
గుంటూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు గుంటూరులో జులై 23, 24 తేదీల్లో నిర్వహించనునట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ నరసింహారావు చెప్పారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం బి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇప్పటికై నా సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభకు మేస్త్రిలు, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ సహాయ సహకారాలు అందించాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న, లైసెనన్స్ టెక్నికల్ పర్సనన్స్ ఉద్యోగ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న జీవో నెంబర్ 20ని రద్దు చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, నాయకులు కే శ్రీనివాసరావు, బీ ముత్యాలు, పి దీవెనరావు, బాబురావు, డి కోటేశ్వరరావు, ఖాసీం వలి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.