వడదెబ్బతో వృద్ధుడు మృతి
గుంటూరు రూరల్/తాడికొండ: రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని బండారుపల్లి, నల్లపాడు రైల్వేస్టేషన్‌ల మధ్య చోటు చేసుకుంది. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో రేపల్లే నుంచి చర్లపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి వృద్ధుడు మృతి చెందాడు.
మృతుని వయస్సు సుమారుగా 65 నుంచి 70 సంవత్సరముల మధ్య ఉంటుందని, తెల్లజుట్టు, తెలుపు రంగు ఆఫ్ చేతుల చొక్కా, తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడని, ఎరుపు రంగు మొలతాడు కట్టుకుని ఉన్నాడన్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు, నడికుడి గవర్నమెంట్ రైల్వే పోలీసువారిని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు నడికుడి రైల్వే పోలీసు స్టేషన్ ఎస్‌ఐ రోశయ్య 8309369916, 9949063960 సెల్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.