర్లది ముఖ్యపాత్ర
నరసరావుపేట: శిక్షణ తీసుకున్న డ్రైవర్లు ప్రమాదరహితంగా వాహనాలను నడుపుతూ ఇంధన పొదుపు డ్రైవర్లుగా మెలగాలని జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.మధు ఆకాంక్షించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఉన్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్న 19వ బ్యాచ్ డ్రైవర్లకు సోమవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణాలో డ్రైవర్లది ముఖ్యపాత్రని, శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండాలని సూచించారు. చెడు అలవాట్లకు స్వస్తి పలికి సేవా దృక్పఽథం అలవర్చుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించి ప్రమాదాలు నివారించాలని వెల్లడించారు. డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డిపో మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు వివరించారు. కార్యక్రమంలోడ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు పి.బొల్లయ్య, షేక్ సుభాని పాల్గొన్నారు.
పీటీడీ జిల్లా అధికారి మధు
శిక్షణ పొందిన డ్రైవర్లకు
సర్టిఫికెట్లు ప్రదానం