
వైభవంగా లక్ష్మీ నృసింహస్వామి జయంత్యుత్సవం
మంగళగిరి: శ్రీ నారసింహ చతుర్దశిని పురస్కరించుకుని సోమవారం శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి జయంత్యుత్సవం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు.