అబద్ధమే.. | - | Sakshi
Sakshi News home page

అబద్ధమే..

May 19 2025 2:22 AM | Updated on May 19 2025 2:24 AM

సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘‘రీ సర్వేలో కూటమి ప్రభుత్వం, పరిపాలనా యంత్రాంగం ఎంతో అద్భుతమైన పనిని కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసి, ప్రోత్సాహక నిధుల్లో సింహభాగాన్ని దక్కించుకున్నారు. మొదటి దశలో 15 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రణాళికలో మూడు లక్షల భూ భాగాన్ని కవర్‌ చేశాం.’’ .. ఇదీ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరులో రెండురోజులపాటు జరిగిన డిజిటల్‌ ఇండియా భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా సర్వే, రీసర్వేపై జరిగిన జాతీయ సదస్సులో చెప్పిన మాటలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీ సర్వేకు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను ఎంపిక చేశారు. మూడునెలల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే జనవరి తొమ్మిదిన ఈ కార్యక్రమం చేపట్టినా ఇప్పటివరకూ ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తి కాలేదు. ఈ 14 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తికాగా రెండు గ్రామాల్లో తర్వాత దశ పనులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. 27,302.91 ఎకరాలు సర్వే చేయాలని నిర్ణయించగా తహసీల్దార్‌ లాగిన్‌కు వచ్చిన మ్యుటేషన్ల దశకు కేవలం మూడు గ్రామాలే వచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నాలుగైదు నెలలు పడుతుంది. రెండవ దశ కింద జిల్లాలోని కొప్పురావూరు, అంకిరెడ్డిపాలెం, బేతపూడి, హరిశ్చంద్రపురం, వంగిపురం, రావెల, గొడవర్రు, దుగ్గిరాల, కాకుమాను, సిరిపురం, దంతలూరు గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం తొమ్మిది గ్రామాల్లో సరిహద్దులు గుర్తించగా, మరో రెండు గ్రామాల్లో గుర్తించే పని నత్తనడకన కొనసాగుతోంది. ఇదే వేగంతో కనుక సర్వే పనులు జరిగితే మరో అయిదేళ్లకు కూడా రీసర్వే పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.

యడ్లపాడు మండలంలో భూ రీ సర్వేకు డ్రోన్‌ను సిద్ధం చేస్తున్న సిబ్బంది (ఫైల్‌)

న్యూస్‌రీల్‌

నేడు రీ సర్వేను ముందుకు తీసుకెళుతున్న కూటమి ప్రభుత్వం గుంటూరులో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహణ ఐదు నెలల క్రితం గుంటూరు జిల్లాలో 14 గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌ ఇప్పటివరకు పూర్తికాని వైనం మళ్లీ 11 గ్రామాల్లో రెండో దశ సర్వే ప్రారంభం మరో ఐదేళ్లకు కూడా జిల్లా పూర్తి కాదంటున్న అధికారులు నాడు విప్లవాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా అడుగులు

గత ప్రభుత్వంలో రీసర్వే చేస్తుంటే తప్పు జరిగిపోతోందంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఇదే పనిని మళ్లీ మొదలుపెట్టింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద జిల్లాలో 62 గ్రామాలలో 1,42,450 ఎకరాల భూమిని రీసర్వే చేశారు. ఎనిమిది గ్రామాల్లో గ్రామకంఠం భూములను కూడా రీ–సర్వే పూర్తి చేశారు. ఎప్పుడో 1905లో బ్రిటీషర్లు చేపట్టిన తర్వాత 2020 వరకు మరే నాయకుడు దీని జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు.

అంతా

నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రీసర్వేని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీని ద్వారా ప్రతి అంగుళం భూమిని మ్యాపింగ్‌లోకి తీసుకురావడంతోపాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఈ ప్రక్రియ గుంటూరు జిల్లాలో 2020 డిసెంబర్‌లో ప్రారంభమయ్యింది.

తొలుత పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద దుగ్గిరాల మండలంలోని దేవరాపల్లి అగ్రహారం, ప్రత్తిపాడు మండలంలోని కొండజాగర్లమూడి, వేమూరు మండలంలోని పులిచింతలపాలెం, యడ్లపాడు మండలంలోని మర్రిపాలెం, దాచేపల్లి మండలంలోని అలుగుమల్లిపాడులను ఎంపిక చేశారు. అక్కడ విజయవంతంగా పూర్తి చేశారు.

సర్వే అనంతరం సంబంధిత భూమి, స్థలం యజమానికి ప్రింటెడ్‌ పాస్‌బుక్‌ ఉచితంగా ఇచ్చారు.

గుంటూరు జిల్లాలో మొత్తం 223 గ్రామాలు ఉండగా గుంటూరు డివిజన్‌లో 119, తెనాలి డివిజన్‌లో 104 గ్రామాలు ఉన్నాయి. 47 గ్రామాల్లో సర్వే ఆఫ్‌ ఇండియాకు, 121 గ్రామాల్లో యుక్రా అనే సంస్థకు సర్వే బాధ్యతలు అప్పగించారు.

సర్వే ఆఫ్‌ ఇండియాకు అప్పగించిన 47 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి చేసింది. యుక్రా సంస్థ 46 గ్రామాల్లో డ్రోన్‌ను తిప్పింది. మొత్తం 93 గ్రామాల్లో డ్రోన్‌ను తిప్పి ఏరియల్‌ వ్యూ మ్యాపింగ్‌ పూర్తి చేశారు.

23 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజెస్‌)లను జారీ చేశారు. వీటిని క్షేత్రస్థాయిలో భూమితో పోల్చి నిజనిర్ధారణ(గ్రౌండ్‌ ట్రూతింగ్‌) చేసే ప్రక్రియ 22 గ్రామాల్లో పూర్తి అయ్యింది. అయితే రికార్డులలో ఉన్న భూమికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేకపోవడం వల్ల సర్వే పూర్తి చేయడంలో కొంతమేర ఇబ్బందులు వచ్చాయి. భూయజమానులు అందుబాటులో లేకపోవడం సర్వేలో ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వ వైఖరితో మరింత జాప్యం జరుగుతోంది.

అబద్ధమే..1
1/3

అబద్ధమే..

అబద్ధమే..2
2/3

అబద్ధమే..

అబద్ధమే..3
3/3

అబద్ధమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement