
ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ...
తాడేపల్లి రూరల్: పరలోకంలో ఉన్న పెద్దల అనుగ్రహం కోసం పిండ ప్రదానం చేస్తుంటాం..ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బ్రాహ్మణుల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించే కృష్ణానది చెంత ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నారు. పొట్ట నింపుకోవడం కోసం చేసేది లేక బాధలను దిగమింగుతున్నారు. అధికారులు కూడా వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీతానగరం వద్ద కృష్ణానది చెంతన నిత్యం పిండ ప్రదానాలు, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సుమారు 50 మందికి పైగా పండితులు నిత్యం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరంతా రెక్కాడితేకాని డొక్కాడని పేద బ్రాహ్మణులు. పిండ ప్రదానం చేసేందుకు వచ్చే వారు, బ్రాహ్మణులు విశ్రాంతి తీసుకునేందుకుగాను గతంలో ఓ భవనం ఉండేది. ఆ భవనాన్ని ‘సీత భవన్’గా మార్పు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. దీంతో విశ్రాంతి తీసుకునేందుకు నీడ లేకుండా పోయింది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారులు సమీపంలోనే ఉన్నా స్పందించకపోవడంపై పండితులు పెదవి విరుస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తలదాచుకునేందుకు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
కృష్ణానది చెంత పిండప్రదానాలు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్న బ్రాహ్మణులు పట్టించుకోని అధికారులు

ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ...