
త్రయాహ్నిక మహోత్సవాలు ప్రారంభం
నగరంపాలెం: అరండల్‌పేటలోని శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠపాలిత శ్రీ గంగా మీనాక్షి సోమసుందరేశ్వరస్వామి దేవాలయం (శివాలయం)లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యప్పస్వామి వార్లకు గోపుర నిర్మాణం, శిఖర ప్రతిష్ట త్రయాహ్నిక మహోత్సవాన్ని సోమవారం ప్రారంభించారు. యాగ బ్రహ్మ గుంటూరు కాశీ విశ్వనాథశర్మ మాట్లాడుతూ గోవు, గణపతి పూజలు, దీక్ష ధారణ, వాస్తు హోమం చేశామని తెలిపారు. ఈనెల 13న మూలమంత్ర జపాలు, హోమం, ఆదివాసాలు, బలిహరణ, ఊరేగింపు, 14న మూలమంత్ర హోమాలు, శ్రీ విద్యారణ్య భారతి స్వామి స్వహస్తాలతో యంత్ర, శిఖర ప్రతిష్ట, కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్ట, పూర్ణాహుతి, శాంతి కల్యాణం, ప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. ఈ మూడు రోజులు కార్యక్రమాలను అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ధర్మకర్త ఏకా ప్రసాద్, ఆలయ అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్యశర్మ, కుందుర్తి భాస్కర్‌శర్మ, ఆలయ గోపుర నిర్మాణ, శిఖరాల దాత సిరిపురపు శ్రీధర్‌శర్మ, దారపనేని శివప్రసాద్, మర్రిపాటి ప్రసాద్ పాల్గొన్నారు.