
రోగుల సేవలో నర్సులది కీలకపాత్ర
మంగళగిరి: రోగులకు వైద్య సేవలందించడంలో నర్సుల పాత్ర కీలకమని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా సోమవారం ఎయిమ్స్ ఆధ్వర్యంలో నర్సులు వాక్‌థాన్ నిర్వహించారు. ఎయిమ్స్ వెస్ట్ గేటు వద్ద డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత దాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిమ్స్ నుంచి వాక్‌థాన్‌గా మంగళగిరి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ చేరుకుని, అంబేడ్కర్ విగ్రహ సెంటర్‌లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సులు ప్రజలకు అత్యవసర పరిస్థితిలో అందించాల్సిన వైద్య సేవలు, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ డెమో చేసే విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ రోగులకు వైద్యం అందించే సమయంలో డాక్టర్లతో పాటు నర్సుల పాత్ర ఎంతో విలువైనదని కొనియాడారు. రోగికి సపర్యలు చేస్తూ వ్యాధి నయమయ్యేందుకు నర్సులు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం వాక్‌థాన్‌లో భారీగా పాల్గొన్ననర్సింగ్ విద్యార్థినులు

రోగుల సేవలో నర్సులది కీలకపాత్ర