Hanamkonda
-
పది రోజులుగా టెంట్‌కిందనే..
పాలకుర్తి టౌన్: ఆయన యోగా గురువు. ఎంతోమందికి యోగా నేర్పాడు. ఏనాడూ డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అద్దె ఇల్లు. తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. చివరికి అనారోగ్యంతో చనిపోగా, ఇంటి యజమాని ఒప్పుకోకపోవడం, పది రోజుల కార్యక్రమాలయ్యే వరకు రావద్దని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఖాళీ ప్లాట్‌లో టెంట్‌వేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పది రోజులుగా అదే టెంట్లో కాలం గడుపుతున్నారు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండల కేంద్రం, చుట్ట పక్కల గ్రామాల్లో ఒకప్పుడు ఎల్ఎన్ టైలర్‌గా దార్ల లక్ష్మీనారాయణ ఓ వెలుగు వెలిగాడు. డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వకుండా యోగా గురువుగా ఎంతోమంది కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. పది రోజులక్రితం అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. మృతదేహం ఉంచేందుకు ఇంటి యజమాని ఒప్పుకోలేదు. దీంతో వారికున్న ఖాళీ స్థలంలో(ప్లాట్)లో టెంట్ వేసి దహనసంస్కారాలు నిర్వహించారు. పది రోజుల వరకు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆ టెంట్‌కు చుట్టూ పరదాలు కట్టుకొని కాలం వెళ్లదీస్తూ మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఈదురుగాలులు, వర్షం పడుతున్నా టెంట్‌కిందనే జీవనం సాగిస్తున్న దైన్యం. దశదిన కర్మ కార్యక్రమానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారని ఆశగా చూస్తున్నట్లు కుమారుడు దార్ల ఉపేందర్ తెలిపాడు. -
టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
హన్మకొండ: తమకు పాత రేట్లు గిట్టుబాటు కావడం లేదని స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే పనులు చేయడం సాధ్యపడుతుందని విద్యుత్ కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఈక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ పరిధిలో సబ్ డివిజన్ల వారీగా విద్యుత్ సంబంధ పనులు పూర్తి చేయడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి టెండర్లు పిలిచారు. ఈనెల 22న టెండర్లు వేయాల్సి ఉంది. దీనికిగాను షెడ్యూల్ తీసుకోవడానికి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. గడువులోగా ఒక్క కాంట్రాక్టర్ కూడా షెడ్యూల్ తీసుకోలేదు. దీంతో గురువారం టెండర్లు వేసే అవకాశం లేదు. కాంట్రాక్టర్లు హనుమకొండ సర్కిల్ కార్యాలయానికి వచ్చినా షెడ్యూల్ మాత్రం తీసుకోలేదు. వచ్చిన వారు కూడా ఇతరులెవరైనా టెండర్ల షెడ్యూల్ తీసుకుంటారేమోనని జాగ్రత్తగా గమనిస్తూ కార్యాలయం ఆవరణలోనే కాపుకాశారు. కాంట్రాక్టర్లంతా సమష్టిగా టెండర్లు వేయడానికి ముందుకు రావట్లేదు. వారు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఆరేళ్ల క్రితం స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్లు పెంచలేదని, ప్రతీ మెటీరియల్ రేట్ రెట్టింపు స్థాయిని మించి పెరిగాయని, ఈరేట్లతో పనులు చేస్తే గిట్టుబాటు ఏమో కానీ.. అప్పుల పాలు కావాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. రెండేళ్ల క్రితం తాము సమ్మెకు వెళ్లగా.. నెలన్నర రోజుల్లో పెంచుతామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తాము హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావుకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ముగిసిన కాల పరిమితి సబ్ డివిజన్ పరిధిలో రూ.20 లక్షల్లోపు విద్యుత్ అభివృద్ధి పనులు చేసేందుకు ఏడాది కాల పరిమితితో కాంట్రాక్టర్లను నియమిస్తారు. ఈకాంట్రాక్టర్ల నియామకానికి ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టెండర్లు పిలుస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఖరారు చేసిన కాంట్రాక్టర్ల నియామక కాల పరిమితి ముగిసింది. దీంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు టెండర్లు పిలువగా కాంట్రాక్టర్ల నిరాకరణ ఎదురైంది. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లపై పూర్తి అసంతృప్తితో ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ఏ మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేరు. రేట్ల ఖరారుపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై కాంట్రాక్టర్ల భవితవ్యం ఆధారపడి ఉంది. ఆరేళ్లుగా పెంచని స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు ధరలు పెంచితేనే టెండర్లకు వస్తామంటున్న కాంట్రాక్టర్లు గడువులోగా ఒక్కరూ తీసుకోని షెడ్యూల్ -
పూడికతీత పనుల తనిఖీ
వరంగల్ అర్బన్: హనుమకొండ పరిధి నయీంనగర్ నాలా బ్రిడ్జి, మంగలి వాగు బ్రిడ్జి నాలాల పూడికతీత పనుల్ని బుధవారం కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. నాలాల్లో ఏమాత్రం వ్యర్థాలు లేకుండా ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. పూడికతీత పనుల్లో నిర్లక్ష్యం చేస్తే వరదల వల్ల కాలనీకు ముప్పు వాటిల్లుతుందని గుర్తించుకోవాలని సూచించారు. ఉనికిచెర్లకు పట్టణ రూపు తీసుకొస్తా..ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్: ఉనికిచర్ల గ్రామానికి పట్టణ రూపు తీసుకొస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధి ఉనికిచర్లలో రూ.1.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, వరద కాలువల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఉనికిచర్ల గ్రామాభివృద్ధికి ‘కుడా’ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉనికిచర్ల– రా పాకపల్లి రోడ్డుకు రూ.41 లక్షలు మంజూరైన ట్లు, పనులు ప్రారంభమవుతాయన్నారు. -
తహసీల్దార్లా.. మజాకా ● ఎగ్జిక్యూటివ్ పోస్టు కోసం పట్టు
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025– 8లోuహన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీలు.. వాటివెనుకున్న రాజకీయ ప్రమేయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి తహసీల్దార్లు వచ్చారు. ఇక్కడి వారు ఇతర జిల్లాలకు వెళ్లారు. తాజాగా ప్రభుత్వం తహసీల్దార్ల అభ్యర్థన మేరకు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి పంపింది. దీంతో జిల్లాకు వచ్చినవారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో సూపరింటెండెంట్ పోస్టులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తమకు ప్రాధాన్యం ఉన్న మండలాల్లో పోస్టు కావాలని ఉన్నతాధికారులపై వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జిల్లాలోని 14 మండలాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు తమ సీటుకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ముందే స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని, కదిలించకుండా చూడాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. ముఖ్యంగా హసన్‌పర్తి, ధర్మసాగర్, ఐనవోలు, ఎల్కతుర్తి, కాజీపేట మండలాల విషయంలో అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అటు అధికారులను, ఇటు ప్రజాప్రతిధులను సమన్వయ పరుస్తూ జిల్లా ఉన్నతాధికారులు పోస్టింగ్స్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కొన్ని మండలాల తహసీల్దార్లు తమ సీటుకు ఎసరు వస్తుందని ముందే పసిగట్టి స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని ఎలాగైనా స్థానచలనం కలగకుండా చూడాలని చివరి దాకా ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈక్రమంలో తమకేం కాదని, తమ మండలాలకు ఎవరూ రారులే అనుకుని ఉన్నవారికి మాత్రం ఊహించని రీతిలో బదిలీ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో ప్రస్తుత బదిలీల్లో భీమదేవరపల్లి, నడికూడ, పరకాల, వేలేరు తహసీల్దార్ పోస్టులతోపాటు పరకాల డీఏఓ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పోస్టులకు కేటాయించారు. వారిలో కొందరికి మంచి పోస్టులే వచ్చినా.. తాము అనుకున్న స్థాయి పోస్టులు దక్కలేదని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బదిలీల్లో వేలేరు తహసీల్దార్ కోమిని కలెక్టరేట్‌కు, కలెక్ట్టరేట్లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌ను వేలేరుకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వాటిని బుధవారం మళ్లీ మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు బదిలీ చేసిన తహసీల్దార్ కోమిని వేలేరులోనే ఉండేలా, ప్రసాద్ కలెక్టరేట్లో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా చాలాకాలం తర్వాత జరిగిన తహసీల్దార్ల బదిలీలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. త్వరలో జిల్లాకు మరో ఇద్దరు తహసీల్దార్లు వస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో వారి రాక ఎవరి సీటుకు ఎసరుతెస్తుందోనని గుసగుసలు మొదలయ్యాయి. న్యూస్రీల్అయినా అసంతృప్తి.. కలెక్టరేట్లో ఉండేందుకు ససేమిరా... వేలేరు తహసీల్దార్ రిటెన్షన్ కొందరికి ప్రజాప్రతినిధుల భరోసా హనుమకొండ జిల్లాలో తహసీల్దార్ల బదిలీలపై తీవ్ర చర్చ -
రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన నాయకులు
రామన్నపేట: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఎంజీఎం సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నాయకులు గోపాల నవీన్‌రాజ్, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి భాస్కర్, టీపీసీసీ కార్యదర్శులు మీసాల ప్రకాశ్, కొత్తపల్లి శ్రీనివాస్, మబ్బు ప్రవీణ్, భాషపాక సదానందం, మడిపల్లి కృష్ణ, సకినాల రజనీకాంత్, కత్తెరశాల వేణుగోపాల్, జారతి రమేశ్, నారగోని స్వప్న మురళి, కార్పొరేటర్లు తేజస్వి శిరీష్, వస్కుల బాబు, కావేటి కవిత, బాల్నే సురేశ్, భోగి సువర్ణ సురేశ్, గుండు చందన, పూర్ణచందర్ పాల్గొన్నారు. -
ఆధునిక హంగులు.. అమృత్ వెలుగులు
సాక్షి, వరంగల్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునికీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రూ.25.41 కోట్ల అమృత్ నిధులతో కాకతీయుల సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా అభివృద్ధి చేసిన ఈ రైల్వేస్టేషన్‌ను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధి ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్లో కొత్త ప్లాట్‌ఫాంలు, ట్రాక్‌లు, సౌకర్యాల కల్పనతోపాటు అనేక విస్తరణలు, ఆధునికీకరణ పనులు చేశారు. ఈస్టేషన్లో నాలుగు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఏమేం పనులు చేశారంటే.. కాకతీయ కళాతోరణం ఉండేలా స్టేషన్ ముఖద్వారాన్ని అభివృద్ధి చేశారు. ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం, ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన (ఫుట్ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతోపాటు మూడు లిఫ్ట్‌లు, నాలుగు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫాం విస్తీర్ణం పెంపు, ప్లాట్‌ఫాంపై అదనపు కప్పు, దివ్యాంగులకు కొత్త టాయిలెట్ బ్లాకులు నిర్మించారు. వెయిటింగ్ హాల్ అభివృద్ధి, ఆహ్లాదం కోసం స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా స్టేషన్ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేశారు. కళలు, సంస్కృతికి సంబంధించిన చిత్రాలు వేశారు. రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు అమర్చారు. రోజుకు 31,887 మంది రాకపోకలు.. ● కాజీపేట, విజయవాడ సెక్షన్లో ఉన్న ఈ స్టేషన్ రూ.41.09 కోట్ల వార్షిక ఆదాయం వస్తుంది. సగటున రోజుకు 31,887 మంది ప్రయాణికుల రాకపోకలతో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ● ఈ స్టేషన్లో దాదాపు 137 రైళ్లు ఆగుతాయి. న్యూఢిల్లీ, హౌరా, చైన్నె, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఇక్కడా హాల్టింగ్ ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్‌కు నూతన సొబగులు వర్చువల్‌గా నేడు ప్రారంభించినున్న ప్రధాని మోదీ -
పరీక్షల బోర్డు నిబంధనలు పాటించాలి
విద్యారణ్యపురి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం వరంగల్ జిల్లాకు సంబంధించి హనుమకొండలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో స్క్వాడ్ బృందాలతో నిర్వహించిన సమావేశంలో డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ పాల్గొని మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా స్క్వాడ్ల బృందాలు తనిఖీలు చేపట్టాలన్నారు. వరంగల్ జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 5,200 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక ప్లయింగ్‌స్కాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసమావేశంలో డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 12,063 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,453 మంది పరీక్షలు రాయనున్నట్లు డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. ఈపరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ -
మహిళా కానిస్టేబుల్‌కు సీపీ అభినందన
వరంగల్ క్రైం: ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ స్పందనను సీపీ సన్‌ప్రీత్‌సింగ్ బుధవారం అభినందించారు. వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ వి భాగంలో మహిళా కానిస్టేబుల్ స్పందన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె గత నెల పంజాబ్ రాష్ట్రం జలందర్‌లో నిర్వహించిన మొదటి ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఫెన్సింగ్ క్రీడలో సీనియర్ ఉమెన్స్ టీం ఫాయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించే పోలీస్ సిబ్బందికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి, ఏఆర్ ఏసీపీ అంతయ్య పాల్గొన్నారు. ఎంసీఏ పరీక్షలు షురూ..కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. క్యాంపస్‌లోని ఎకనామిక్స్ విభాగంలో ఏర్పా టు చేసిన ఎంసీఏ పరీక్ష కేంద్రాన్ని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం పరిశీలించారు. కేయూ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల వివిధ సెమిస్టర్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం ఏటూరు నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని బుధవారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.వెంకటయ్యతో కలిసి పరిశీలించారు. బెస్ట్ ప్రాక్టీసెస్ నమోదు గడువు పెంపువిద్యారణ్యపురి: ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తమ పాఠశాలల్లో ఆచరించే బెస్ట్ ప్రాక్టీస్ నమోదు గడువును ఎస్సీఈఆర్టీ పెంచినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి బుధవారం తెలిపారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, కేజీబీవీల, తెలంగాణ మోడల్ పాఠశాలలు, తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ఈనెల 22వ తేదీ వరకు ఎస్సీఈ ఆర్టీవెబ్సైట్లో, హెచ్‌టీటీపీఎస్//ఎస్సీఈఆర్టీ.తెలంగాణ.గౌట్.ఇన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి సందేహాలుంటే డి.మధుసూదన్‌రెడ్డి 97058 06579 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని బీసీ కులానికి చెందిన శిక్షణలో ఉన్న అడ్వకేట్ విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి బీసీ అడ్వకేట్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు కలెక్టరేట్లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి..విద్యారణ్యపురి: పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు సంబంధించిన విషయాల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. బుధవారం జిల్లాలోని భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని డీఈఓ వాసంతి సందర్శించి హెచ్ఎంలను ఉద్దేశించి మాట్లాడారు. వృత్తిపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని అలాగే నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకోవాలన్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే, పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ మార్గాలను అనుసరించాలని హెచ్ఎంలకు డీఈఓ సూచించారు. శిక్షణలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, కమ్యూనిటీ మొబలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, రిసోర్స్పర్సన్లు రామకృష్ణ, వేణు ఆనంద్, మనోహర్‌నాయక్, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల ఎంపిక త్వరగా పూర్తి చేయండి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో రాజీవ్ యువ వికాసంపథకం అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్‌వైవీ, ఉపాధి హామీ పథకాలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో భాగంగా దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని, జిల్లాలో మొత్తం 10,565 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మే 24 వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి తుది జాబితా అందించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 7,675 పని దినాలకు ఇప్పటి వరకు 3,645 పని దినాలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నందున జూన్ 15 నాటికి లక్ష్యాన్ని అధిగమించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హౌసింగ్ డీడీ రవీందర్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎల్డీఎం శ్రీనివాస్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అంగన్వాడీల్లో చేపట్టిన పనుల పురోగతి, ఇతర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 24 అంగన్వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, పీఆర్ ఈఈ ఆత్మరావు ఉన్నారు. -
ఇన్చార్జ్ సీఎండీలతో ఇబ్బందులు
● టీఎస్‌ఈఈయూ –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ హన్మకొండ: టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్‌కోలో ఇన్చార్జ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని టీఎస్‌ఈఈయూ–327 కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు గ్రహీతల సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకంలో జాప్యంతో పాలనాపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో అపాయింట్మెంట్ ఇప్పించాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ తాను ఈ కార్యక్రమం నుంచి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడానని, నాలుగైదు రోజుల్లో సమయం ఇస్తానని చెప్పారన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలు పి.మహేందర్ రెడ్డి, నీలం ఐలేశ్, సురేశ్ కుమార్‌ను ఎమ్మె ల్యే నాయిని, ఇనుగాల శ్రీధర్, నాయకులు సన్మానించారు. పీసీసీ నాయకుడు ఈ.వి.శ్రీనివాస్ రావు, టీఎస్‌ఈఈయూ–327 టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ కొండూరి శ్రీనివాస్, భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డి, మాధవ రావు, చిట్ల ఓదేలు, బుచ్చయ్య గౌడ్, జశ్వంత్ కుమార్, సదయ్య, శ్రీనివాస్, రవికుమార్ పాల్గొన్నారు. కొత్త సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ 16 సర్కిళ్ల పరిధిలో పురోగతిలో ఉన్న ఇంటర్ లింకింగ్ లైన్ల పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ లేకుండా ప్రతీ నెల ఫీడర్ల నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రీ మాన్సూన్ తనిఖీలు అన్ని ఫీడర్లలో చేపట్టాలని, తద్వారా అంతరాయాలు తగ్గుతాయన్నారు. సబ్ స్టేషన్ల నిర్వహణ చేసే సమయంలో అంతరాయం లేకుండా వేరే సబ్ స్టేషన్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకట రమణ, జీఎంలు వేణు బాబు, దేవేందర్, కృష్ణమోహన్, వెంకటకృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, సురేందర్, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు. పీజీ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆ దిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ నాలుగో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కొందరు విద్యార్థులు మంగళవారం ఉదయం కేయూలోని పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసుల చొరవతో వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ విద్యార్థులతో చర్చించారు. త్వరగా పరీక్షలు జరిగితే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. టైంటేబుల్ ప్రకారం మధ్యాహ్నం 2గంటల నుంచి యథావిధిగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కేయూ పరిధిలో 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. వీరి వెంట పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, ఆర్ట్స్ కాలేజీ పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్ జ్యోతి ఉన్నారు. రేపటి నుంచి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలువరంగల్ స్పోర్ట్స్: ఈనెల 22వ తేదీన జూనియర్స్ బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2009 నుంచి డిసెంబర్ 31, 2010 మధ్య జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆధార్, స్కూల్ బోనోఫైడ్, జనన ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌లతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు రూ.300 ఎంట్రీ ఫీజుతో ఉదయం 7గంటలకు హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్హాల్ నందు హాజరు కావాలని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 24వ తేదీన మంచిర్యాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ● ఉదయం కేయూలో విద్యార్థుల ధర్నా ● మధ్యాహ్నం నుంచి యథావిధిగా ఎగ్జామ్స్ -
ఎస్సై సంతకం ఫోర్జరీ..
● ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్.. సీపీ ఉత్తర్వులు జారీ ● తరిగొప్పుల పోలీస్ స్టేషన్లో సంఘటన వరంగల్ క్రైం: జనగామ జిల్లా తరిగొప్పుల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఏకంగా ఎస్సై సంతకం ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. తరిగొప్పుల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సురేష్, రాజు కానిస్టేబుళ్లు ఇటీవల స్టేషన్ బెయిల్ విషయంలో అక్కడ ఎస్సైగా పనిచేస్తున్న శ్రీదేవి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆ కాగితాలను కోర్టుకు సమర్పించారు. గుడుంబా అమ్ముతున్న ఓ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ప్రాసెస్ చేయాల్సిందిగా ఎస్సై శ్రీదేవి అదే స్టేషన్ రైటర్‌ను ఆదేశించారు. దీనిని అవకాశం తీసుకున్న సదరు రైటర్‌తోపాటు మరో కానిస్టేబుల్ డబ్బులకు ఆశపడి, ఎస్సై ఆదేశాలను అవకాశంగా తీసుకుని ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి స్టేషన్ బెయిల్ మంజురు చేశారు. ఆ తరువాత ఆ కేసుకు సంబంఽధించిన కాగితాలను కోర్టుకు సమర్పించారు. ఆలస్యంగా తన సంతకం ఫోర్జరీ అయ్యిందని గ్రహించిన ఎస్సై శ్రీదేవి వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. విచారణ జరిపిన అధికారులు వరంగల్ పోలీస్ కమిషనర్‌కు నివేదిక సమర్పించడంతో కానిస్టేబుళ్లు సురేష్, రాజులపై సీపీ రెండు రోజులక్రితం సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మారని తీరు.. సంవత్సరాల తరబడి శిక్షణాలు పూర్తి చేసిన పోలీస్ అధికారులు కాసుల కక్కుర్తి కోసం అడ్డదారులు తొక్కుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో పోలీస్‌శాఖ పరువు బజారున పడుతోంది. కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు హత్య కేసుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రధాన నిందితులుగా ఉండడం గమనార్హం. ఇటీవల సస్పెండ్‌కు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా గతంలోనూ అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కావడం కొసమెరుపు. గతంలో హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, శాయంపేట పోలీస్ స్టేషన్, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ వసూళ్లకు పాల్పడి సస్పెండ్ అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఉన్నతాధికారులు తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలు కూడా బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అవినీతికి పాల్పడుతున్న పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పోలీస్ శాఖ గాడిన పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటెలిజెన్స్ డీజీని కలిసిన సీపీవరంగల్ క్రైం: తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం హనుమకొండలోని పోలీస్ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తున్న డీజీ శివధర్‌రెడ్డి మార్గమధ్యలో పోలీస్ అతిథి గృహానికి చేరుకున్న సందర్భంగా సీపీ కలిశారు. ఈసందర్భంగా ఇరువురు అధికారులు పలు అంశాలపై చర్చించారు. -
గోదావరి తీరం.. భక్తప్రవాహం
సరస్వతీనది పుష్కర స్నానాలకు భక్తుల రద్దీ● హైకోర్టు జడ్జి, ఎస్ఐబీ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ డీజీ పుష్కర స్నానం, దర్శనం ● 50వేల మంది వరకు భక్తులు పుష్కర స్నానాలు● తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ కొనసాగింపు.. ● ఆరో రోజు స్వల్పంగా తగ్గిన భక్తులు ● ముక్తీశ్వరస్వామి ఆలయ క్యూలైన్లో బారులుదీరిన భక్తజనంభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఆరో రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి తరలొచ్చి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. నదీమాతకు పూజలు చేశారు. పిండ ప్రదాన పూజలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గోదావరితీరం వద్ద భక్తప్రవాహం కనిపించింది. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన పుష్కరాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లు, సింగరేణి, గజ ఈతగాళ్లును ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే వాకీటాకీలతో మాట్లాడుతూ పరిశీలించారు. టెంట్‌సిటీ, ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారుల్లో బ్లీచింగ్ చల్లించి పరిస్థితిని చూశారు. పుష్కర ఘాట్ గోదావరిలో బోటు ద్వారా భద్రతను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతంలో అదనంగా చలువ పందిళ్లు వేయాలని ఆదేశించారు. ఎస్పీ ట్రాఫిక్ నియంత్రణను పకడ్బందీగా చేట్టాలని ఆదేశించారు. అష్టమితో తగ్గిన రద్దీ.. మంగళవారం అష్టమి సందర్భంగా భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ఉదయం 10గంటల వరకు భక్తుల రద్దీ లేదు. ఆ తర్వాత క్రమక్రమంగా పెరిగింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, మంథని, కాటారం మీదుగా వాహనాలు తరలొచ్చాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లతో నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది. రోడ్లు శుభ్రం.. ఆదిముక్తీశ్వరస్వామి నుంచి వీఐపీ ఘాట్ వెళ్లే మార్గంలో వర్షం పడితే రోడ్లపై దిగబడకుండా గ్రావెల్ చిప్స్ వేశారు. రోడ్లపై దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీటిని చల్లుతున్నారు. గోదావరితీరం, ఆలయ పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్లు, ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు చురుగ్గా చేపట్టారు. 50వేల మంది స్నానాలు.. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి క్యూలైన్లో బారులుదీరారు. మంగళవారం 50వేల మంది వరకు పుష్కర స్నానాలు చేసి దర్శనాలు చేసుకున్నట్లు అధికారుల అంచనా. పలువురు భక్తులు అక్కడక్కడ వడదెబ్బకు గురయ్యారు. వారిని కాళేశ్వరం పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలందించారు. కొంత మందిని ఇతర పట్టణాలకు తరలించి వైద్యసేవలందించినట్లు వైద్యులు పేర్కొన్నారు. మజ్జిగ ప్యాకెట్లు అందజేత.. భక్తులకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిక ప్యాకెట్లు అందించారు. ప్రధాన తూర్పు, దక్షిణ ద్వారాల ద్వారా క్యూలైన్లలో భక్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ప్రత్యేకాధికారిగా మనోహర్‌ను నియమించారు. ఆయన క్రౌడ్ మేనేజ్మెంట్ చేపట్టారు. సరస్వతీనది పుష్కరాలకు ప్రముఖులు హాజరయ్యారు. హైకోర్టు జడ్జి సృజన, ఎస్ఐబీ డైరెక్టర్ తరుణ్‌జోషి, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పుష్కర స్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.నదీహారతి ప్రత్యక్ష ప్రసారం.. సరస్వతి ఘాట్‌లో కాశీపండితులతో ఏర్పాటు చేసిన నవరత్నమాలిక హారతికి భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. రాత్రి 7.30 గంటలకు 45 నిమిషాల పాటు జరిగే ఈకార్యక్రమాన్ని పుష్కరాలు పూర్తయ్యే వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కాశీ పండితులు ఏడుగురితో తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నారు. రోజురోజుకూ పరిసర ప్రాంతాల భక్తులు వీక్షించడానికి తరలి వస్తున్నారు. రాత్రి 9 వరకు కూడా వరకు భక్తులు ఆయా పరిసరాల్లో కాలక్షేపం చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రముఖుల పూజలు.. -
వివాదాలకు అడ్డాగా ‘మిల్స్ కాలనీ’
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే పోలీసు అధికారులు భూ వివాదాల్లో తలదూరుస్తూ సస్పెండ్ వరకు వెళ్తున్న ఉదంతాలు వరుసగా జరుగుతుండడం గమనార్హం. ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఠాణా పరిధిలో ఎక్కువగా భూసమస్యలే వస్తుండడంతో వాటిపై కన్నేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు భూవివాదాల్లో పరిధి దాటి వ్యవహరించడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై పలు వివాదాలు రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సీసీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. గతంలోనూ... ● దూపకుంటలోని 20 గుంటల భూమిలో ఏడుగురు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి సోదరుడు తనదంటూ రావడంతో బాధితులకు సహాయం చేయాల్సిన సీఐ రవి కిరణ్ వారిని పట్టించుకోకపోవడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరో సీఐపై భూవివాదంలో తలదూర్చారనే ఆరోపణలొచ్చాయి. అలాగే ఆయన పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ నిందితుడు భవనంపైనుంచి కిందపడడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు అధికారిని ఇక్కడినుంచి మరో చోటికి బదిలీ చేశారు. ● తర్వాత వచ్చిన సీఐ మల్లయ్యపై కూడా ఉన్నతాధికారులకు భూవివాదాల్లో తలదూర్చారనే ఫిర్యాదులు వెళ్లాయి. అదేసమయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ స్టేషన్ ఘన్పూర్ లోని ఓ గుడికి వెళ్లిన సమయంలో పరిధి దాటి ఎస్కార్ట్‌గా వెళ్లడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై వేటుతో చర్చ గతంలోనూ భూవివాదాల్లో కొందరు అధికారులు సస్పెండ్, అటాచ్డ్లతో ఉన్నతాధికారుల చర్యలు -
లండన్‌లో చదువుకున్నా..మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్‌లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డేపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్‌లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్‌దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్‌లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజీ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేశ్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్‌భాస్కర్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
ఐఎఫ్ఎస్ ఫలితాలు.. కాజీపేట యువకుడికి 53వ ర్యాంక్
కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన విద్యార్థి అట్ల తరుణ్‌తేజ ఇటీవల విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 53వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అలాగే ఇటీవల ప్రకటించిన సివిల్స్ పరీక్షల్లో అఖిలభారత స్థాయిలో 770 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన తరుణ్‌తేజ ఐఐటీ ముంబాయి నుంచి బీటెక్ సీఎస్సీ పూర్తి చేశారు. గణితం ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా మంగళవారం తరుణ్‌తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఐఏఎస్ సాధించడమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషివిద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం మండల స్థాయిలో ఐదు రోజులపాటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణను హనుమకొండలోని ప్రశాంత్‌నగర్‌లోని డీపీఎస్ స్కూల్లో ప్రారంభించి ఆమె మాట్లాడారు. తెలుగు, ఆంగ్ల, గణితం సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని కోరారు. ఐదు రోజులపాటు రిసోర్స్పర్సన్లు ఇస్తున్న శిక్షణ వినియోగించుకుని ఇందులో నేర్చుకున్న అంశాలతో విద్యను బోధించాలన్నారు. శిక్షణలో హనుమకొండ ఎంఈఓ జి.నెహ్రూ, రిసోర్స్పర్సన్లు శ్రీపాల్‌రెడ్డి, ఎం.శ్రీధర్, పృధ్వీరాజ్, శివకోటి, అశోక్, ఎ.శ్రీధర్, మధు, జ్యోతి, రాజ్‌కుమార్, మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలువిద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు హనుమకొండ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ మంగళవారం తెలిపారు. ప్రతీ రోజు రెండు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో 33 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 12,063 మంది, సెకండియర్‌లో 5,453 మంది పరీక్షలు రాయనున్నట్లు, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌బీఐఈ.సీజీజీ. గౌట్.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. -
సీఐ వెంకటరత్నంపై వేటు
వరంగల్ క్రైం: వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సస్పెన్షన్ వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వేడెక్కింది. తప్పుడు కేసులతో బాధితులను ఇబ్బంది పెట్టడంతోపాటు ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిని లైంగిక వేధింపులకు గురిచేయడం సంచలనంగా మారింది. కాగా, భూ కేసుకు సంబంధింఏప్రిల్ 15న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అదేవిధంగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అనేక భూకబ్జాలకు స్థానిక అధికారులు వంత పాడుతున్నారనే విషయంపై పలు కథనాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’లో ఆధారాలతో సహా వెలువడిన కథనంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ఎఫ్ఐఆర్ నంబర్ 47/2025లో ఏ–1గా పేర్కొన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి 9 ఏళ్లు కాగా, ఆ వ్యక్తిని ఏ–1గా పేర్కొంటూ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. నిందితులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేయకుండానే బాధితులపై కేసు నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు సైతం ఇన్స్పెక్టర్ను కట్టడి చేయపోవడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల్లో భయం.. భయం వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్ మార్చి 10న బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పోలీసింగ్‌కు మొదటి ప్రాధాన్యం అని, అధికారులు తప్పు చేస్తే పేపర్‌పై పెడతానని స్పష్టంగా చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో ఒక ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబు ల్‌పై వేటు వేయడం కమిషనరేట్‌లో సంచలనంగా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అధికారుల్లో భయం పట్టుకుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు ఉంటాయనే విషయం బయటకు రావడంతో సీపీపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భూ కేసుకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ సస్పెండ్ చేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ భూ వివాదం కేసులో ఎఫ్ఐఆర్లో మరణించిన వ్యక్తి పేరు నమోదు సమగ్ర వివరాలతో కథనం ప్రచురించిన ‘సాక్షి’ మర్డర్ కేసులోని నిందితురాలిపై మిల్స్‌కాలనీ సీఐ లైంగిక వేధింపులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ.. వాస్తవం తేలడంతో చర్యలు అవినీతి అధికారుల్లో భయం.. భయం లైంగిక వేధింపులు.. సీసీ కెమెరాల ఆధారంగా వేటు.. మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో నిందితులను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించారు. అరెస్టు చూపిన అనంతరం జైలుకు పంపించారు. విచారణలో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈక్రమంలో హత్యకేసులో ఏ–1గా ఉన్న మహిళా నిందితురాలి పట్ల ఇన్స్పెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన సీపీ.. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్‌తో విచారణ జరిపించారు. ఈ విచారణలో పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు కీలకంగా మారినట్లు సమాచారం. దీంతోపాటు వేధింపులు ఎదుర్కొన్న నిందితురాలిని, మిల్స్‌కాలనీ పోలీసులను వేర్వేరుగా విచారించి నివేదిక సమర్పించడంతో సీపీ సన్‌ప్రీత్‌సింగ్.. సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. -
స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా కమిటీ సభ్యులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వీటిపై కళాబృందాలతో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జిల్లా కోర్టు చీఫ్ ఏఓ కోట్ల రాధాదేవి, డీసీపీ అంకిత్‌కుమార్ సంకాల్వే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మామునూరు ఏసీపీ తిరుపతి, నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, పీపీ సంతోషి, ప్రోగ్రాం ఆఫీసర్ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, సీఐ వెంకన్న, ఎన్జీఓ ప్రతినిధి పరశురాములు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు సిద్ధం సమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రా సిటి, అత్యాచార కేసుల పరిహారం చెల్లింపు, ఇతర సమస్యలపై కలెక్టర్ సమీక్షించారు. రక్తనిధి కేంద్రం నిర్మాణానికి హామీ గవర్నర్ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు (రక్తనిధి) నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వం, సొసైటీ ఎన్నికల నిర్వహణ, రక్తనిధి కేంద్రం నిర్మాణ అంశాలపై సమగ్రంగా చర్చించారు. -
పార్టీని బలోపేతం చేయండి
హసన్‌పర్తి: ‘రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలులో ముందుకు వెళ్తోంది.. ప్రచారంలో మాత్రం మనమంతా వెనుకబడి ఉన్నాం’ అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలే ఇందుకు కారణమన్నారు. గోపాలపురంలోని ఓ బాంక్వెట్ హాల్లో మంగళవారం హసన్‌పర్తి, ఐనవోలుతో పాటు 1, 2, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. సీనియర్లు, జూనియర్లు అంటూ ఇగో(అహం)లు వీడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి పునాదులని.. కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఆయా పదవులకు పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, కనపర్తి కిరణ్, పొన్నాల రఘు, గడ్డం శివరాం, కార్పొరేటర్లు సునీల్‌కుమార్, జక్కుల రజిత, అరుణకుమారి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ శేఖర్‌రావు, మాజీ సర్పంచ్ మదన్, శ్రీరాం, అనిల్, విజయ్ ఉన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాల్ని చేరుకోవాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో వివిధ బ్యాంకులు 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లక్ష్యం, అందించిన రుణాలు, చేరాల్సిన లక్ష్యాల ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంప్రదింపుల కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల పురోభివృద్ధి సాధించేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలన్నారు. అలాగే దామెర మండలానికి సంబంధించిన బ్యాంకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవికుమార్, ఆర్బీఐ అధికారి తానియా, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి మురళీధర్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, వివిధ బ్యాంకుల, శాఖల అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో జిల్లాకు క్రికెట్ స్టేడియం
● ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ● అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు షురూ వరంగల్ స్పోర్ట్స్: జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణ అంశాన్ని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు తీసుకెళ్లారని, త్వరలోనే స్టేడియం ఏర్పాటు ప్రకటన వెలువడనుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డిపురంలో సోమవారం అంతర్‌జిల్లాల క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో బీజంపడిన క్రికెట్ స్టేడియం నిర్మాణం.. ఇప్పుడు ఆచరణలోకి రానుందని, అందుకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు తానుకూడా ముందుండి నిర్మాణం జరిగేలా చొరవచూపుతానని భరోసా కల్పించారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్డిపురంతో పాటు మొగిలిచర్ల గ్రౌండ్లో జనగామ, ములుగు, వంగాలపల్లి మైదానంలో వరంగల్, మహబూబాబాద్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు కొనసాగాయని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సదాశివ్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు. -
కమిషనరేట్‌లో ఏసీపీల బదిలీ
వరంగల్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏసీపీ బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఏసీపీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్‌కుమార్.. డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీగా పనిచేస్తున్న పున్నం రవీందర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీగా పనిచేసిన పి.ప్రశాంత్‌రెడ్డిని కాజీపేట ఏసీపీగా, మామునూరు ఏసీపీగా పనిచేస్తున్న బి.తిరుపతి డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో ఖమ్మం ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటేష్ బదిలీపై వచ్చారు. రాచకొండ ‘షీ’ టీమ్ ఏసీపీగా పనిచేస్తున్న పి.నర్సింహారావు హనుమకొండ ఏసీపీగా, హనుమకొండ ఏసీపీగా పనిచేస్తున్న కొత్త దేవేందర్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.సదయ్య వరంగల్ సీసీఎస్ ఏసీపీగా బదిలీ అయ్యారు. ఇప్పటికే బదిలీ అయిన స్థానాల్లో పలువురు ఏసీపీలు రిపోర్టు చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన కిరణ్‌కుమార్ సీసీఎస్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. పి.ప్రశాంత్‌రెడ్డి కాజీపేట ఏసీపీగా, నర్సంపేట ఏసీపీగా పున్నం రవీందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వెలువడిన ఉత్తర్వుల్లో సీసీఎస్ ఏసీపీగా పి.సదయ్య బదిలీ అయినట్లు ఉండడం గందరగోళానికి తావిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా వలీఉల్లాఖాద్రీ కేయూ క్యాంపస్: అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శిగా వరంగల్‌కు చెందిన డాక్టర్ వలీ ఉల్లాఖాద్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలోని తిరుపతిలో నాలుగురోజులుగా నిర్వహించిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో వలీఉల్లాఖాద్రీని జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వలీఉల్లాఖాద్రీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్రపోషించారు. కేయూ వేదికగా అనేక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా కూడా దేశం వ్యాప్త విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. వలీఉల్లాఖాద్రీ కేయూలో కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగం నుంచి డాక్టరేట్ పొందారు. -
ఓరుగల్లు కీర్తి ప్రతిష్టను పెంచేలా..
ఖిలా వరంగల్ : ఓరుగల్లు కీర్తి ప్రతిష్టతను మరింత పెంచేలా.. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన వరంగల్ రైల్వేస్టేషన్‌ను ఈనెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ (ఏసీఎం) ఎస్ఆర్.మూర్తి తెలిపారు. ఈమేరకు సోమవారం వరంగల్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.25.41కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ కింద తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వరంగల్ రైల్వే స్టేషన్ సరికొత్తగా రూపుదిద్దుకుందన్నారు. విశాల ప్లాట్ ఫామ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, విశ్రాంతి గదులు, ఆధునిక టాయిలెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేషన్ గోడలకు కాకతీయుల కళావైభం ఉట్టిపడేలా రంగుల చిత్రాలు వేశామని, ప్రయాణికులకు సరికొత్త అనుభూతి కలిగేలా ఆహ్లాదం, పచ్చని తోరణాలు, ఆకట్టుకునే విద్యుత్ కాంతులు, 12 ఫీట్ల వెడల్పుతో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించామని వివరించారు. అనంతరం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇన్చార్జ్ స్టేషన్ మేనేజర్ కె.సారయ్య, సీసీఐ ఇన్స్పెక్టర్ రాజగోపాల్, ఐఓడబ్ల్యూ శ్రీనివాస్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.. కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని పలు పాఠశాలల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ‘మేరా అమృత్ స్టేషన్ అండ్ ఆపరేషన్ సిందూర్’ అనే అంశంపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈ నెల 22న ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 103 పునరాభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభిస్తారని, వీటిలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం, సోమవారం వరంగల్, రామగుండం, కరీంనగర్లో వివిధ పాఠశాలల్లో వ్యాస రచన, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించగా 170 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వరంగల్ అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం రోజున విజేతలకు ముఖ్య అతిథులతో సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. అత్యాధునిక హంగులతో వరంగల్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ 22న వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్(ఏసీఎం) ఎస్ఆర్.మూర్తి -
పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి
● కేయూలో ఆందోళనకు దిగిన విద్యార్థులు ● నేటినుంచి పరీక్షలు యథాతథం : కేయూ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 20 నుంచి పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్ రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) విద్యార్థులకు నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పరీక్షలు వాయిదా వేయాలని సోమవారం రాత్రి 9.30 నుంచి 11.30 గంటల వరకు క్యాంపస్‌లోని విద్యార్థులు కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళన చేశారు. కేయూ పోలీస్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్ అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. పరీక్షల వాయిదా విషయమై కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్‌ను వివరణ కోరగా, ఈనెల 20నుంచి కేయూ పరిధిలో యధావిధిగా పీజీ కోర్సుల నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి వాయిదా వేశామని, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులు ఎవరూ వాయిదా వేయాలని కోరుకోవడం లేదన్నారు. సెమిస్టర్ పరీక్షలు యధావిధిగా ఉంటాయని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కూడా స్పష్టంచేశారు. -
ప్రముఖుల పుష్కర స్నానం..
కాటారం/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా సోమవారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, వైరా ఎమ్మె ల్యే రాందాస్‌నాయక్, హైకోర్టు జడ్జి నందికొండ నర్సింగరావు దంపతులు, త్ర యంబకేశ్వర్ నాసిక్‌కు చెందిన మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామి సరస్వతి ఘాట్ వద్ద త్రివేణి సంఘమంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం సరస్వతి మాతను దర్శించుకుని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. జడ్జి దంపతులకు కలెక్టర్ రాహుల్‌శర్మ, భూపాలపల్లి న్యాయమూర్తి అఖిల.. సరస్వతీమాత చిత్రపటం అందజేశారు. ఆలయ అధికారులు సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామికి సరస్వతీమాత విగ్రహం బహూకరించారు. -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
● సరస్వతీ నది పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం ● ఐదో రోజు 80వేల మంది పుణ్యస్నానాలుభూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు సోమవారం ఐదోరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమాతకు పూజలు చేశారు. చీరె, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పిండ ప్రదానాలు, పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. భక్తులతో పుష్కరిణి నిండిపోయింది. పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. తగ్గిన రద్దీ పుష్కరాలకు భక్తుల రద్దీ తగ్గింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి.. మంథని, కాటారం మీదుగా.. అలాగే మంచిర్యాల, గోదావరిఖని, చెన్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్ నుంచి భక్తులు వాహనాల్లో తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లు ఏర్పాటు చేసి నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది. శని, ఆదివా రాల్లో రెండేసి లక్షల చొప్పున భక్తులు రాగా.. సోమవారం 80వేల మంది పుణ్యస్నానాలు ఆచరించిన ట్లు అధికారులు అంచనా వేశారు. నదీహారతికి రద్దీ సరస్వతీ ఘాట్‌లో కాశీపండితులచే ఏర్పాటు చేసిన నవరత్నమాలిక హారతికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఏడు గద్దెలపై తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నా రు. తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. సరస్వతీ అమ్మవారి విగ్రహం వద్ద భక్తులు దర్శించుకున్నాక జ్ఞానతీర్థం వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగారు. నాసిక్ పీఠాధిపతి పూజలు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందా సరస్వతీ మహారాజ్ ముందుగా త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతీనది లో పుష్కర స్నానం.. విశేష పూజలు నిర్వహించా రు. అనంతరం రాజగోపురం వద్ద అర్చకులు, అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకుని పూజలు చేశారు. -
డీసీసీబీని మరింత ప్రగతిలోకి తీసుకెళ్లాలి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు హన్మకొండ: వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)ని మరింత ప్రగతిలోకి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకు ప్రగతి, బ్రాంచ్‌ల పనితీరును సమీక్షించారు. ఆడిట్ నివేదికను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రుణాలు ఇవ్వడంతో పాటు డిపాజిట్లు సేకరించాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ డీసీసీబీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిన సందర్భంగా చైర్మన్ రవీందర్ రావును బ్యాంకు వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు, డీసీఓలు, బ్యాంకు అధికారులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, డైరెక్టర్లు హరిప్రసాద్, ఎన్నమనేని జగన్ మోహన్ రావు, రాజేశ్వర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మాడుగుల రమేశ్, దొంగల రమేశ్, గోపాల్ రావు, యాదగిరి రెడ్డి, నర్సింగ రావు, శ్రీనివాస్, రవిరాజు, నరేందర్, ప్రదీప్ చందర్, డీసీఓ సంజీవ రెడ్డి, నాబార్డ్ డీడీఎం చంద్ర శేఖర్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎం పద్మావతి, టీజీ క్యాబ్ జీఎం సుజాత, డీజీఎం అశోక్, ఏజీఏం రాజు, మేనేజర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్లకు స్థానచలనం ● నాయబ్ తహసీల్దార్లు కూడా.. హన్మకొండ అర్బన్: ఇటీవలహహనుమకొండ జిల్లాకు బదిలీపై వచ్చిన తహసీల్దార్లకు కలెక్టర్ ప్రావీణ్య పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న కొందరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పించారు. వారితోపాటు పలువురు నాయబ్ తహసీల్దార్లకు కూడా స్థానచలనం కల్పించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల వివరాలు.. భీమదేవరపల్లి తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.ప్రవీణ్‌కుమార్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇటీవల వరంగల్ జిల్లా నుంచి వచ్చిన బి.రాజేశ్‌కు పోస్టింగ్ ఇచ్చారు. వేలేరు తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెచ్.కోమిని కలెక్టరేట్ బదిలీ చేశారు. వేలేరుకు కలెక్టరేట్లో సూపరిటెండెంట్‌గా ఉన్న ఏవీఎన్వీ ప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చారు. పరకాల ఆర్డీఓ కార్యాలయం డీఏవోగా విధులు నిర్వర్తిస్తున్న టి.విజయలక్ష్మికి పరకాల తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. పరకాల ఆర్డీఓ కార్యాలయం డీఏఓగా కరీంనగర్ నుంచి ఇటీవల వచ్చిన సీహెచ్. రాజుకు పోస్టింగ్ ఇచ్చారు. నడికూడ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.నాగరాజును కలెక్టరేట్‌కు బదిలీ చేసి అక్కడికి తహసీల్దార్‌గా ఇటీవల సిద్దపేట జిల్లా నుంచి వచ్చిన జి.రవీందర్‌రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల బదిలీల్లో ములుగు జిల్లా నుంచి హనుమకొండ జిల్లాకు వచ్చిన తహసీల్దార్ డి.సమ్మయ్యకు కలెక్టరేట్లో పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టరేట్ పోస్టింగ్స్ ఇచ్చిన తహసీల్దార్లకు సెక్షన్లు కేటాయించాల్సి ఉంది. నాయబ్ తహసీల్దార్లు.. జిల్లాలో నాయబ్ తహసీల్దార్లకు కూడా స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. పరకాలలో పనిచేస్తున్న కె.సూర్యనారాయణను జిల్లా కేంద్రంలోని భూసేకరణ విభాగానికి, పౌరసరఫరాల సంస్థలో పనిచేస్తున్న శివతేజను కలెక్టరేట్‌కు, కలెక్టరేట్లో పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ను ఐనవోలుకు, పరకాల ఆర్డీఓ ఆఫీస్‌లో పనిచేస్తున్న సుమన్‌ను పరకాల తహసీల్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద విద్యారణ్యపురి/న్యూశాయంపేట: ఈనెల 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 3 నుంచి జరగనున్న టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 16 ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో 5,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక ప్లయింగ్ స్క్వాడ్, సీఎస్డీఓలను 16మంది చొప్పున నియమించారు. ఈ సమావేశంలో డీఐఈఓ శ్రీధర్‌సుమన్, డెక్ సభ్యులు మాధవరావు, విజయనిర్మల, జిల్లా విద్యాశాఖాధికారి మామిడి జ్ఞానేశ్వర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తిన్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే 163–జి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయ్యిందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. హైవేలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలం నెక్కొండ, పత్తిపాక, వెంకటాపూర్, ఆలంఖాన్‌పేట, చంద్రుగొండ, తోపనపల్లి, అప్పలరావుపేట, గ్రామాల రైతులతో సోమవారం కలక్టరేట్లో కలెక్టర్ ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఆర్డీఓ ఉమారాణి, నెక్కొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎన్‌హెచ్ హైవే టీం లీడర్ సంపత్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు, కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరున్ని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలో వేచి చూశారు.– మరిన్ని ఫొటోలు 8లోu -
ఆక్రమణలు.. అతిక్రమణలు
వరంగల్ అర్బన్: రోడ్లు, డ్రెయినేజీల ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేని కట్టడాలపై బల్దియా గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు సోమవారం వెల్లువలా వచ్చాయి. ఎన్నిసార్లు దరఖాస్తులు అందించినా క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించడం లేదని పలు కాలనీవాసులు బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాడకే దృష్టికి తీసుకొచ్చారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులను కమిషనర్ స్వీకరించారు. గ్రీవెన్స్‌కు మొత్తం 99 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 56 దరఖాస్తులు రావడం గమనార్హం. కనీస వసతుల కోసం ఇంజనీరింగ్ సెక్షన్‌కు 16, ప్రజారోగ్యానికి 14, పన్నుల విభాగానికి 7, తాగునీటి సరఫరాపై 6 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని.. ● మడికొండలోని 646, 647 సర్వే నంబర్లలోని స్థలాన్ని డెవలపర్స్ తప్పుడు సర్వే నంబర్లతో కుంట కట్టను తొలగించి, ఎఫ్‌టీలో పాట్లు చేసి, తమ సొంత భూములకు కూడా కబ్జా చేస్తున్నారని బాధితులు వాపోయారు. కబ్జాదారులపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ● హంటర్ రోడ్డులో 196 ఇళ్లకు గత రెండేళ్లుగా పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని బాధిత ఇళ్ల యజమానులు కోరారు. ● 1వ డివిజన్ పెగడపల్లి ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లే దారిలో డ్రెయినేజీ వ్యవస్థ లేక మురుగు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ● 57వ డివిజన్ అశోకా కాలనీలో మురుగు కాల్వ లు లేక చిన్నపాటి వర్షానికే వరద నీరు ఇళ్లల్లోకి వస్తోందని, ఈక్రమంలో డ్రెయినేజీతో పాటు కల్వర్ట్ నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ● హనుమకొండ శ్రీనగర్ కాలనీలో ఇంటి నంబర్ 2 – 8 – 456 వద్ద డ్రెయినేజీ లేక రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని మణెమ్మ ఫిర్యాదు చేశారు. ● హనుమకొండ న్యూ బృందావన్ కాలనీలో కుక్కల బెడద విపరీతంగా ఉందని, ఈక్రమంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించారు. ● మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే సొసైటీకి 2016 నుంచి 2025 వరకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ● భద్రకాళి గుడి రోడ్డులో ఓ ప్లాట్ యాజమాని రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్నాడని, ఈక్రమంలో అతడిపై చర్య తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 2వ డివిజన్ పెగడపల్లిలో నాలుగేళ్ల క్రితం ఇళ్లను నిర్మించుకున్నామని, ఈక్రమంలో ఇంటి నంబర్లు కేటాయించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● మడికొండ హిల్స్ కాలనీలో కొంతమంది రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, బాధ్యులపై చర్య తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. ● హంటర్ రోడ్డులో ప్రతిపాదిత పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారని, ఈక్రమంలో ఆ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు విన్నవించారు. ● ఒక్కో సెలూన్ షాపు ఏర్పాటుకు 250 మీటర్ల దూరం ఉండేలా అనుమతులు ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వాటిపైనే వెల్లువలా ఫిర్యాదులు కనీస వసతులు కల్పించాలని ప్రజల విన్నపాలు గ్రీవెన్ సెల్లో దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ -
నేడు కాకతీయ వారసుడి రాక
హన్మకొండ: కాకతీయ 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ మంగళవారం వరంగల్ పర్యటనకు వస్తున్నారని టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య తెలిపారు. పర్యటనలో భాగంగా భద్రకాళి, వేయి స్తంభాల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు హనుమకొండ నక్కలగట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైన్స్ కోర్సు పీహెచ్డీ తరగతుల పరిశీలనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సైన్స్ విభాగాల పరిశోధకుల ప్రీ పీహెచ్డీ కోర్సు వర్క్‌లో భాగంగా క్యాంపస్‌లోని గణితశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో నిర్వహిస్తున్న కామన్ టాపిక్స్ తరగతుల నిర్వహణను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం సోమవారం పరిశీలించారు. రీసెర్చ్ మెట్రిక్స్, ప్లగరిజం, టెక్నికల్ రిపోర్ట్ రైటింగ్ వంటి పలు అంశాలపై ఈనెల 31వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని ఆ విభాగం అధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ భారవీశర్మ తెలిపారు. రిజిస్ట్రా ర్ వెంట ఓఎస్డీ ప్రొఫెసర్ మల్లారెడ్డి, ప్లగరిజం డైరెక్టర్ ఎల్పీ.రాజ్‌కుమార్ ఉన్నారు. జీఎంహెచ్‌లో ప్రత్యేక విభాగంహన్మకొండ చౌరస్తా/ఎంజీఎం: గర్బిణుల నమోదు, ప్రసవాల శాతం పెంచేందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ చాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గర్భిణులకు ఇబ్బందులు కలుగకుండా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, జీఎంహెచ్ సిబ్బంది వైద్యులకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేక సెల్ ఉంటుందని చెప్పారు. అందుకు ముగ్గురు మహిళా పబ్లిక్ హెల్త్ అధికారులను డిప్యుటేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతీ గర్భిణికి మొదటి రెండు చెకప్‌లు పీహెచ్సీ డాక్టర్ వద్ద, మూడు, నాలుగు చెకప్‌లకు హనుమకొండలోని జీఎంహెచ్ తప్పనిసరి వచ్చేలా కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, పీహెచ్ఎన్లు లీల, సుందరి, హెచ్ఈఓ రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 23న జాబ్ మేళా హన్మకొండ అర్బన్: నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో వరంగల్, హనుమకొండలో సేల్స్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి 20 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అట్రాసిటి కేసు విచారణ అధికారిగా ఏసీపీ తిరుపతిఖిలా వరంగల్ : వరంగల్ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్‌పై ఆదివారం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, అత్యాచారయత్నం కేసు విచారణ అధికారిగా మామునూరు ఏసీపీ తిరుపతిని నియమిస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును సమగ్రంగా, పాదర్శకంగా విచారించాలని ఆదేశించారు. ‘భద్రకాళి’ని దర్శించుకున్న హైకోర్టు జడ్జి హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాన తన కుటుంబ సమేతంగా అమ్మవారిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారిని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వేయిస్తంభాల ఆలయంలో.. వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. -
– సాక్షి, వరంగల్/వరంగల్ అర్బన్
కేవలం ఒక మనిషి వెళ్లేంత వెడల్పుతో ఉన్న మెట్ల మార్గం.. సరిపడేంత స్థలం లేని మెట్లు.. కనిపించని వెంటిలేషన్.. ఇది సోమవారం ఉదయం హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ పరిస్థితి. షార్ట్ సర్క్యూట్‌తో పొగలు వ్యాపించిన ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. గుల్జార్ హౌస్వంటి ఇరుకై న భవనాలు గ్రేటర్ వరంగల్‌లో వేలాది ఉన్నాయి. ఇక్కడా అగ్గి రాజుకుంటే అంతే సంగతి. యథేచ్ఛగా అనుమతులు.. బల్దియా టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం కూడా వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇవ్వాలి. కానీ ఎన్ఓసీ ఉందా? లేదా? అనేది పట్టించుకోకుండానే ఆ సర్టిఫికెట్లను యఽథేచ్ఛగా జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా తనీఖీ చేసి ఫైర్ సేఫ్టీ లేకపోతే నోటీసులు జారీ చేసి జరిమానాలు విఽ దించడం, ఒకవేళ ఉంటే లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేలా అధికారులు చూడాలి. అధికారులు ఇప్పటికైనా మేల్కోకపోతే హైదరాబాద్ తరహాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో వరంగల్ పోచమ్మమైదాన్‌లోని జకోటియా మాల్లో ఏసీ కంప్రెషర్లు పేలాయి. భారీ శబ్దాలతో స్థానికులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అప్పుడూ ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గ్రే టర్ వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని చాలా కాలనీల్లో ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటిలో వెంటిలేషన్, కిటీకీలు ఎక్కువగా లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భారీగా ప్రాణనష్టం ఉండే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలోని గుల్జార్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ఘోర అగ్నిప్రమాదంతో ఇక్కడి భద్రత చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా వరంగల్ బట్టలబజార్, పిన్నావారి వీధి, గిర్మాజీపేట, చౌర్బౌళి, మండిబజార్, పోచమ్మ మైదాన్, పాపయ్యపేట చమన్, పాఠక్ మహేల్, గోపాల స్వామి గుడి, ఎల్బీనగర్, పోతన నగర్ తదితర ప్రాంతాల్లో ఇరుకు రహదారుల్లో కనీసం పార్కింగ్‌కు కూడా స్థలం కేటాయించకుండా భారీ భవనాలు నిర్మించారు. కొన్ని భవనాలకు ఇరుకు కాలనీల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా చాలా సమయం పడుతుంది. ఫైర్ వాహనాలు కూడా కొన్ని కాలనీలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే ఊహించని నష్టం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా మేల్కొనాల్సిందే.. భవనాల్లో నాసిరకమైన కేబుళ్లు, పాత వైరింగ్, సా మర్థ్యానికి మించి ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగించడం కారణంగా షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నగరంలోని చాలా కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడం, అగ్నిమాపక యంత్రాలు వెళ్లే దారి లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఏళ్ల కిందట నిర్మించిన ఈ నివాసాల్లో పాత వైరింగ్, అతుకుల తీగలను తీసేసి కొత్త వైరింగ్ చేసుకోవాలి. ఇప్పటికై నా అన్ని ఇళ్లలో వెంటిలేషన్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గించవచ్చు. పొగ బయటకు వెళ్లే వీలుంటే జనాలు అపస్మారక స్థితి చేరుకునేలోపు అక్కడి నుంచి బయటపడేందుకు వీలుంటుంది. నిబంధనలు పాటిస్తేనే.. నగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హస్టళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు, డింబర్ డిపోలు, ఫర్నిచర్ షాపులు, కోల్డ్ స్టోరేజీలు, పత్తి మిల్లులు, ఇతర పరిశ్రమలు వేల సంఖ్యల్లో వెలిశాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే భవనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో చిన్న అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా.. ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. నగర పరిధిలో జీ ప్లస్ 9 నుంచి 15 మీటర్లలోపు వాణిజ్య భవనాలకు, 15 నుంచి 18 మీటర్లలోపు అపార్టుమెంట్లకు బల్దియా ఫైర్ వింగ్ నిరభ్యంతరం (ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే ఎత్తు ఉంటే వాటికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కావాలి. కానీ.. నగరంలో జరుగుతున్న ఎత్తయిన వాణిజ్య, నివాస కట్టడాలకు ఎన్ఓసీ ఉండడం లేదు. 57 మల్టీ స్టోరేజీ భవనాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. నగరంలో అగ్ని ప్రమాదాల వివరాలు (రూ. కోట్లలో)సంవత్సరం కేసులు ఆస్తి నష్టం రక్షించిన ఆస్తి2022 68 28,30,55,000 2,94,15,000 2023 67 2,04,21,000 8,07,70,000 2024 63 4,05,62,250 26,54,40,000 2025 50 51,43,000 1,87,63,000 వెంటిలేషన్ లేకుండా నిర్మించిన భవనాలు అనేకం అగ్ని ప్రమాదం జరిగితే పొగతో ఉక్కిరిబిక్కిరే.. నాణ్యమైన విద్యుత్ పరికరాలు వినియోగిస్తే మంచిది హైదరాబాద్ గుల్జార్ హౌస్ ఘటనతోనైనా మేల్కొనాలి -
ఘనంగా తిరంగా యాత్ర
హన్మకొండ: ఆపరేషన్ సిందూర్ విజయంతో సైన్యానికి సంఘీభావంగా తిరంగా యాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, విద్యార్థులు భారత జాతీయ పతాకాన్ని చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు భారత్ సరైన జవాబు చెప్పిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు నైపుణ్యాలు పెంపొందించుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ సూచించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండోదఫా ఐదురోజుల పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్ఎం వెంకటేశ్వర్రావు, కోర్సు కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు, రిసోర్స్పర్సన్లు, తదితరులు పాల్గొన్నారు. -
బయో గ్యాస్ ప్లాంట్‌కు చొరవ తీసుకోవాలి
వీసీలో పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో వెలువడే 20 టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి కంప్రెస్ట్ బయో మిథైన్ గ్యాస్‌గా మార్చేందుకు వేస్ట్ – టు బయో మిథనైజేషన్ ప్లాంట్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ద్వారా నగర పరిశుభ్రత మెరుగు పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రూపకల్పన, నిర్మాణం, వితరణ, నిర్వహణ, బదలాయింపు, మోడల్ ఆధారంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి అయ్యే బయోమైథెన్ గ్యాస్‌ను మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని శ్రీదేవి అన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, మాధవి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు ఉద్యమాల గడ్డ
● ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ న్యూశాయంపేట/రామన్నపేట : ఓరుగల్లు ఉద్యమాల గడ్డ.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వరంగల్ ప్రజలు ఐక్యంగా ఉండి ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగేలా అడుగులు వేయడం అబినందనీయమని ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆదివారం రాత్రి వరంగల్ ఎంజీఎం సమీప ఇస్లామియా గ్రౌండ్లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల 22న మహిళలతో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 25న రాష్ట్ర హ్యూమన్ చైన్(మానవహారం), జూన్ 1న ఇందిరా పార్కు వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సభలో బీఆర్ఎస్ నాయకులు సోహైల్, ముస్లిం మత పెద్దలు మీర్ ఇద్రిసాలీ, ఉమర్ అబేదిన్, మౌలానా ఫసీయోద్దీన్ ఖాస్మీ, జలీల్‌ఖాన్, సయ్యద్ అబ్దుల్ సుబాన్, అబ్దుల్ ఖుద్దుస్, సయ్యద్ మసూద్, జుబేర్, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు మేకల రవి, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభలో అధిపత్య పోరు ఈ బహిరంగలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య అధిపత్య పోరు కనిపించింది. తమను సభా వేదికలో ప్రసంగించకుండా అడ్డుకుంటున్నారని ఇరు పార్టీల మద్దతుదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లా బోర్డు పెద్దలు కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగించేలా చేశారు. సెల్‌ఫోన్ లైట్లతో మద్దతు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభకు హాజరైన ముస్లింలు సెల్‌ఫోన్ లైట్లు వెలిగించి మద్దతు తెలిపారు. సభ ప్రారంభంలో పహల్గాం ఉగ్రవాద దాడితో మృతిచెందిన భారతీయులకు, యుద్ధంలో మృతి చెందిన సైనికుల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
అన్నదానం.. మహాప్రసాదం
భోజన సౌకర్యం బాగుంది..సరస్వతీనది పుష్కరాలకు రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా వచ్చాం. అన్నదాన సత్రాల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. చాలా రుచిగా, శుభ్రంగా ఉంది. – అనురాధ, భక్తురాలు, మంచిర్యాలకాటారం /మల్హర్: అన్నం పరబ్రహ్మ సర్వూపం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం పెట్టినా చాలు ఎంతో పుణ్యం లభిస్తుంది. అందుకే సేవాభావంతో పలువురు ప్రముఖ దైవక్షేత్రాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదే మాదిరి ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో ముక్తీశ్వరాలయ సమీపంలో దాదాపు 8 చోట్ల అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అన్నదాతలు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసి భక్తుల కడుపునింపుతున్నారు. ఒక్క పూటకు నాలుగు నుంచి ఆరు వేల మంది భక్తులకు ఉచిత అన్నదానాలు చేస్తున్నారు. ప్రతీ రోజు టిఫిన్, అన్నదానం.. సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్యవైశ్య, బ్రహ్మణ, ఈశ్వరకుమారి, వాసవీ క్లబ్, ఇతరాత్ర ట్రస్ట్‌ల ద్వారా ఏర్పాటు చేసిన అన్నప్రసాద సత్రాల ద్వారా భక్తులకు ప్రతీ రోజు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఏదో ఉచిత భోజనం అందిస్తున్నామనే కాకుండా నిర్వాహకులు నాణ్యతతో కూడిన రుచికర భోజనం అందిస్తున్నారు. ఉదయం పలు రకాల అల్పాహారంతోపాటు భోజనంలో రెండు రకాల కూరలు, పప్పు, సాంబారు, పెరుగు, స్వీట్లు, పచ్చడి పెడుతున్నారు. రుచికరం, పరిశుభ్రంగా ఉండడంతో భక్తులు సత్రాల్లో భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.సేవలు అభినందనీయం.. పుష్కరాలకు పిల్లలతో కలిసి చాలా దూరం నుంచి వచ్చాం. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందాం. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అన్నదాన సత్రాల్లో భోజనం లభించింది. సమయానికి మా ఆకలి తీరింది. అన్నదానం నిర్వాహకుల సేవలు అభినందనీయం. – శ్రీనివాస్, భక్తుడు, కరీంనగర్ పుష్కరాల భక్తులకు పలు ట్రస్ట్‌ల నిత్యాన్నదానం పన్నెండు రోజుల పాటు ఉచితంగా టిఫిన్, భోజనం భక్తుల ఆకలి తీరుస్తున్న సత్రాలు -
హామీల అమలులో కేంద్రం విఫలం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఎల్కతుర్తి: హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల పదో మహాసభలకు ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అందిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆ హామీల అమలులో పూర్తిగా విఫలం చెందారన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మనుధర్మ శాస్త్ర అమలుకు కుట్ర పన్నుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్, మండల కార్యదర్శి ఉట్కూరి రాములు, మర్రి శ్రీనివాస్, కర్రె లక్ష్మణ్, సంతోశ్, రాజ్‌కుమార్, బొంత మల్లయ్య, నిమ్మల మనోహర్, ఉట్కూరి ప్రణీత్, విజయ్, రాజనర్సు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన నెట్‌బాల్ పోటీలు ● విజేతలకు బహుమతుల ప్రదానం జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి 8వ సబ్ జూనియర్ బాల బాలికల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 620 మంది బాలురు, బాలికా క్రీడాకారులు హాజరయ్యారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5, మిక్స్డ్ డబుల్స్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5 పోటీలు ఈనెల 17న ముగియగా.. చివరగా మిక్స్డ్ డబుల్స్ పోటీలతో ముగింపు పలికారు. మిక్స్డ్ డబుల్స్‌లో మహబూబ్‌నగర్(విన్నర్), కామారెడ్డి(రన్నర్), థర్డ్ ప్లేస్‌లో వరంగల్/నాగర్ కర్నూల్ సంయుక్త విజేతలుగా నిలువగా, మూడు కేటగిరీల్లో విజయం సాధించిన టీంలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. -
ఉద్యమ జీవి నల్లెల రాజయ్య
విద్యారణ్యపురి: ఉద్యమ జీవి నల్లెల రాజయ్య చిరస్మరణీయుడని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ అన్నారు. ఆదివారం హ నుమకొండ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన ‘ప్రజల మనిషి నల్లెల రాజయ్య’ పుస్తకాన్ని ఆ యన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు. సి. చంద్ర ప్రధాన సంపాదకుడిగా, అనిశెట్టి రజిత, డాక్టర్ కెబి. చంద్రభాను, బిల్ల మహేందర్, పిట్ట సాంబయ్య, రౌతు అజయ్‌కుమార్ సంపాదకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో వ్యాసాల సంపుటి(పుస్తకం)ని రూపొందించారు. కేయూ రిటైర్డ్ ఆచార్యుడు బన్నఅయిలయ్య,ప్రముఖ కవి వీఆర్ విద్యార్థి, టీపీఎఫ్ కన్వీనర్ రమాదేవి మాట్లాడారు. కవి కోడం కుమారస్వామి పుస్తకాన్ని సమీక్షించారు. వ రంగల్ రచయితల సంఘం కార్యదర్శి దండ్రె రాజ మౌళి, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు భిక్షపతి, తిరుపతయ్య, సాంబయ్య, ఉదయ్‌సింగ్, మెట్టురవీ ందర్, జిడి. సారయ్య, మార్కశంకర్‌నారాయణ, కె. శంకర్రావు, వి. దిలీప్, బండారు సుజాత, బోనగిరి రాములు, ఎ. విద్యాదేవి, రాజేంద్రప్రసాద్, కుటుంబీకులు సుగుణ, వెన్నెల, సూర్య పాల్గొన్నారు.● కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ -
నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాక
ప్రముఖుల పుష్కర స్నానం.. కాటారం/కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా ఆదివారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. హైకోర్టు జడ్జి సుధా దంపతులు, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్, జెన్కో డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ అనురాధ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. సరస్వతి(వీఐపీ)ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం చేరుకుని స్వామి వారికి, సరస్వతీమాతా, శుభానందాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హైకోర్టు జడ్జి సుధాకు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే స్వాగతం పలికి మొక్కను బహూకరించారు.నిఘా నీడలో కాళేశ్వరం భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా పోలీసులు ముందస్తు నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం, మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దులో కాళేశ్వరం ఉండడంతో అంతర్రాష్ట్ర వంతెన నుంచి మొదలు.. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం, పరిసర ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, పుష్కర ఘాట్, ప్రధాన రహదారుల్లో సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిత్యం పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఇప్పటి వరకై తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఎండవేడితో భక్తుల అస్వస్థత భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో ఎండ వేడితో భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. పుష్కరాలో భాగంగా నాలుగో రోజు ఆదివారం 8 మంది భక్తులు ఎండవేడికి అస్వస్థతకు గురికాగా 108లో కాళేశ్వరం పీహెచ్‌సీకి తరలించారు. పీహెచ్సీలో ఆదివారం 156 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా 30 మంది భక్తులను అడ్మిట్ చేసుకున్నారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన క్యాంపుల ద్వారా సుమారు 4వేల మంది భక్తులకు వైద్య సేవలు అందించామని డీఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు.కలెక్టర్ జాయ్ రైడ్.. భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ జాయ్ రైడ్ చేసి సరస్వతీనది పుష్కర సదుపాయాలను పరిశీలించారు. ఆదివారం ఉదయం కరీంనగర్ సీపీ గౌస్ అలం, కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి హెలికాప్టర్లో పుష్కర పరిసరాలు పరిశీలించారు. పుష్కర ఘాట్లు, రహదారి సదుపాయాలు, శానిటేషన్, పారిశుద్ధ్య చర్యలు, టెంట్ సిటీ, స్టాళ్లు, భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. అనంతరం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు హెలికాప్టర్ ద్వారా త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వరం చుట్టు పక్కల అడవులు, తదితర అందాలను వీక్షించడానికి జాయ్ రైడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భూపాలపల్లి: సరస్వతీనది పుష్కరాలకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం రోడ్డు మార్గాన కాళేశ్వరం రానున్నారు. ఉదయం 10.30 గంటలకు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానం ఆచరించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. 12 గంటలకు తిరిగి కరీంనగర్‌కు వెళ్లనున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా సోమవారం కాళేశ్వరం రానున్నట్లు సమాచారం. -
భక్తజన ప్రవాహం
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025– 8లోuరేపటి నుంచి పీజీ కోర్సుల పరీక్షలు● 26 పరీక్ష కేంద్రాలు.. 4,300 మంది విద్యార్థులు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాలో పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్( నాన్ ప్రొఫెషనల్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సౌజన్య ఆదివారం తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ తదితర కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కేయూ పరిధిలో పీజీ కోర్సుల పరీక్షల నిర్వహణకు 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,300 మంది పరీక్షలు రాయనున్నట్లు వారు తెలిపారు. బాల్య వివాహం అడ్డగింత వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూశాయంపేట ప్రాంతంలో ఆదివారం ఓ కల్యాణ మండపంలో బాలికకు వివాహం జరుగుతున్నట్లు పోలీసులకు అందిన సమాచారంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాలతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు, చైల్డ్‌లైన్ అధికారులు సంయుక్తంగా అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక, యువకుడి తల్లిదండ్రులను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. చిన్నవయస్సులో పెళ్లి చేస్తే తీవ్ర అనర్థాలు కలుగుతాయన్నారు. అత్యాధునిక వసతులతో రైల్వే స్టేషన్ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునిక హంగులు, వసతులతో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయడం అభినందనీ యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ రైల్వేస్టేష న్ను మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, అరూ రి రమేశ్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వేస్టేషన్‌ను ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోదీ పర్చువల్గా ప్రారంభించనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రత్న సతీశ్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, తాబేటి వెంకట్‌గౌడ్, బన్న ప్రభాకర్, ఎరుకుల రఘనారెడ్డి, కనుకుంట్ల రంజిత్ కుమార్, గోకే వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.● విధులకు హాజరు కాకుండానే హాజరైనట్లు సంతకాలు ● చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాలాల పూడికతీత పనుల్లో చేతివాటం తంతుగా మారింది. ఇప్పటికే ప్రతీ పనికి ‘నీకింత.. నాకెంత’లా సాగుతున్న పర్సంటేజీల దందాపై కొందరు కార్పొరేటర్లు, జీడబ్ల్యూఎంసీ అధికారులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నగరం వరద ముంపునకు గురికాకుండా ముందస్తుగా చేపట్టే నాలాల పూడికతీత పనుల్లోనూ కమీషన్ల దందా కలకలం రేపుతోంది. ప్రతీసారి ఆలస్యంగా మొదలుపెట్టే ఈ పూడికతీత పనులు సాగుతున్న తీరు చూస్తే నిజంగానే పూడికతీత కోసమా? లేక నిధుల మేత కోసమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా నాలాల క్లీనింగ్ అరకొరగానే సాగుతోంది. అంచనాలు పెంచి.. కాజీపేట, హనుమకొండ, వరంగల్ ట్రైసిటీస్‌లో ప్రధాన నాలాలతో పాటు అంతర్గత నాలాల పూడికతీత కోసం బల్దియా ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నది. ఆరేళ్లలో సుమారు రూ.9.49 కోట్ల వరకు ఖర్చు చేసిన అధికారులు.. గతేడాది సైతం రూ.2.32 కోట్లు వరకు వెచ్చించారు. అంతకు ముందు సంవత్సరం రూ.1.24 కోట్లుంటే.. చాలాచోట్ల అంచనాలు పెంచి రూ.2.32 కోట్లకు చేర్చారన్న విమర్శలు వచ్చాయి. ప్రధాన నాలాలతో పాటు 42 అంతర్గత నాలాల్లో పూడిక తీతకు డబ్బులు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఆ డబ్బును గ్రేటర్ వరంగల్‌లోని కొందరు ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు అందరినీ ‘సమన్వయం’ చేసి ‘లెక్కలు’ తేలిన పిదపే పనులు ప్రారంభించారన్న చర్చ కూడా ఉంది. ఈసారి కూడా సుమారు కోటిన్నరకు పైగా పూడికతీత పనులకు వెచ్చిస్తున్న బల్దియా చాలాచోట్ల నామినేషన్ పద్ధతిన పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. శంభునిపేట, ఏకశిలానగర్, శివనగర్, ఉర్సు డీకే నగర్, కరీమాబాద్ సాకరాశికుంట, 12 మోరీలు, రామన్నపేట, హంటర్‌రోడ్డు, ఉర్సు బొడ్రాయి, తిరుమల జంక్షన్, వడ్డ్డేపల్లి, ప్రశాంత్‌నగర్, నయీంనగర్, చైతన్యపురి కాలనీ ప్రాంతాలతో పాటు వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధి పలు డివిజన్లలో పూడికతీత పనులు చేపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో పనుల్లో పారదర్శకత కోసం కొత్తగా యాప్‌ను రూపొందించి జీపీఆర్ఎస్, జియో ట్యాగింగ్ పద్ధతిని కూడా కొన్నిచోట్ల ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలాచోట్ల నాలాల పూడికతీత పనులు జేసీబీ, హిటాచీ యంత్రాలతో ౖపైపెన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దగ్గరుండి పని చేయించాల్సి న ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండడం లేదు. దీంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్)ని మాత్రమే తీసి ఇతర వ్యర్థాలను వదిలేస్తున్నారని నగరవాసులు చెబుతున్నారు. ఇటీవల వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో పర్యటించిన నగర మేయర్ గుండు సుధారాణి పూడికతీత పనులు పరిశీలించారు. వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు ● రెండో దశలో ఎస్‌ఏలకు.. ● మెరుగైన బోధనే లక్ష్యంగా ట్రైనింగ్పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు● సరస్వతి నది పుష్కరాలకు పోటెత్తిన భక్తులు ● తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు రద్దీ ● ఆలయాల్లో దర్శనాలు.. పుష్ప గిరి పీఠాధిపతి విద్యా భారతి స్వామి పూజలు ● సుమారు 1.80 లక్షల మంది పుష్కర స్నానాలు.. పర్యవేక్షించిన కలెక్టర్ రాహుల్ శర్మ న్యూస్రీల్పూడికతీత పనుల్లో కమీషన్ల వేట ‘గ్రేటర్’లో కొనసాగుతున్న తంతు ఏటా రూ.కోట్లు తగలేస్తున్న ‘బల్దియా’ మొక్కుబడిగా పనులు.. నామమాత్రంగా తనిఖీలు గత అక్రమాలపై ఫిర్యాదులు.. తేల్చని ‘విజిలెన్స్’ ‘విజిలెన్స్’ విచారణ బుట్టదాఖలు ఎప్పటిలాగే ఈసారి కూడా పనులను ఆలస్యంగా మొదలెట్టారు. జూన్ 2 నుంచే వర్షాలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసినా పూడికతీత పనులు వేగంగా సాగడం లేదు. సగం పనులు పూర్తయ్యేలోపే వర్షాలు పడితే గతంలో మాదిరిగానే ఈసారి విడుదలైన నిధుల్లో సగానికి పైగా స్వాహా అయ్యే అవకాశాలు ఉన్నాయని బల్దియా అధికారులు, కార్పొరేటర్లే అంటున్నారు. పూడికతీత పనుల్లో అక్రమాలు జరిగాయంటూ గతంలో కొందరు మాజీ కార్పొరేటర్లు, పౌరుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. చర్యలు మాత్రం లేకపోవడంతో నిధుల దుర్వి నియోగం సర్వసాధారణంగా మారింది.లక్ష్యం మేరకు పూడిక తీయట్లేదు.. భద్రకాళి చెరువు మరింత లోతు పూడిక తీయాల్సింది. 3లక్షల క్యూబిక్ ఫీట్లు పూడిక తీయాల్సి ఉండగా సగం కూడా పూర్తికాలేదు. అధికారులు మాత్రం 70శాతం అయ్యిందని మంత్రులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలా అయితే వర్షాకాలంలో చెరువునిండి నీరు బయటకు వస్తుంది. వర్షాలుపడే లోపే పూడికతీత పూర్తిచేయాలి. భద్రకాళి చెరువులోకి డ్రెయినేజీ నీరు రాకుండా గోడ నిర్మించాలి. – పుల్లూరు సుధాకర్, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు -
క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేయూ క్యాంపస్: తెలంగాణలో క్రీడా రంగాభివృద్ధి కి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుమారు డు నాయిని విశాల్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని యూనివర్సి టీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నాయిని టీ–10 లీగ్ సీజన్–2 క్రికెట్ పోటీలు ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2015లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో విశాల్‌రెడ్డి మరణించడంతో ఆయన జ్ఞాపకాలను రాజేందర్‌రెడ్డి విశాల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి విశాల్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం -
విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలి
విద్యారణ్యపురి: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఎయిడ్స్, హెచ్ఐవీపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి వరకు కొవ్వొత్తులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్‌తో మరణించిన వారిని స్మరించుకుంటూ ప్రజల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ ఎవరైతే హెచ్ఐవీతో జీవిస్తున్నారో వారికి సంఘీభావంగా ఉండేందుకు ఈకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రి, పరకాలలోని సీఎస్సీ ఐసీటీసీ సెంటర్లుగా పని చేస్తున్నాయన్నారు. 2024–25లో 55,000ల మందిని పరీక్షించగా.. 100 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ గీత, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణఽ సంస్థ మేనేజర్ స్వప్నమాధురి, ఐసీటీసీ సూపర్వైజర్ రామకృష్ణ, ఐసీటీసీ కౌన్సిలర్లు రాపర్త సురేశ్, రాజేందర్, సంపూర్ణ, సురక్ష కేంద్ర బృందం ఇక్బాల్, భాషా ల్యాబ్ టెక్నిషియన్లు, కరుణ మైప్రాజిటివ్ నెట్వర్క్ రవీందర్, మారి, విజయ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఽఖ అధికారి అప్పయ్య -
మారిన యూనిఫామ్ డిజైన్లు
రూ.75తో గిట్టుబాటు కాని కూలి.. ప్రభుత్వం ఒక జత యూనిఫామ్ స్టిచ్చింగ్కు రూ.75 చొప్పున చెల్లిస్తోంది. గతంలో ఒక్కో తకు రూ.50 చొప్పున చెల్లించగా గత ఏడాది నుంచి రూ.25 పెంచారు. ఇందులో కుట్టు కూలికి రూ.50, కటింగ్, బటన్స్, కాజలు, ఎంఎస్ సర్వీస్ చార్జి రూ.25 కలిపి రూ.75 ఇస్తున్నారు. బయట టైలర్లు ఒక్కో జత కుట్టడానికి రూ.300 నుంచి రూ.400 తీసుకుంటుండగా ప్రభుత్వం రూ.75 నిర్ణయించడంతో గిట్టుబాటు కావడం లేదని మహిళా సమాఖ్య సభ్యులు పేర్కొంటున్నారు. యూనిఫాంకు కనీసం రూ.150 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.విద్యారణ్యపురి/వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లోని వి ద్యార్థులకు(2025–26 )విద్యాసంవత్సరం అందించే స్కూల్ యూనిఫామ్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. తరగతుల వారీగా బాలబాలికలకు వేర్వేరు డిజైన్లలో దుస్తులు కుట్టించేందుకు ఇప్పటికే హనుమకొండ జిల్లాలో గ్రామీణ ప్రాంత మహిళ సంఘా ల సమాఖ్యలకు క్లాత్‌ను మండలాల వారీగా పాఠశాలల స్థాయిలో అందజేశారు. పట్టణ ప్రాంతంలో మెప్మాకు సంబంధించి టీఎల్‌ఎఫ్‌లకు అప్పగించారు. క్లాత్‌ను టిస్కో పంపిణీ చేసింది. ఈసారి స్టి చింగ్ డిజైన్‌లో మార్పులను గమనిస్తే.. ముఖ్యంగా చొక్కాలు, లాంగ్ ఫ్రాక్‌లకు పట్టీలు, భుజాలపైన క ప్స్ వంటి ప్యాచ్‌లు లేకుండా కుటిస్తున్నారు. స్టిచ్చింగ్ సరళంగా ఉండేందుకు స్వల్పమార్పులు చేశారు. తరగతుల వారీగా యూనిఫామ్ ఇలా.. ఒకటి నుంచి 5వ తరగతి బాలురకు చొక్కా, నిక్కర్, ఆరు నుంచి 12వ తరగతి వరకు బాలురకు చొక్కా, పాయింట్, ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు చొక్కా, లాంగ్‌ఫ్రాక్, 4, 5 తరగతుల బాలికలకు షర్ట్, స్కర్ట్, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు పంజాబీడ్రెస్ మోడల్లో ఉండేలా టాప్ బాటమ్ చున్నీ లేకుండా కుట్టిస్తున్నారు. ఈసారి వేసవి సెలవులకు ముందే యూనిఫాం కుట్టించేందుకు కొలతలు కూడా తీసుకున్నారు. దుస్తులు హెచ్చు తగ్గులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలుత ఒకే జతకు క్లాత్రాక.. యూనిఫాం స్టిచ్చింగ్ కోసం ముందుగా ఒకే జత కోసం క్లాత్‌ను మహిళా సమాఖ్యలకు అప్పగించారు. ఈనెల 31 వరకు స్టిచ్చింగ్ పూర్తి చేసి అందజేయాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. జిల్లాలో 314 పీఎస్‌లు, 72 యూపీఎస్‌లు, 147 హైస్కూళ్లు, 9 కేజీబీవీలు, మూడు మోడల్ స్కూళ్లు, ఒక యూఆర్ఎస్, 25 వరకు ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. మొత్తం విద్యార్థులు 30,922 మంది ఉండగా ఇందులో బాలురు 14,852, బాలికలు 16,070 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రతి ఏడాది ఒక్కో విద్యార్థికి రెండుజతల చొప్పున స్కూ ల్ యూనిఫామ్ అందజేస్తున్నారు. ఈసారి తొలుత ఒక జత పంపిణీ చేసేందుకు స్టిచ్చింగ్ చేయిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక పిల్ల లకు అందజేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రెండో జతకు క్లాత్వచ్చే అవకాశం ఉంటుంది.స్వల్పమార్పులతో స్టిచ్చింగ్ ప్రస్తుతానికి ఒకే జతకు క్లాత్ రాక కుట్టుపనికి 31వ తేదీ వరకు డెడ్‌లైన్ జిల్లాలో 30,922 మంది విద్యార్థులు -
కానిస్టేబుల్‌కు అభినందనలు
రామన్నపేట: వృత్తి ధర్మంలో భాగంగా మానవత్వం చాటుకున్న ఓ కానిస్టేబు ల్ మంచి మనస్సును ప్రజలు అభినందించారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ గోపాలస్వామి గుడి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దుస్తులు కూడా సరిగ్గా లేక ఎండవేడి తట్టుకోలేక పడిపోగా, స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ కల్యాణ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాధిత వ్యక్తికి దుస్తులు తెప్పించి తొడిగి 108 వాహనాన్ని పిలిపించి ఎంజీఎం ఆస్పత్రికి వైద్యం కోసం తరలించాడు. ఇదంతా గమనించిన స్థానికులు సదరు కానిస్టేబుల్ స్పందించి సహాయం చేసిన తీరుకు అభినందనలు తెలిపారు. -
డైక్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డైక్)లో కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల నుంచి సిబ్బంది అసలు విధుల్లో లేకుండానే విధులకు హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏకంగా విధులకు హాజరవ్వకుండా డైక్ సెంటర్‌కే తాళం వేసిన ఘటనలున్నట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండడంతో బాధిత పిల్లలకు సేవలు ఎలా అందిస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైక్ సెంటర్ కాంట్రాక్ట్ సిబ్బందిలో ఓ ఉద్యోగిని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రముఖ దినపత్రిక చీఫ్ బ్యూరో నా చుట్టం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ.. చిందులు తొక్కుతుండడం గమనార్హం. ఎంజీఎం డైక్ సెంటర్లో అర్హత లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైక్ సెంటర్ కాంట్రాక్టు సిబ్బంది తీరు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలపై కలెక్టర్ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్ట్‌ల సర్వేకు నిధులు
కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేకు 2025–26 ఆర్థిక సంవత్సరం సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్లో కేటాయింపు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఏ ప్రాజెక్టుకు ఎంత అంటే.. ● పెండ్యాల–హసన్‌పర్తి బైపాస్‌లైన్ పైనల్ లొకేష న్ సర్వేకు రూ.64 లక్షలు, డోర్నకల్–మణుగూర్ డబ్లింగ్ 104కి.మీ థర్డ్‌లైన్ సర్వే కోసం రూ.2.08 కోట్లు, సికింద్రాబాద్–కాజీపేట మధ్య మూడో లైన్ సర్వేకు రూ.1.56 కోట్లు కేటాయించారు. ● సికింద్రాబాద్–కాజీపేట వరకు 85,48 కి.మీ డబ్లింగ్ లైన్ సర్వే కోసం రూ.1.71 కోట్లు, కాజీ పేట–విజయవాడ క్వార్డర్ అఫ్లింగ్ 220 కి.మీ సర్వేకు రూ.4.40 కోట్లు, కాజీపేట–బల్లార్షా క్వార్డర్ అప్ లింగ్ 234 కి.మీ సర్వేకు రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ క్వార్డర్ అఫ్లింగ్ 120 కి.మీ రూ.2.40 కోట్లు, భూపాలపల్లి–కాజీపేట (హసన్‌పర్తి) కొత్తలైన్ 64 కి.మీ ఫైనల్ సర్వేకు రూ.1.60 కోట్లు ఇచ్చారు. ● ఘన్పూర్–రఘునాథపల్లి 17,2 కి .మీ మూడో, నాలుగో లైన్ సర్వేకు రూ.0.34 లక్షలు, మణుగూరు–రామగుండం కొత్త లైన్ సర్వేకు రూ.5 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య 21.25 కి.మీ మూడో రైల్వే లైన్ సర్వేకు రూ.43 లక్షలు కేటాయింపులు చేశారు. ● వరంగల్ స్టేషన్ సమీపంలో రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్) మంజూరుకు రూ.10 లక్షలు, కాజీపేట–వరంగల్ రూట్లో బైపాస్లైన్లో రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్)కు రూ. 75లక్షలు, డోర్నకల్‌లో 15 కి.మీ. ఆర్వోఆర్ సర్వేకు రూ.30 లక్షలు మంజూరు చేశారు. ● సికింద్రాబాద్–కాజీపేట మధ్య ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ 134 కి.మీ మూడో లైన్ సర్వేకు రూ.52 లక్షలు, బల్లార్షా–కాజీపేట ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ 234 కి.మీ బల్లార్షా–కాజీపేట మధ్య నాలుగో లైన్ సర్వేకు రూ.1.17 కోట్లు, కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైన్ 219 కి.మీ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ రూ.1.10 కోట్లు నిధులు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ● కాజీపేట రైల్వే వ్యాగన్ షెడ్‌కు సంబంఽధించిన ఈ ఏడాది కావాల్సిన నిధులు కన్సాలిడేటెడ్ బడ్జెట్ కేటాయింపుల్లో పేర్కొనలేదని అధికారులు పేర్కొన్నారు. 2025–26 కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్లో స్పష్టత -
గుణాత్మక విద్యపై దృష్టి సారించాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు గుణాత్మక విద్య పై దృష్టి సారించాలని హనుమకొండ డీఈఓ వా సంతి సూచించారు. ఐదు రోజులుగా హనుమకొండ భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూ ల్లో నిర్వహిస్తున్న టీచర్ల శిక్షణ కార్యక్రమం శనివా రం ముగిసింది. ఈ సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. అనంతరం రిసోర్స్ పర్సన్లకు, సెంటర్ ఇన్‌చార్జ్‌లకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ కె.శ్రీని వాస్, కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, స్కిల్ స్టార్క్ విద్యాసంస్థల అధినేత అనుపురావు,రవికుమార్,రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. సమావేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ఇన్స్పెక్టర్ వెంకన్న, పోక్సో చట్టం, ఉమెన్ ట్రా ఫికింగ్ పై షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత, డ్రగ్ అడిక్షన్ పై ఏసీ పీ సైదులు,సైబర్ క్రైమ్ గురించి సంబంధిత అధికా రి శివకుమార్ ఉపాధ్యాయులకు వివరించారు. అభ్యసన సామర్థ్యాలు పెంచాలి : వరంగల్ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధించాలని వరంగల్ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ ఉపాధ్యాయులను కోరారు. జిల్లాలోని ఉపాధ్యాయులకు నగరంలో ఐదు రోజులుగా నిర్వహిస్తుస్తున్న శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌తో పాటు కె.మల్లారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వరంగల్ నార్కొటిక్ డీసీపీ సైదులు మాట్లాడారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, నాగేశ్వర్రావు, సెంటర్ ఇన్చార్జ్ వెంకటేశ్వర్రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి -
ఆధునిక హంగులతో సిద్ధం
ఏళ్ల నాటి కల.. నెరవేరుతున్న వేళ ● అన్ని వసతులతో రూపుదిద్దుకున్న వరంగల్ రైల్వేస్టేషన్ ● అమృత్ భారత్ రూ.25కోట్ల నిధులతో ఆధునికీకరణ ● 22వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ ● రైల్వేస్టేషన్‌ను సందర్శించిన జీఎం అరుణ్‌కుమార్ జైన్ -
‘జల్ హీ అమృత్’కు నిధులు మంజూరు
వరంగల్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ హీ అమృత్ 2.0 పథకం స్టార్ రేటింగ్ ర్యాంకింగ్‌తో వరంగల్ నగరానికి రూ.3కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా చేపడుతున్న జల్ హీ పథకం లక్ష్యాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 15 ఎంఎల్డీల ఎస్టీపీలలో ఓసీఈఎంఎస్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు 70 కిలో వాట్స్ ఉత్పతి చేసే యూనిట్‌కు 15 ఎంఎల్డీ ప్లాంటులో మురికి నీటిని శుద్ధీకరించేందుకు ఉపయోగపడే విధంగా చూడాలన్నారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, మాధవిలత, సంతోష్ బాబు, పీఎంసీ ఆనంద్ పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్, కౌన్సిల్ హాల్ పూర్తి చేయండి స్విమ్మింగ్ పూల్, కౌన్సిల్ హాల్ పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లను ఆదేశించారు. క్షేత్ర స్థా యిలో జరుగుతున్న పనులను మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి తనిఖీ చేశారు. తని ఖీల్లో అడిషనల్ కమిషనర్ జోనా, ఈఈలు, డీఈ కార్తీక్ రెడ్డి, ఏఈలు శ్రీకాంత్, నరేష్ పాల్గొన్నారు. సమీక్షలో మేయర్ సుధారాణి -
ఉర్సుకు రావాలని సీఎంకు ఆహ్వానం
దామెర: ఒగ్లాపూర్ సమీపంలోని సైలానిబాబా దర్గా ఉర్సు ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని దర్గా పీఠాధిపతి మహ్మద్ అబ్దుల్ హమీద్ షామియా,ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రె డ్డితో కలిసి శనివారం హైదరాబాద్‌లో ఆహ్వా న పత్రం అందజేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా పీఠాధిపతి సీఎంకు దట్టి కట్టారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న సైలాని బాబా గంధం ఉత్సావాలకు రావాలని సీఎంను కోరా రు.మహ్మద్ అహమ్మద్ తదితరులు ఉన్నారు. కేయూ ఎంబీఏ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ సందర్శించి, పరిశీలించారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి.దూర విద్యాకేంద్రంలోని పరీక్షల కేంద్రాన్ని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం సందర్శించి, పరిశీలించారు. ఆయన వెంట దూర విద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ, వై.వెంకయ్య, సీతారాం ఉన్నారు. ప్రొఫెసర్లుగా పదోన్నతివిద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. సంస్కృత అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇ.కృష్ణయ్య, పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, ప్రభుత్వ పింగిళి మహిళా కాలేజీ తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతను ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ కళాశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఆయా ప్రొఫెసర్లను కేడీసీ ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం.రవికుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీనాథ్, పరీక్షల నియంత్రణాధికారి శివనాగ శ్రీను, అధ్యాపకులు పాల్గొన్నారు. వరంగల్ డీసీసీబీకి ‘ఐఎస్ఓ’హన్మకొండ: వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న సేవలకు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ (ఐఎస్ఓ) సర్టిఫికెట్ జారీ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కార్యాలయంలో టెస్కాబ్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ తమ పాలకవర్గం, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేస్తూ బ్యాంకు అభివృద్ధితో పాటు, వ్యవసాయ, రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి విద్యారణ్యపురి: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్‌సుమన్ కోరారు. హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈనెల 22 నుంచి నిర్వహించే పరీక్షలకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రథమ సంవత్సరం 3,135 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 2,065 మంది పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీఈసీ సభ్యులు మాధవరావు, విజయనిర్మల పాల్గొన్నారు. -
రారండోయ్ సర్కారు బడికి..!
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంపుదలే లక్ష్యంగా విద్యాశాఖ బడిబాటను జూన్ 6నుంచి 19వతేదీ వరకు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ బడిబాట ద్వారా చేపట్టే కార్యక్రమాల షెడ్యూల్‌ను శనివారం విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉపాధ్యాయులు బడిబయట ఉన్న, బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాల్లో కొందరు ఉపాధ్యాయులు ముందస్తుగా బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్ 6నుంచి ఉపాధ్యాయులు తప్పనిసరిగా తాము పనిచేస్తున్న ప్రాంతం పరిధిలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు ఇలా.. ● 6వ తేదీన గ్రామసభను నిర్వహించాల్సి ఉంటుంది. ● 7న ఇంటింటికి సందర్శంచి బడిఈడు పిల్లలను గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుంది. ● 8నుంచి 10వ తేదీవరకు ● జిల్లాల్లోని ఉపాధ్యాయులు తమతమ పాఠశాలల పరిధిలో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించాలి. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి డ్రాపౌట్ పిల్లలను కూడా గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి. ప్రత్యేక అవసరాల పిల్లలు ఉంటే వారిని అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాల్సింటుంది. ● 11న అప్పటివరకు నిర్వహించిన బడిబాటపై సమీక్షించుకోవాలి. ● 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్, స్కూల్ యూనిఫామ్స్ కూడా అందించాల్సి ఉంటుంది. ● 13న జిల్లాల్లో సామూహిక అక్షరాభ్యాసం బాలల సభను నిర్వహించాలి. ● 16న ఎఫ్ఎల్ఎన్, లిప్ దినోత్సవం నిర్వహించాలి. ● 17న విలీన విద్య, బాలికా దినోత్సవాన్ని చేపట్టాలి. ● 18న తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన కల్పించి, మొక్కల పెంపకం, ప్రాధాన్యాన్ని వివరించాలి. ● 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పొటీలు నిర్వహించాలి. జూన్ 6నుంచి 19వ తేదీవరకు బడిబాట షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు విద్యార్థుల నమోదు పెంపుదలే లక్ష్యం సమష్టిగా ముందుకెళ్లాలంటున్న విద్యాశాఖ అధికారులు జిల్లాలోని 41 పాఠశాలల్లో విద్యార్థులు అసలే లేరు. వీటిలో విద్యార్థులను చేర్పించుకునేలా కృషిచేయాలి. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయ సంఘాలు కూడా తమవంతు సహాయ సహకారాలు అందించాలి. – ఇటీవల సమన్వయ సమావేశంలో హనుమకొండ డీఈఓ డి.వాసంతిజిల్లాల వారీగా పాఠశాలలు.. జిల్లా పీఎస్‌లు యూపీఎస్‌లు హైస్కూళ్లు హనుమకొండ 314 72 147వరంగల్ 321 68 123 -
భక్తులను క్షేమంగా చేరవేయాలి
● ఆర్టీసీ ఆర్ఎం డి.విజయభాను హన్మకొండ: సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులను క్షేమంగా తరలించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను సూచించారు. శనివారం హనుమకొండ బస్ స్టేషన్లో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను ఆయన పరిశీలించారు. ప్రయాణికుల రద్దీ ఎలా ఉందని, డ్రైవర్లు వడదెబ్బకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శనివారం వరంగల్ రీజియన్ వ్యాప్తంగా 230 బస్సులలో 15 వేల మంది సరస్వతి పుష్కరాలకు తరలివెళ్లినట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భాను కిరణ్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరిస్తున్న భక్తులుభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలతోపాటు, పసుపు, కుంకుమ, చీర, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవతర్నమాల హారతి ఇచ్చారు. గోదావరి, ఆలయ పరిసరాల్లో కిటకిట.. శుక్రవారం తెల్లవారుజాము నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తరలివచ్చి న భక్తులతో గోదావరి తీరం, ఆలయం కిక్కిరిసింది. ఉదయం నుంచి 10 గంటల్లోపు భక్తులు పలు చగా ఉండగా, మధ్యాహ్నం వరకు రద్దీ పెరిగింది. నిండిన పార్కింగ్ స్థలాలు, చలువ పందిళ్లు.. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, ప్రైవేట్ వాహనాల్లో భ క్తులు తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు కిటకిట లాడాయి. వరంగల్, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్, ఇప్పలబోరు వైపు పార్కింగ్‌లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మంచిర్యాల వైపు నుంచి వచ్చే వాహనాలను బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్ స్థలాలనుంచి సరస్వతి ఘాట్, అక్కడి నుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది. వీకెండ్లో పెరగనున్న భక్తుల తాకిడి.. శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి రెట్టింపుస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరి తీరం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు శుక్రవారం వచ్చిన భక్తులతోనే నిండాయి. శని, ఆదివారాల్లో లక్షమందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా. ఈ మేరకు అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు ఉండవని, లేనిపక్షంలో ఎండకు మాడిపోవాల్సిందేనని భక్తులు అంటున్నారు. వీఐపీల రాక.. సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జ్ జడ్జి పట్టాభిరాం వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి, శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. – పుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు IIలోuపుష్కర స్నానంతో పొరపాట్లు పరిసమాప్తం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సరస్వతి నదిలో కుటుంబ సమేతంగా పుష్కరస్నానం సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ కిటకిటలాడిన సరస్వతి ఘాట్, దేవస్థానం పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పలువురు వీఐపీలు– వివరాలు IIలోu -
చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు
హన్మకొండ అర్బన్: యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని మంత్రి త్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, రేషన్‌కార్డులు, బియ్యం పంపిణీపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్ఓ వైవీ గణేశ్, డీఆర్డీఓ మేన శీను, డీసీఓ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి -
మంత్రి సురేఖ వ్యాఖ్యల కలకలం!
పైసలిస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియరవుతాయని కామెంట్ ● ఇదీ కమీషన్ల సర్కారు అని మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ● కావాలనే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి సురేఖ ● గత బీఆర్ఎస్ మంత్రులనుద్దేశించి అన్నానని స్పష్టతసాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని లేపాయి. ‘మంత్రుల వద్దకు క్లియరెన్స్ కోసం కొన్ని ఫైల్స్ వస్తాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకొని వాటిని క్లియరెన్్స్ చేస్తుంటారు. మేం మాత్రం మాకు నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక బాధ్యతగా స్కూల్‌ను అభివృద్ధి చేయాలని కోరాం’ అని ఆమె వరంగల్‌లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం జరిగిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమెకు థాంక్స్ అని చెప్పి, మొత్తానికి కొండా సురేఖ నిజాలు బయటపెట్టారని, కాంగ్రెస్ కమీషన్ సర్కారు నడుపుతోందని ఎక్స్ వేదికగా పోస్టు చేయడంతో మరోసారి ఓరుగల్లు కేంద్రంగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ‘వరంగల్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పనిచేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని నేను మాట్లాడినా. అవి అక్షర సత్యం కూడా. ఆ మాటలకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. మా ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తమ పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ వీడియోలో నా వ్యాఖ్యల్ని ముందు వెనుక కొంత తీసేసి, మిగతా కొంత పార్ట్‌ను కావాలనే హైలెట్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఇది’ అని ఆమె మీడియాతో మాట్లాడి వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.గతంలోనూ పలు వివాదాలు.. గతంలోనూ నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసి పరువు నష్టం దావాలు మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు. గతేడాది దసరాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మొదలైన వివాదంలో ముగ్గురు కొండా వర్గీయులను పోలీసులు అరెస్టు చేయగా.. మంత్రి కొండా సురేఖ నేరుగా గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం అప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వేములవాడ రాజన్న కోడెల విషయంలోనూ మంత్రి అనుచరుడికి అప్పనంగా కట్టబెట్టారని గీసుకొండ ఠాణాలో కేసు నమోదు కావడం కూడా గతేడాది డిసెంబర్లో వివాదమైంది. తాజాగా మంత్రులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ అయ్యాయి. -
‘న్యాక్’కు సిద్ధం కావాలి
కేయూ క్యాంపస్: నూతన గ్రేడింగ్ సిస్టంకు అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు న్యాక్‌కు సిద్ధం కావాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.షమిత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (సీఆర్ఐఎస్పీ) స్వచ్ఛంద సంస్థ వారి సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎక్స్‌లెన్స్ (చెక్)లో భాగంగా ఓయూ, ఎస్‌యూతో కేయూ అవగా హన ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. ఐక్యూఏసీ అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న 22 కళాశాలల ప్రతి నిధులతోను వీసీ మాట్లాడారు. మారుతున్న సూచనలకు అనుగుణంగా కళాశాలలు డేటా బేస్‌తో సిద్ధంగా ఉండాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ న్యాక్ అక్రిడిటేషన్‌లో వస్తున్న మార్పులపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, అకడమిక్ మెంటార్ డాక్టర్ ఏవీ రావు, డాక్టర్ అచ్యుతాదేవి, సీఆర్ఐఎస్పీ స్టేట్ లీడ్ డాక్టర్ కె.రమ, ఆచార్య లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ షురూవిద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి డీఈఓ వాసంతి శుక్రవారం ప్రారంభించారు. తొలిరోజు కాజీపేట మండలానికి 24,972 పాఠ్యపుస్తకాలు, కమలాపూర్ మండలానికి 15,932 పాఠ్యపుస్తకాలు అందించారు. ఆయా మండల విద్యాశాఖాఽధికారులు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల ద్వారా పంపిణీ చేశారు. మిగిలిన మండలాలకు కూడా షెడ్యూల్ ప్రకారం చేరవేస్తారు. మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు చేరాక అక్కడి నుంచి హెచ్ఎంలు తమ పాఠశాలలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు అందజేస్తారు. హోటళ్లకు రూ.62 వేల జరిమానా వరంగల్ అర్బన్: హనుమకొండలోని పలు హోటళ్లలో బల్దియా ప్రజారోగ్య విభాగం సిబ్బంది శుక్రవారం తనిఖీలు చేశారు. అపరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని గుర్తించి రూ.62 వేల జరిమానా విధించి వసూలు చేసినట్లు సీఎంహెచ్ఓ రాజారెడ్డి తెలిపారు. 51వ డివిజన్ ఎకై ్సజ్ కాలనీలోని నాటుకోడి చిట్టి గారెలు హోటల్‌కు రూ.30 వేలు, ట్రేడ్ లైసెన్్స్ లేకుండా నిర్వహిస్తున్న హంటర్ రోడ్డులోని కడాయి రెస్టారెంట్‌కు రూ.30 వేలు, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న వెంకటసాయి కిరాణా షాపు యజమానికి రూ.2 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బంది అనిల్‌కుమార్, సంపత్‌రెడ్డి, నిరంజన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి హన్మకొండ: వరంగల్ అర్బన్ సహకార బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి సూచించారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని వరంగల్ అర్బన్ సహకార బ్యాంకులో శుక్రవారం జరిగిన బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సభ్యుడు సామాజిక బాధ్యతతో సహకార బ్యాంకు అభివద్ధికి తోడ్పడాలన్నారు. ప్రతి సభ్యుడు పొదుపుతోపాటు వాటాదనం చెల్లించడం ద్వారా బ్యాంకు పరపతి పెరుగుతుందని పేర్కొన్నారు. బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాద్, బ్యాంకు మేనేజర్ సురేందర్‌రెడ్డి, హనుమకొండ బ్యాంకు మేనేజర్ ప్రసాద్, గోపాలపురం బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, అధికారులు శ్రీనివాసరావు, కృష్ణవేణి, సంధ్యారాణి, బ్యాంకు వాటాదారులు, సభ్యులు పాల్గొన్నారు. -
వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
వరంగల్ అర్బన్: నగరంలో వీధి దీపాలు,సెంట్రల్ లైటింగ్ నిర్వహణలో నిర్లక్ష్యం తగదని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లైటింగ్ నిర్వహణలో బ్లాక్స్పాట్ల గుర్తింపుతోపాటు అందుకు అవసరమైన సామగ్రి, పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు. నగర వ్యాప్తంగా ఉన్న 83,750 వీధి దీపాలు వెలగాలని, విలీన గ్రామాల్లో అంధకారం లేకుండా పర్యవేక్షించాలన్నారు. నీటి సరఫరా తీరును సమీక్షించిన మేయర్.. ప్రతి ఇంటికి నీటి సరఫరా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు లీకేజీలను అరికట్టాలని పేర్కొన్నారు. నీరు అందని చివరి ఏరియాలు, నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్ బాబు, మాధవీలత, డీఈ కార్తీక్‌రెడ్డి, ఏఈ సరిత తదితరులు పాల్గొన్నారు.నగర మేయర్ గుండు సుధారాణి -
డెంగీ నియంత్రణ చర్యలు చేపట్టాలి
ఎంజీఎం: డెంగీ నియంత్రణకు ప్రతిఒక్కరూ చర్యలు చేపట్టాలని వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు సూచించారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎంజీఎం నర్సింగ్ కళాశాల నుంచి ఐఎంఏహాల్ వరకు నిర్వహించిన ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం జంక్షన్లో మానవహారం నిర్వహించిన అనంతరం ఐఎంఏ హాల్లో నిర్వహించిన సమావేశంలో సాంబశివరావు మాట్లాడారు. ఈడిస్ దోమ పగటిపూట కుడితే డెంగీ వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధికారక దోమ నీటిలో వృద్ధి చెందుతుందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే 90 శాతం వ్యాధిని అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, లక్షణాలు ఉన్న వారిని గుర్తించి రక్త పరీక్షలు చేసి డెంగీ మరణాలను అరికట్టవచ్చని వైద్యాధికారులు, సిబ్బందికి తెలి పారు. జీడబ్ల్యూఎంసీ సీహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ అర్బన్ మలేరియా సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో డెంగీ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, కొమురయ్య, ప్రో గ్రాం ఆఫీసర్లు ఆచార్య పతి, అర్చన, విజయకుమార్, మెడికల్ ఆఫీసర్ యశస్విని, జిల్లా మలేరియా అధికారి రజిని, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఇన్చార్జ్ ఏఎంఓ మాడిశెట్టి శ్రీనివాస్, సబ్ యూనిట్ ఆఫీసర్ నాగిరెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు సదానందం, రాజశేఖర్, నర్సమ్మ, మధుకర్, నర్సింగ్ కళాశాల ట్యూటర్ స్వర్ణలత, సీసీ నాగరాజు, వైద్య సిబ్బంది రాధాకృష్ణ, రత్నాకర్, కుమారస్వామి, చక్రపాణి, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు -
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025
– IIలోuచలివేంద్రాల పేరుతో స్వాహాకు యత్నం ● నిర్వహణ నిధులు పెరిగినా ఎండుతున్న గొంతులు ● పట్టించుకోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లువరంగల్ అర్బన్: పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో మహానగర ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వడగాలుల తాకిడితో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు రహదారుల్లో ప్రతి వేసవి మాదిరిగా ఈసారి కూడా బల్దియా ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతాల్లో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికులు, పాదచారుల దాహార్తి తీర్చాల్సి ఉంది. చలివేంద్రాల నిర్వహణ పేరిట రూ.22.50 లక్షల నిధులు కేటాయించారు. నీళ్లు సరఫరా చేయకుండానే నిధులు ఎలా మింగేయాలో కొంతమంది స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు పర్యవేక్షించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 66 డివిజన్లు.. 45 చలివేంద్రాలు గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో 45 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కాశిబుగ్గ సర్కిల్ పరిధిలోని వరంగల్‌లో 24, కాజీపేట సర్కిల్లోని హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో 21 చొప్పున చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలాఖరు వరకు అన్ని చలివేంద్రాల్లో చల్లటి నీరు సరఫరా చేయాలి. ఈ ఏడాది టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో కాంట్రాక్టర్ తాత్కాలిక తడకల షెడ్లు, రంజన్లు ఏర్పాటుకు పరిమితమయ్యేది. బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది నీటి సరఫరా చేస్తుండేవారు. పనిభారం కారణంగా కార్మికులు నీటి సరఫరా సక్రమంగా చేయడం లేదు. ఈ దఫా నిధులు పెంచి చలివేంద్రాలకు టెండర్ ఆహ్వానించారు. గతంలో ఒక్కో చలివేంద్రానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల చొప్పన వెచ్చిస్తుండేది. ఈ దఫా మాత్రం ఒక్కో తాత్కాలిక చలివేంద్రం ఏర్పాటులో భాగంగా తడకలు, రంజన్లు, గ్లాసులు, మగ్గు, బ్యానర్ల కోసం రూ.15 వేలు కాగా.. మూడు నెలల కాలనికి ఒకరి వేతనం రూ.30 వేలు, ఖర్చు రూ. ఐదు వేలు ఇలా మొత్తం రూ.50 వేల చొప్పున ఖర్చు కానుందని నిర్ణయించి టెండర్ ఖరారు చేశారు. ఇక బల్దియా ట్యాంకర్ల ద్వారా చలివేంద్రాలకు నీటిని సరఫరా చేయాలి. నగరంలోని సగానికి పైగా చలివేంద్రాలకు నీటి సరఫరా కావడం లేదు. కారణమేంటంటే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం లేదని, మేం ఏం చేయాలని అక్కడే నీటి సరఫరా చేసే సిబ్బంది సమాధానం చెబుతున్నారు. బల్దియా ఏఈలు మాత్రం రోజుకు రెండు ట్రిప్పులుగా నీటి సరఫరా చేస్తున్నామని పేర్కొంటున్నారు. కొన్ని కేంద్రాల్లో సరిపడా నీరు ఉండడం లేదు. ఇంకొన్ని కేంద్రాల్లో వేడి నీరు లభిస్తుండగా, మరికొన్ని కేంద్రాల్లో ఖాళీ రంజన్లు దర్శనమిస్తున్నాయి. సిబ్బంది కానరాక అడుగంటిన ఖాళీగా ఉన్న కుండలే కనిపిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల దాతలు ఏర్పాటు చేసిన కేంద్రాలను తమ ఖాతాలో వేసుకొని ఖర్చులు చూపిస్తూ మోసం చేస్తున్నారు. చలివేంద్రాల ఏర్పాటు పేరుతో కొంతమంది నిధుల స్వాహాకు యత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ పనులు రీత్యా నగరానికి విచ్చేస్తున్న వాహనదారులు, బాటసారులు, ప్రజలు చలివేంద్రాల్లో చల్లని నీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా చలివేంద్రాలు అంటే ఇలాగే ఉంటాయని పలువురు పెదవి విరుస్తున్నారు. లోపాలు సరిదిద్దుతాం.. నగరంలోని అన్ని చలివేంద్రాల్లో తాగునీటి సరఫరా అవుతోంది. ఏఈలు ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్ది చర్యలు తీసుకుంటాం. జూన్ నెలాఖరు వరకు ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చలివేంద్రాల్లో నీటి సరఫరా చేయాల్సిందే. – శ్రీనివాస్, బల్దియా ఇన్చార్జ్ ఎస్ఈ న్యూస్‌రీల్ -
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
ఖిలా వరంగల్: శిక్షణ శిబిరాల ద్వారా ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని ఓ పాఠశాలలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ గురువారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి కొండా సురేఖ శిబిరాన్ని సందర్శించారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఈఓ జ్ఞానేశ్వర్, సుజన్ తేజ, నాగేశ్వర్రావు, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పోస్టర్ ఆవిష్కరణ న్యూశాయంపేట: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్లను వరంగల్ కలెక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, ఆర్ఎల్సీ శ్రీనివాస్, ప్రిన్సిపాళ్లు భిక్షపతి, శ్రీపాల, రాజు, కృష్ణకుమారి, నీలిమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ -
ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించాలి
హసన్‌పర్తి: విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భీమారంలోని స్కిల్ స్ట్రోక్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించారు. శిక్షణ గురించి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతిని అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధునాతన బోధనా పద్ధతులు, 21వ శతాబ్దపు శిక్షణతో బోధనలో మెళుకువలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం బైలింగ్వల్ ద్విభాష పాఠ్యపుస్తకాలు అందిస్తోందని ఆమె వివరించారు. తరగతి గది డిజిటలైజేషన్ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థుల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, నైతిక విలువలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుణాత్మక విద్య సమన్వయకులు శ్రీనివాస్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి, సెంటర్ ఇన్‌చార్జ్‌లు, రిసోర్స్‌పర్సన్ తదితరులు పాల్గొన్నారు. సివిల్స్ ప్రిలిమినరీకి ఏర్పాట్లు విద్యారణ్యపురి: జిల్లాలో ఈనెల 25న నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా పరిధిలో 4,141మంది అభ్యర్థులకు 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం మొదటి సెషన్ 9–30 నుంచి 11–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అర్ధగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, అడ్మిట్ కార్డు, పెన్ను, పెన్సిల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు ఉదయం 7 గంటల నుంచే నడుపుతారని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, డీఈఓ డివాసంతి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య -
ముహూర్తం ప్రకారం 5.44 గంటలకు..
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలను వేదపండితులు శాస్త్రోకంగా గణపతిపూజతో ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5.44గంటలకు కాళేశ్వరంలోని సరస్వతిఘాటుకు చేరుకొని ముహూర్తం ప్రకారం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందసరస్వతిస్వామి ముందుగా పుష్కరునికి ఆహ్వాన పూజ చేశారు. పండితులు సరస్వతిమాతకు పూలు, పండ్లు, పాలు, చీరసారెతో నైవేద్యం సమర్పించారు. మాధవా నందసరస్వతిస్వామి పుష్కరినిలో స్నానం ఆచరించి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేశ పుష్కర ప్రారంభ స్నానాలు ఆచరించారు. అనంతరం వేదపండితులు ఐదు కలశాలలో గోదావరి జలాలను తీసుకుచ్చి శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. -
డ్రెయినేజీల్లో వ్యర్థాలను తొలగించండి
వరంగల్ అర్బన్: గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో ఉన్న 350 ప్రధాన డ్రెయినేజీల్లో వ్యర్థాలను తొలగించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజా రోగ్య విభాగం, టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో గురువారం వేర్వేరుగా నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో ఆమె మాట్లాడారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తొలగించిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించాలని కోరారు. అనధికార లేఅవుట్లు గుర్తించాలని, ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ అందజేయాలని సూచించారు. ఇప్పటివరకు 30,500 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో రూ.130.50 కోట్ల ఆదాయం బల్దియాకు సమకూరిందని వివరించారు. ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఏసీపీలు రజిత, ఖలీల్, శ్రీనివాస్ రెడ్డి, ఏర్షాద్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీను పాల్గొన్నారు. అమృత్ పనుల పురోగతిపై వర్చువల్ మీటింగ్ అమృత్ పనుల పురోగతి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూడీఎఫ్ఐ) ప్రతిపాదనలపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ టీకే శ్రీదేవి మున్సిపల్ అధికారులు, అర్బన్ ప్లానర్లతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో మేయర్ గుండు సుధారాణి -
కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్‌రెడ్డి
మంత్రి శ్రీధర్‌బాబు కోరినట్లుగా కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్‌బాబును, అధికారులను అభినందించారు. మంత్రులు ఏమన్నారంటే.. ● మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫు ష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. ● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కర స్నానాలను భక్తులు ఆచరించాలని సూచించారు.– మరిన్ని పుష్కర వార్తలు, ఫొటోలు 8లోu -
కేయూ డిగ్రీ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల రెండో, ఆరో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకా రం జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికా రి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. హనుమకొండలో పలు పరీక్షా కేంద్రాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం,పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, వెంకటయ్య సందర్శించి పరిశీలించారు.చిరు వ్యాపారులను ఆగం చేయొద్దురామన్నపేట: సుందరీమణుల ఓరుగల్లు పర్యటనలో భాగంగా రోడ్ల వెంట ఉన్న చిరువ్యాపార సముదాయాలను తొలగించి ఆ వ్యాపారుల జీవితాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో పలు కూడళ్లలో చిరు వ్యాపారుల సముదాయాలను కూల్చినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఓరుగల్లు చరిత్రను విశ్వవ్యాప్తం చేయడంపై తాము వ్యతి రేకం కాదని, కానీ సుందరీమణులు వస్తున్నారని పండ్ల వ్యాపారులు, చిన్నచిన్న ఉపాధి దుకాణాలు తొలగించి వారి జీవితా ల ను రోడ్డునపడేయడం దుర్మార్గమన్నారు. అ నంతరం ఎంజీఎం కూడలిలో నాయకులు మా నవహారం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రే టర్ వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, సిద్ధం రాజు, మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, ఇమ్మడి లోహిత రాజు, నాగేశ్వర్రావు, నాయకులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.నాణ్యమైన విద్య బోధించాలిమామునూరు: ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యబోధన చేయాలని ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ కోలా ఆనంద కిషోర్, డీఈఓ జ్ఞానేశ్వర్ సూచించారు. ఈమేరకు వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజులు జిల్లాస్థాయి ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని బుధవారం వారు ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. రాష్ట్రస్థాయి పరిశీలకులు డాక్టర్ కందాల రామయ్య డాక్టర్ కె.శ్రీనివాస్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీసీఈవి సెక్రటరీ జి.కృష్ణమూర్తి, ఎంఎంఓ సుజన్ తేజ, కోర్సు ఉప సంచాలకులు వెంకటేశ్వరరావు, రిసోర్స్ పర్సన్స్ తాటి పాముల రమేష్, సంపత్, అశోక్, శ్రీనివాస్, కొమురయ్య, ఆనందమోహన్ పాల్గొన్నారు.శిక్షణకు హాజరుకాని 21 మంది టీచర్లకు షోకాజ్ నోటీసువిద్యారణ్యపురి: ఖిలావరంగల్ మండలంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదు రోజులపాటు జరిగే శిక్షణకు హాజరుకాని 21 మంది ఉపాధ్యాయులకు వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ షోకా జ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 596మంది ఉ పాధ్యాయులు శిక్షణకు హాజరుకావాల్సిఉంది. అందులో 21మంది టీచర్లు శిక్షణకు హాజరు కాలేదని గుర్తించారు. వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సృజన్‌తేజ బుఽ దవారం తెలిపారు. శిక్షణకు ఎందుకు హాజరు కాలేదో ఒక్కరోజులో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తు నిట్ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పీజీ కోర్సుల్లో ఎంటెక్, ఎమ్మెస్సీల్లో ప్రవేశానికి గాను జూన్ 4వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు ccmt2025 helpdesk@ nitw లేదా ccmn2025 helpdesk@ nitw లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభంకానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. – కాళేశ్వరం నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ సరస్వతిఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం– వివరాలు 8లోu -
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12వ తేదీనుంచి పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. జిల్లాలోని గోదాంకు బుధవారం వరకు 74.95శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. జిల్లాకు పార్ట్–1పుస్తకాలు.. జిల్లాల్లోని 1నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు 2,60,240 అవసరం. ఇందులో బుధవారం వరకు 1.95 లక్షల పాఠ్యపుస్తకాలు (74.95శాతం) జిల్లా కేంద్రంలోని గోదాంకు చేరుకున్నాయి. ఇంకా 65వేల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. అన్ని తరగతులకు కలిపి 205 టైటిల్స్ వరకు రావాల్సిండగా అందులో ఇంకా కొన్ని పుస్తకాలు రాలేదు.కొద్దిరోజుల్లోనే అవి కూడా రానున్నాయని సమాచారం. 1నుంచి 5వ తరగతి విద్యార్ధులకు నోట్‌బుక్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే 6నుంచి 10వతరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రతి ఏటా నోట్‌బుక్స్‌ను అందజేస్తున్నారు.అయితే ఈ విద్యాసంవత్సరం (2025–26)లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడా నోట్‌బుక్స్‌ను ఇవ్వనున్నారు. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఒకటో, రెండో తరగతి విద్యార్థులకు మూడు నోట్‌బుక్స్, 3నుంచి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు చొప్పున నోట్‌బుక్స్‌ను అందిచనున్నారు. అయితే జిల్లాల్లోని పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ ఈనెల13న వచ్చాయి. ఈసారి హైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలల పాయింట్స్‌కే పంపిస్తున్నారు. జిల్లాలోని హసన్‌పర్తి మండలం చింతగట్టు హైస్కూల్, సూరారం జెడ్పీఎస్ఎస్, కాజీపేట మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాలలకు నోట్‌బుక్స్ చేరుకున్నాయి, కాగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కూడా నోట్‌బుక్స్ రానున్నాయి. నేటినుంచి మండల కేంద్రాలకు.. జిల్లా కేంద్రంలోని గోదాంకు 74.95 శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నందున ఈనెల 15నుంచి వివిధ మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాలకు వాటిని పంపనున్నారు. ప్రతి మండలంలోని స్కూళ్ల సంఖ్య, అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ఎంఈఓల ద్వారా మండల కేంద్రాలకు చేరుస్తారు. అక్కడి నుంచి పాఠశాలల హెచ్ఎంలకు స్కూల్ పాయింట్‌కు తీసుకెళ్లాల్సింటుంది. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు పుస్తకాలు అందజేయనున్నారు.జిల్లాకు చేరిన 74శాతం పుస్తకాలు ఈసారి 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు నోట్‌బుక్స్ -
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
రవిని తలపించే మోము.. తారల వెలుగులు నిండిన కనులు.. నుదుటిపై బొట్టు.. తలనిండా మల్లె, కనకాంబర పూలు, నెలవంక కట్టగా నెమలంచు చీర.. కన్నెపిల్లలు చుట్టగా కలువ రేకుల చీర.. ఆరు మూరల చీర కట్టిన అరిందలు.. ఓరుగల్లులో విహరించారు. ఫ్యాన్సీ దుస్తులు వదిలేసి పదహారణాల తెలుగమ్మాయిల్లాగా మారి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేశారు. రెడ్‌కార్పెట్‌పై హొయలొలుకుతూ చిరునవ్వులతో తమ అందాలను ఆరబోశారు. ● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు ● ఫ్యాన్సీ డ్రెస్‌లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు ● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు ● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు ● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ● సుందరీమణుల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తుసాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(కె) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. ఈ సందర్భంగా హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హరిత కాకతీయలో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. కోనేరు ముందు నుంచి వెళ్తూ తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. 44 నిమిషాల పాటు ఆలయంలో సందడి చేశారు. అనంతరం నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చుని పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్‌తో సందడి చేసి, ఆ తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారికి సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్బగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశ్వీరచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. కోట చారిత్రక అందాలకు ఫిదా.. విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్‌ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండిక్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించగా ఆసక్తిగా విన్నారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నల్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన ఆద్భుతమైన శిల్ప కళ సంపదను మరింత ఆసక్తిగా తిలకించారు. అనంతరం కాకతీయుల కళాఖండాలను తమ సెల్ఫోన్లలో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్‌లో ప్రదర్శించగా.. కాకతీయ వంశ చరిత్ర, రాణి రుద్రమదేవి పోరాట పటిమ, వీరత్వం స్పష్టం చేయగా.. విశ్వసుందరీమణులు ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. కట్టడం విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని ఇంటాక్ నిర్వాహకులు, పర్యాటకశాఖ అధికారులు వివరించారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో విద్యుత్ వెలుగుల నడమ పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్‌తో కూడిన బహుమతులను అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామప్ప అందాలు వీక్షించి.. రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్‌వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించి తెలుగుమ్మాయిల్లా ముస్తాబయ్యారు. సరస్సుకట్టపై ఫొటోలు దిగారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్‌తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్లు విజయ్‌కుమార్, వెంకటేష్‌లు వివరించగా శిల్పాకళాసంపదను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. ఆలయం చుట్టూ హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆలయ ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం రామప్ప గార్డెన్లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. చివరగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు మంత్రి సీతక్క జ్ఞాపికలు అందించారు. సుందరీమణుల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ‘ఆక్టోపస్’ బృందాలను రంగంలోకి దింపారు. సుందరీమణుల పర్యటన మరిన్ని ఫొటోలు – 8లో -
జగ్గారెడ్డి బట్టలు ఊడగొట్టడం ఖాయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డిహన్మకొండ: ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు నోరు జారీ మాట్లాడితే పార్టీ కార్యకర్తలు జగ్గారెడ్డి బట్టలు ఊడగొట్ట డం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొల ను సంతోష్ రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు అన్నారు. బుధవారం హనుమకొండ దీన్‌దయాల్ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడారు. ఇటీవల సినిమా తీస్తున్న జగ్గారెడ్డికి మతి భ్రమించిందని, పూర్తిగా విలన్లా ప్రవర్తిస్తున్నాడన్నారు. గతంలో రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలే ఆయనను ఓడించిందని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్‌ను విమర్శించడం అర్థరహితమన్నారు. బీజేపీ నాయకులు రావు పద్మ, వన్నాల శ్రీరాములు,డాక్టర్ కాళీప్రసాద్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూలగొట్టడంపై నిలదీసిన ఈటల రాజేందర్‌పై జగ్గారెడ్డి నోరు పారేసుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలను వారు తి ప్పికొట్టారు. సమావేశంలో నాయకులు గజ్జెల్లి శ్రీరా ములు, సండ్ర మధు, సంపత్ రెడ్డి పాల్గొన్నారు. -
సివిల్ ఇంజనీరింగ్ బీఓఎస్‌గా శ్రీకాంత్
కేయూ క్యాంపస్: కాకతీయ యూ నివర్సిటీ సివిల్ ఇంజ నీరింగ్ విభా గం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా కాకతీయ ఇ నిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(కిట్స్),వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.శ్రీకాంత్‌ను నియమిస్తూ మంగళవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన కేయూ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫె సర్ డాక్టర్ సీహెచ్ రాధిక నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.వీసీ కె.ప్రతాప్‌రెడ్డి.. శ్రీకాంత్‌కు ఉత్తర్వులు అందజేశారు. -
సుందరీమణుల పర్యటనకు భారీ భద్రత
వరంగల్ క్రైం: మిస్ వరల్డ్ పోటీలను పురస్కరించుకొని హెరిటేజ్ పర్యటనలో భాగంగా నేడు (బుధవారం) గ్రేటర్ వరంగల్‌లో సుందరీమణుల పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం కమిషనరేట్‌లో సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రపంచ సుందరీమణుల భద్రతకు కమిషనరేట్ పరిధిలో వెయ్యి మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఒక అదనపు డీసీపీ, ఏసీపీలు–11, ఇన్స్పెక్టర్లు–32, ఎస్సైలు–81, ఏఎస్సై/హెడ్ కానిస్టేబుల్–155, కానిస్టేబుళ్లు–325, మహిళా పోలీసులు–106, హోంగార్డ్స్ 210తో పాటు డిస్ట్రిక్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ విభాగాలకు చెందిన అధికారులు భద్రత ఏర్పాట్లలో పాల్గొనున్నట్లు వివరించారు. నగరంలో అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సుందరీమణుల పర్యటనలో ఎలాంటి సమస్యలు రాకుండా సెక్టార్ల వారీగా ఇన్చార్జ్ పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. సీపీ సన్‌ప్రీత్ సింగ్ -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
ప్రజావాణిలో సమస్యల ఏకరువు
హన్మకొండ : తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.ప్రావీణ్య, రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, ఆయా శాఖల అధికారులు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. రేషన్ కార్డులు మంజూరు చేయాలని, కుటుంబీకుల పేర్లు మార్పులు, చేర్పులపై, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని బాధితులు వినతిపత్రాలు సమర్పించారు. వినతులు స్వీకరించిన కలెక్టర్ ప్రావీణ్య వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అక్షయ పాత్రకు అప్పగించొద్దు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్రకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. 2002 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వండి పెడుతున్నామని, ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు, గౌరవ వేతనం రాకున్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యార్థులకు భోజనాన్ని నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు. విద్యాశాఖ అధికారులు అక్షయ పాత్రకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని, వెంటనే విరమించుకోవాలని కోరారు. రేషన్‌కార్డులు, ఇళ్లు మంజూరు చేయాలని వినతులు ఫిర్యాదులు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు -
నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి
వరంగల్ అర్బన్: ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. సోమవారం వరంగల్, హనుమకొండ ప్రధాన రోడ్లపై పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. మిస్‌వరల్డ్ పోటీలో పాల్గొంటున్న సుందరీమణులు బుధవారం వరంగల్, హనుమకొండలో పర్యటిస్తారని పలుమార్లు సూచించినా నిర్లక్ష్యంగా ఉండడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కొరత వల్ల పనులు పూర్తి కావడం లేదని సమాధానం ఇవ్వడంతో ఆమె సీరియస్ అయ్యారు. ముఖ్యంగా సెంట్రల్ మీడియన్లు, ప్రధాన కూడళ్లను శుభ్రంగా ఉండేలా చూడడంతోపాటు నగరమంతా సుందరీకరణ పనులపై దృష్టి సారించాలన్నారు. తనిఖీల్లో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్‌రెడ్డి ఉన్నారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అస్తవ్యస్త పారిశుద్ధ్యంపై ఆగ్రహం -
ప్రొఫెసర్ మల్లారెడ్డికి ఫెల్లోషిప్ ప్రదానం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని అకాడమీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ హానరీ ఫెల్లోషిప్ ప్రదానం చేసింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పద్మవిభూషన్ డాక్టర్ దువ్వారు నాగేశ్వర్‌రెడ్డి ఫెల్లోషిప్ అందుకున్నారు. మల్లారెడ్డిని సోమవారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అభినందించారు. ప్రొఫెసర్లు కె.రాజేందర్, నాగరాజు, ఎల్పీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
సెకండియర్ బోధన చేయలేమని..
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో విద్యా బోధన అందించలేమని, ఇతర కళాశాలల్లోకి వెళ్లాలని హనుమకొండ నయీంనగర్‌లోని ఆర్డీ జూనియర్ కళాశాల యాజమాన్యం తెలిపిందని ఆ కళాశాల విద్యార్థులు తెలిపారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు వచ్చారు. ఆర్డీ కళాశాలలో ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యాబోధన అందిస్తున్నారని, తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రావడం లేదని, ద్వితీయ సంవత్సరం ఇతర కాలేజీల్లో చేరాలని అధ్యాపకులు చెప్పారని వివరించారు. తాము ఏ కాలేజీలో చేరాలో అర్థం కావడం లేదని, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. -
సుందరీమణుల రాకకు విస్తృత ఏర్పాట్లు
హన్మకొండ కల్చరల్ / ఖిలా వరంగల్ : నగరంలోని వేయిస్తంభాల ఆలయంతో పాటు ఖిలా వరంగల్ కోట శిల్పాల ప్రాంగణాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శిస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులకు సూచించారు. రేపు (బుధవారం) ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ సన్‌ప్రిత్‌సింగ్, డీసీపీ సలీమా, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్, ‘కుడా’, దేవాదాయశాఖ, టూరిజం, పోలీస్ అధికారులు వేయిస్తంభాల దేవాలయాన్ని, కోటను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. 14వ తేదీన సాయంత్రం 4ః30 గంటలకు హరితకాకతీయ హోటల్ నుంచి వేయిస్తంభాల గుడికి వస్తారని, దేవాలయం చుట్టూ,కల్యాణ మండపంలో గ్రీన్మ్యాట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం గర్భాలయంలో పూజలు చేస్తారని స్వామివారి దర్శనం, పూజ కార్యక్రమం నిర్వహించడానికి నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మకు సూచించారు. అనంతరం ఆలయ విశిష్టతను, ప్రాశస్త్యాన్ని వివరించాలని అన్నారు. త్రికూటాలయం చుట్టూ శిల్పకళను, నందీశ్వరుడి సన్నిధిలో, కల్యాణమండపంలో 55 నిమిషాల పాటు ఫొటోషూట్ ఉంటుందని వివరించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కేంద్రపురావస్తు శాఖ కోఆర్డినేటర్ నిరంజన్, ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌కు ఆమె సూచించారు. దేవాలయం ఎదుట పచ్చదనంతో శుభ్రంగా కనిపించాలని, ‘కుడా’ గార్డెన్లో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాత్రి వేళల్లో కోట మరింత సౌందర్యవంతగా కనిపించేలా తీర్చిదిద్దిన లైటింగ్ ఏర్పాట్లను పర్యాటక శాఖ ట్రయిల్ రన్ వేయగా ఆసక్తిగా తిలకించారు. సుందరీమణుల రాకతో ఓరుగల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, హనుమకొండ జిల్లా అధికారి వై.వి గణేష్, టూరిజం శాఖ అధికారులు నాథన్, శివాజీ, సూర్యకిరణ్, ఏసీపీలు దేవేందర్‌రెడ్డి, నందిరామ్‌నాయక్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, హనుమకొండ సీఐ సతీష్‌కుమార్, నోడల్ అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేయిస్తంభాల ఆలయం, కోటలో శిల్పాల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు -
యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపిక
కేయూ క్యాంపస్: ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌కు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఎంపికయ్యారని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. కర్ణాటకలోని మంగళూరులో ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న ఐకాన్ యూత్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్–2025కు కేయూ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్) వలంటీర్లు శ్రీజ జాదవ్, గుజ్జర వికాస్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. వలంటీర్లను బయోటెక్నాలజీ విభాగం అధిపతి డాక్టర్ శాస్త్రి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ టి.రాధిక అభినందించారు. -
సీపీని కలిసిన ఏసీపీలు
వరంగల్ క్రైం: కాజీపేట, నర్సంపేట డివిజన్ల నూతన ఏసీ పీలుగా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్‌రెడ్డి, రవీందర్ రెడ్డి సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలన్నారు. పోలీస్ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. కేయూ కామర్స్ బీఓఎస్ చైర్‌పర్సన్‌గా వరలక్ష్మికేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్‌గా ఆ కళాశాల ప్రొఫెసర్ పి.వరలక్ష్మిని నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆమె వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ప్రస్తుతం వరలక్ష్మి సీడీసీ డీన్‌గా, యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నియామకంరామన్నపేట: హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్ స్టోర్స్ కల్పలత సూపర్ బజార్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, మేనేజింగ్ డైరెక్టర్‌గా జిల్లా సహకార అడిట్ అధికారి కె.కోదండరాములు నియమితులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా.. డిప్యుటేషన్ పై విధులు నిర్వర్తించిన ఎ.జగన్మోహన్రావు ఇదే శాఖలో డీసీఓగా బదిలీ అయ్యారు. సూపర్ బజార్ అధ్యక్షుడు వర్ధమాన్ జనార్దన్, మేనేజర్ రఘురామరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందాల పోటీలతో మహిళల ఆత్మగౌరవానికి భంగం ● ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రమాదేవి హన్మకొండ: అందాల పోటీలతో మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రమాదేవి పేర్కొన్నారు. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. మహిళలను వ్యాపార వస్తువుగా చూసే సంస్కృతి పోవాలని, వెంటనే అందాల పోటీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యాన్ని పక్కనపెట్టి అందాల పోటీలు నిర్వహించడం విచారకరమన్నారు. అందాల పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షురాలు, రమాతార, సభ్యులు శ్వేత, రాధిక, సునీత, రాధ, అనిత, ఉమ, పద్మ, లచ్చమ్మ పాల్గొన్నారు. -
టీచర్లకు ‘నైపుణ్య’ శిక్షణ
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల సాధనకు అన్ని కేటగిరీల టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఒక్కో టీచర్‌కు ఐదురోజులు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా డిజిటల్ విద్యకు, కంప్యూటర్ ద్వారా ఏఐ ఆధారిత విద్యా బోధన, లీడర్షిప్ లక్షణాల పెంపుదల, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు వివిధ సబ్జెక్టుల విద్యాబోధనపై జీవన నైపుణ్యాలపై, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ బోర్డు (ఐఎఫ్బీ) వినియోగం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మూడుదశల్లో వేసవి సెలవుల్లో హనుమకొండ జిల్లాల్లోని టీచర్లకు మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు మొదటి, ఈనెల 20 నుంచి 24 వరకు రెండో దశ, ఈనెల 27 నుంచి 31 వరకు మూడో దశలో టీచర్ల శిక్షణ ఉండనుంది. స్కూల్ అసిస్టెంట్లకు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు, గెజిటెడ్ హెచ్ఎంలకు, కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు, మోడల్ స్కూళ్లు ప్రిన్సిపాళ్లకు, ఎస్జీటీలకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎక్కడంటే.. హనుమకొండ భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొదటిదశలో ఈనెల 13 నుంచి 17 వరకు వివిధ కేటగిరీల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటిదశలో స్కూల్ అసిస్టెంట్లు ఇంగ్లిష్ (100), మ్యాఽథ్స్ (100) సోషల్ స్టడీస్ (100), ఎస్జీటీ ఎంఆర్పీలు (112), స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 33 మంది, ఎస్జీటీ ఉర్దూ మీడియం కేటగిరీలో 50 మందికి హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు శిక్షణ ఉంటుంది. హాజరయ్యే టీచర్లకు మధ్యాహ్న భోజనం, టీ, స్నాక్స్, తాగునీటి సదుపాయం కల్పిస్తారు. శిక్షణ ఇస్తున్న స్కూల్లో ఏసీ సదుపాయం ఉన్నందున వేసవిలో శిక్షణ పొందే ఉపాధ్యాయులకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా సబ్జెక్టుల్లో శిక్షణ పొందిన డీఆర్పీల ద్వారా ఇప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. 20 నుంచి 24 వరకు ప్రాథమిక స్థాయి.. జిల్లాలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు ఈనెల 20 నుంచి 24 వరకు ఎంఈఓల ఆధ్వర్యంలో మండల స్థాయిలో శిక్షణ ఉంటుంది. జిల్లాలో 1,014 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలోని అన్ని కేటగిరీల టీచర్లకు ఈనెల 13నుంచి 17వరకు శిక్షణ ఇవ్వబోతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ ఆదివారం తెలిపారు. ఈశిక్షణ ఖిలావరంగల్ మండలం ఉర్సుగుట్ట వద్ద ఉన్న బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. మొదటి దశలో వనంగల్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు గణితం (224), ఇంగ్లిష్ (179), సోషల్ స్టడీస్ (205) మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే మండల రిసోర్స్పర్సన్లకు 104 మందికి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు 34 మందికి, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్లు కలిపి మొత్తం 596 మంది ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా ఆన్లైన్లో హాజరు ఉంటుందని విధిగా టీచర్లు శిక్షకు హాజరుకావాల్సిందేనన్నారు. టీచర్లు విధిగా హాజరుకావాల్సిందే.. జిల్లాలో ఈనెల 13 నుంచి నిర్వహించనున్న టీచర్ల శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. టీచర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావా లి. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలి. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధన, నాణ్యమైన విద్య నైపుణ్యాల పెంపుదల ముఖ్యమైన అంశాలపై ఒక్కో టీచర్‌కు ఐదురోజులు శిఽక్షణ ఉంటుంది. – వాసంతి, డీఈఓ సమయపాలన పాటించాలి..ఉపాధ్యాయులు సమయపాలన పాటించాల్సిందే. ప్రతీ సబ్జెక్టుకు కాంప్లెక్స్ హెచ్ఎంలను సెంటర్ ఇన్చార్జులుగా నియమించాం. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉపాధ్యాయులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉపాధ్యాయులందరికీ ప్రీటెస్ట్, అంతిమ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. హాజరు కూడా ఆన్లైన్ ద్వారా ఉదయం శిక్షణ కేంద్రానికి 9:30 గంటల్లోపు వచ్చిన వారిని నమోదు చేస్తారు. జియో కార్డినల్ ద్వారా తమ మొబైల్ నుంచి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయిన అనంతరం ఆన్లైన్ ద్వారానే వారి మొబైల్‌కు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందుతుంది. – శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ రేపటి నుంచి 17 వరకు మొదటి దశ ఒక్కో టీచర్‌కు ఐదురోజులపాటు.. మరో రెండు దశలు కూడా.. ఇప్పటికే డీఆర్పీలకు శిక్షణ పూర్తి -
మధ్యాహ్న భోజన పథకాన్ని ‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దు
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో ‘అక్షయపాత్ర’కు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్ డిమాండ్ చేశారు. ఆ దివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మ ధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్లకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో 20 ఏళ్లుగా మధ్యాహ్నభోజన కార్మికులు బిల్లులు సకాలంలో రాకపోయినా విద్యార్థులకు వంటచేసి పెడుతున్నారని అన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 14న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిడిగొండ రజిత, బాధ్యులు కె.శాంత, సుక్కుబాయి, కె.కవిత, స్వప్న, రాణి, విజయ, శారద,వసుంధర, తస్లీమ్, సరిత పాల్గొన్నారు. ‘పాలిసెట్’ ఏర్పాట్లు పూర్తి రామన్నపేట: జిల్లాలో ఈనెల 13న (మంగళవారం) నిర్వహించనున్న పాలిసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూ డేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు, వ్యవసాయ, వెటర్నరీ డిప్లొ మా ప్రవేశాలకు నగరంలోని 12 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. వీటిలో 6,424 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, 11 గంటల తర్వాత అభ్యర్థులను అనుమతించరని సూచించారు. నేటి గ్రేటర్ గ్రీవెన్స్ రద్దువరంగల్ : బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో సోమవారం(నేడు) నిర్వహించే గ్రేటర్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారణాలతో ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న ఆమె.. నగర ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇవ్వడానికి రాకూడదని సూచించారు. సాధు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణనయీంనగర్: సాధు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా హనుమకొండకు చెందిన ల క్ష్మీనారాయణ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు అంబికేశ్వరానంద భా రతి ఈమేరకు ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గో సంరక్షణ, సాధు సంరక్షణ, గీతా సంరక్షణ, వేద సంరక్షణ, సనాతన పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు. -
డబుల్ ధమాకా
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 48 సాధారణ స్లాట్ బుకింగ్స్‌తో పాటు 5 ప్రత్యేక స్లాట్స్ ఉండగా.. వరంగల్ ఆర్ఓకు డబుల్ ధమాకాలో భాగంగా.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లకు 96 స్లాట్స్‌తో పాటు ప్రత్యేక స్లాట్స్ 10 కేటాయించనున్నారు. సోమవారం(నేడు) నుంచి డబుల్ స్లాట్ ప్రారంభం కానుంది. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ కోరుకున్న సమాయానికి, కోరుకున్న తేదీన కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని దస్తావేజులను సైతం భూక్రయవిక్రయదారులు పొందేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ గత నెల 10న స్లాట్ బుకింగ్స్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. వరంగల్ ఆర్వోలో జాయింట్–1, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ హోదా కలిగి ఉంటుంది. దీంతో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహించనున్నారు. మిగతా వాటిల్లో కేవలం ఒక్క సబ్ రిజిస్ట్రార్ మాత్రమే అందుబాటులో ఉంటారు. నాలుగు కార్యాలయాల్లో ‘స్లాట్’ సిస్టం వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈనెల 12 నుంచి స్లాట్ బుకింగ్స్ సిస్టమ్ ప్రారంభం కానుంది. రోజూ 48 స్లాట్ బుకింగ్స్.. ఇందులో ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 1 గంట వరకు 24, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 వరకు 24 స్లాట్ బుకింగ్స్ సాధారణ ప్రజలకు, సాయంత్రం 5 నుంచి 6 వరకు దివ్యాంగులకు, వయోవృద్ధులకు, పేషెంట్లకు మరో 5 స్లాట్ బుకింగ్స్ అవకాశం కల్పించారు. సమయానికి రావొచ్చు.. స్లాట్ బుకింగ్ సదుపాయంతో ఆన్లైన్లో ఎంచుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి భూ క్రయవిక్రయదారులు రానున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తవ్వగానే దస్తావేజులు చేతికందుతాయి. స్లాట్ బుకింగ్స్‌తో భూక్రయవిక్రయదారులతో పాటు కార్యాలయ సిబ్బందికి సమయ పాలన అలవాటవుతుంది. – ఆనంద్, సబ్‌రిజిస్ట్రార్, వరంగల్ ఆర్ఓన్యూస్రీల్వరంగల్ ఆర్వోలో ‘డబుల్ స్లాట్ బుకింగ్స్’ నేటి నుంచి ప్రారంభం భూక్రయవిక్రయదారులకు తప్పనున్న తిప్పలుతప్పనున్న తిప్పలు.. వరంగల్ ఆర్ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజూ 160 నుంచి 180 దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా దస్తావేజుల మ్యుటేషన్, స్కానింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే.. స్లాట్ బుకింగ్ సిస్టంతో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు దస్తావేజులు చేతికందే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో రాత్రి 8 గంటల వరకు సైతం రిజిస్ట్రేషన్లు జరిగేవి. దీంతో అధికారులతో పాటు భూక్రయవిక్రయదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. -
వీర జవాన్లు అమర్ రహే..
● వేయిస్తంభాల ఆలయం నుంచి కాగడాల ర్యాలీ హన్మకొండ చౌరస్తా /హన్మకొండ: పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అమరులైన తెలుగుతేజం మురళీనాయక్, మరెందరో జవాన్ల విరోచిత పటిమను స్మరిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శన భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక చేతిలో కాగడా, మరో చేతిలో జాతీయ జెండాలతో యువకులు వందేమాతరం, భారత్‌మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్, మురళీనాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా రాకేశ్‌రెడ్డి భారత సైన్యానికి రూ.25 వేల చెక్కును అందజేయనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ వంద శాతం విజయవంతమైందని రాకేశ్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ సోల్జర్ ప్రభాకర్, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, ఇండస్ ఫౌండేషన్ నాయకులు పాల్గొన్నారు. -
పీఆర్ రోడ్లకు మహర్దశ
స్పెషల్ రిపేర్స్, బీటీ, నిర్మాణాలకు పెద్దపీట ● మరమ్మతులు, కొత్త రోడ్లపై తారుకు నిధులు ● ఐదు జిల్లాల్లో 62రోడ్లకు రూ.69.33 కోట్లు... ● ఆన్లైన్లో టెండర్లు పిలిచిన పంచాయతీరాజ్ శాఖ ● ఈనెల 17తో ముగియనున్న ప్రక్రియసాక్షిప్రతినిధి, వరంగల్ : ● వరంగల్ జిల్లా గీసుకొండ నుంచి మొగిలిచర్ల ఎక్స్‌రోడ్డు వరకు రోడ్డు స్పెషల్ రిపేర్స్ కోసం రూ.1.57 కోట్లతో అంచనా వేశారు. రూ.1,22,93,509లకు ఆన్లైన్ టెండర్ పిలువగా ఈనెల 17న గడువు ముగుస్తుంది. ● హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం జెడ్పీ రోడ్డు నుంచి అలియాబాద్ ద్వారా కామారెడ్డిపల్లి వరకు రోడ్డు ప్రత్యేక మరమ్మతులకు రూ.2 కోట్లతో అంచనాలు పంపారు. ప్రభుత్వం రూ.158,09,702లకు పరిపాలన అనుమతి ఇవ్వగా ఆన్లైన్ టెండర్ ద్వారా ఈనెల 17 తర్వాత పనులు ఖరారు చేయనున్నారు. ● మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ నుంచి బెరువాడ పీఆర్ రోడ్డు (మంచతండా) వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.1,25,48,271లతో టెండర్లు పిలువగా, ఈనెల 15 వరకు ఆన్లైన్లో దాఖలుకు అవకాశం ఉంది. .. ఇలా ఉమ్మడి వరంగల్‌లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఐదు జిల్లాల్లో పాత రోడ్లకు స్పెషల్ రిపేర్స్, అత్యవసర మరమ్మతులు, మట్టి రోడ్లపై తారు వేయడంతో పాటు రోడ్డులేని గ్రామం లేకుండా కొత్తరోడ్లు నిర్మించేందుకు ఈ నిధులు మంజూరు చేసింది. మొదటి విడతగా హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.69.33 కోట్లతో 62 రోడ్లకు గత నెలాఖరులో నిధులు మంజూరు చేసింది. ఈమేరకు అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు పంచాయతీరాజ్ శాఖ వరంగల్ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం నుంచి టెండర్లు పిలిచారు. ఈనెల 8 నుంచి 17 తేదీ వరకు టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చారు. మానుకోటకు పెద్దపీట గత వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు పలు ప్రాంతాల్లో మరమ్మతులకు నోచుకోకపోగా.. మళ్లీ వర్షాకాలం సమీపిస్తోంది. ఈనేపథ్యంలో నియోజకవర్గాల వారీగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతో పాటు స్పిల్ఓవర్ పనులకు ఎమ్మెల్యేలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపారు. 62 రోడ్లపై సుమారు రూ.75 కోట్ల మేరకు అవసరం ఉంటుందని ఎస్టిమేట్స్ రూపొందించగా, రూ.69.33 కోట్లు విడుదలయ్యాయి. హనుమకొండ జిల్లాలో 15 రోడ్లకు రూ.5.92 కోట్లు కేటాయించగా, ములుగు 11 రోడ్లకు రూ.17.10 కోట్లు, జేఎస్ భూపాలపల్లికి ఐదు రోడ్లకు రూ.7.61 కోట్లు, వరంగల్ 10 రోడ్లకు రూ.9.20 కోట్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 21 రోడ్లకు రూ.27.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. మొత్తంగా విడుదలైన సుమారు రూ.69.33 కోట్లలో మానుకోటకు పెద్దపీట లభించింది. -
కళల విశిష్టతను నలువైపులా చాటాలి
హన్మకొండ కల్చరల్: ఓరుగల్లు ఖ్యాతిని, కళల విశిష్టతను నలువైపులా చాటాలనే సంకల్పంతో ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ అన్నారు. అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్ సౌజన్యంతో తెలుగు వాగ్గేయకారులు, పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంత్యుత్సవం, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో సూ త్రపు అభిషేక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో నగరానికి చెందిన కళాకారులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వందకుపైగా కళాకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ప్రదర్శించిన సంగీత, నృత్యాలు అలరించాయి. అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ -
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీ సంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తం 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభాల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి రెండు బృందాలుగా విడిపోయి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వారికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరిస్తారు. వివిధ పూజా, ఇతరత్రా కార్యక్రమాల తర్వాత గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్య ప్రదర్శన ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా.. ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్‌కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటేలా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విద్యుత్ వెలుగుల్లో ఖిలావరంగల్ కోట శిల్పాల ప్రాంగణంఅందాలభామల్ని అబ్బురపర్చేలా ప్రదర్శనలు రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు -
శోభాయమానంగా అమ్మవారికి పుష్పయాగం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా చివరిరోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పసుపు కొమ్ములు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి చూర్ణోత్సవం జరిపారు. ముఖ్యార్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, అర్చకులు చక్రతీర్థోత్సవం నిర్వహించారు. మంగళవాయిద్యాలతో తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. మధ్యాహ్నం పూర్ణాహుతి, బలిహరణ, భేరీతాడనం, ధ్వజావరోహణ తదితర అనుష్టాన కార్యక్రమాలు నిర్వహించారు. శతఘటాభిషేకం నిర్వహించి అమ్మవారి పూలమాలలతో అలంకరించారు. పూజా కార్యక్రమాలకు హైదరాబాద్‌కు చెందిన శ్రీలక్ష్మీదేవి అసోసియేట్స్ వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. శోభాయమానంగా పుష్పయాగం.. రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛాటన చేస్తుండగా.. పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి మాట్లాడుతూ.. కల్యాణ బ్రహ్మోత్సవాలు విజయవంతమవ్వడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్‌కుమార్ పర్యవేక్షించారు. సిబ్బంది అలుగు కృష్ణ, చింత శ్యాంసుందర్, నాగులు పాల్గొన్నారు. భద్రకాళి ఆలయంలో ముగిసిన కల్యాణ బ్రహ్మోత్సవాలు ఽవైభవంగా చూర్ణోత్సవం, ఘటాభిషేకం -
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
– 10లోuఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒప్పుకుంది. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్‌గౌడ్‌కు సూచించింది. మొదటి ప్రయత్నంలో రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాడు. మళ్లీ ఎలేందర్‌గౌడ్‌ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్‌లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్తాన్‌తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది. జనగామ: ‘బిడ్డా దేశం నీకోసం ఎదురు చూస్తోంది.. తుపాకీ ఎక్కుపెట్టు.. భరత మాత జోలికి వచ్చే ఉగ్రమూకల భరతం పట్టు’ అంటూ బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లికి చెందిన జవాన్ బేజాటి వెంకట్‌రెడ్డిని అతడి తల్లి నాగలక్ష్మి నిండు మనసుతో ఆశీర్వదించి సాగనంపారు. సెలవులపై గత నెల 30న స్వగ్రామానికి వచ్చిన వెంకట్‌రెడ్డి.. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి పిలుపు రావడంతో శనివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా కశ్మీర్‌కు బయల్దేరాడు. 2005లో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్‌కు ఎంపికై న వెంకట్‌రెడ్డికి 2007లో మొదటి పోస్టింగ్‌లో జమ్మూకశ్మీర్ శాంతి భద్రతల విభాగంలో బాధ్యతలు అప్పగించారు. 2009–15 వరకు అస్సాంలో విధులు నిర్వహించగా.. ఉత్తమ సేవలకు 2014లో కామెండేషన్ డిస్క్‌తో సత్కరించారు. 140 కోట్ల భారత ప్రజలకు కాపలా ఉండే అవకాశం మా ఇంట్లో నుంచి కొడుకుకు రావడం తల్లిగా గర్విస్తున్నానంటూ ఆనంద భా ష్పాలతో నాగలక్ష్మి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఎవరెస్టు కన్నా ఎత్తయినవి ఆమె ఊహా శిఖరాలు. సిందూరంకన్నా ఎరుపెక్కినవి ఆమె హృదయ జ్వాలలు. తనువును మోస్తున్న నేలకు, స్వేచ్ఛావాయువులను ఇచ్చిన భరత భూమికి సేవ చేయాలన్నదే ఆ తల్లుల సంకల్పం. అందుకనుగుణంగా వారి బిడ్డల్ని తీర్చిదిద్దారు. నిలువెల్లా దేశభక్తిని నూరిపోశారు. దేశసేవ కోసం సైన్యంలోకి పంపించిన ఓరుగల్లు మాతృమూర్తులే ఒక సైన్యం. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా దేశ సేవకు బిడ్డలను పంపిన పలువురు తల్లులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. ● భర్త మిలటరీలో మరణించినా.. బిడ్డలను కూడా పంపిన మరికొందరు.. ● సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లా యువత ● గర్వంగా ఫీలవుతున్న మాతృమూర్తులు నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్లయ్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 ఏళ్ల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్(వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన సియాచిన్‌లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ఉగ్రమూకలను తుదముట్టించే ‘ఆపరేషన్ సిందూర్’లో తన కొడుకు భాగస్వామి అవడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నట్లు తల్లి అన్నపూర్ణ చెబుతోంది.న్యూస్రీల్దేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన ఓరుగల్లు తల్లులు కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి..బిడ్డకు ఆశ్వీరాదంఆశయానికి ‘అమ్మ’ అండ.. -
ఇద్దరు పిల్లలు ఆర్మీలోకి..
స్టేషన్‌ఘన్‌పూర్: ఇప్పగూడెం గ్రామానికి చెందిన జిట్టెబోయిన రాజు, శ్రీకాంత్ భారత ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. సుభద్ర, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించి వివాహం చేశారు. కాగా పిల్లలకు తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తిని నూరిపోసింది. దేశ రక్షణకు మించిన సేవ లేదని చెప్పిన మాతృమూర్తి కోరిక మేరకు కొడుకులిద్దరూ డిగ్రీ వరకు చదివి పదేళ్ల క్రితం భారత ఆర్మీకి ఎంపికయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. ‘మా పిల్లలు రాజు, శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే భారత సైన్యం అంటే ఇష్టపడేవారు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధం ఆందోళనగా ఉంది. మా పిల్లలతోపాటు భారత ఆర్మీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని తల్లి సుభద్ర తెలిపింది. ఆర్మీలో ఉద్యోగం నా కలమహబూబాబాద్ అర్బన్: నా చిన్నతనం నుంచే పోలీస్,ఆ ర్మీలో చేరాలన్నది నాకల. 2012లో ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఆడపిల్లవు, ఆర్మీ అంటే ప్రాణాలతో చెలగాటం.. అని అమ్మ భయపడింది. కానీ, ఈరోజుల్లో ఆడపిల్లలు విమానాలు, రాకెట్లు నడపుతున్నారు.. దేశాలు దాటి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.. నేను దేశంలోనే ఉంటూ దేశంకోసం పనిచేస్తానని అమ్మకు నచ్చజెప్పా. గుజరాత్, జమ్మూకశ్మీర్, న్యూఢిల్లీలో పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాపిడ్యాక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నా. – ఎడ్ల ఝాన్సీ, మానుకోట -
కూలిన రాతికోట దక్షిణ ముఖ ద్వారం పైకప్పు
ఖిలా వరంగల్: పడమర కోట నుంచి మధ్యకోటకు వెళ్లే రాతి కోట దక్షిణ ముఖ ద్వారం పైకప్పు (భారీ రాతి స్తంభం) ఒక్కసారిగా కూలింది. ముఖ ద్వారం కింది నుంచి నిత్యం వందలాది మంది స్థానికులు, పర్యాటకులు వస్తూపోతుంటారు. ప్రమాదం పొంచి ఉందని స్థానికులు కేంద్ర పురావస్తుశాఖ అఽధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా రాతి కోట ముఖద్వారం పైకప్పునకు ఏర్పాటు చేసిన రాతి స్తంభం ఒకటి కూలి రెండు ముక్కలైంది. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికై నా రాతి, మట్టికోటల ముఖ ద్వారాలకు మరమ్మతులు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
పుష్కరాలకు వైద్యసేవలు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 15నుంచి 26వ తేదీ వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం తివ్రేణి సంగమం వద్ద నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యశిబిరాలు, మెడికల్ క్యాంపుల్లో వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని నియమించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి స్పెషలిస్టు వైద్యులను కేటాయించారు. తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు కాళేశ్వరం పీహెచ్సీలో తాత్కాలికంగా 10 పడకలను ఏర్పాటు చేసి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్, పల్స్మీటర్, ఈసీజీ సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, ఇద్దరు వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్, పార్మసిస్టు, స్టాఫ్ నర్సులను నియమించనున్నారు. పీహెచ్‌సీలకు ఇబ్బంది కలగకుండా.. కాళేశ్వరంలో ఏర్పాటు చేసి వైద్య శిబిరాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొననున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 11 రోజులపాటు ఇబ్బందులు కలగకుండా వైద్యాధికారులు, సిబ్బంది కేటాయించారు. ఆర్బీఎస్కే, పల్లెదవాఖాలు, పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉంటే ఒక్కొక్కరిని, సిబ్బందిని కూడా అదేవిధంగా ఎక్కువ మంది ఉన్న సిబ్బందిని కాళేశ్వరం విధులకు పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ పర్యవేక్షణ కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవిని నియమించారు. వైద్య సిబ్బందికి విధులు కేటాయించి వారు అందిస్తున్న సేవలు, ఇబ్బందులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెండు మానిటరింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేయనున్నారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా సేవలుకాళేశ్వరం పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాం. వేసవికాలం కావడంలో ఇక్కడికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, ఇబ్బందులు ఎదురైనట్లయితే వెంటనే వైద్యశిబిరాలను సంప్రదించాలి. ఎక్కువసేపు ఎండలో తిరగొద్దు. మధ్యాహ్న సమయంలో స్నానం చేయకపోవడమే మంచిది. రోజూ ఒక్కో క్యాంపులో 2వేల ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తాం. – మధుసూదన్, డీఎంహెచ్ఓకాళేశ్వరంలో 10 వైద్యశిబిరాలు ఒక్కో శిబిరంలో 10 పడకలు 36 మంది వైద్యులు, 450 మంది సిబ్బంది రెండు ప్రత్యేక బృందాల ఏర్పాటు10 చోట్ల క్యాంపులు కాళేశ్వరంలో 11 రోజులపాటు మూడు షిఫ్టులో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. ముక్తీశ్వర ఆలయ సమీపం, పాత ఈఓ కార్యాలయం, టెంట్ సిటీ, పార్కింగ్ –1, పార్కింగ్–2, పార్కింగ్ –3, హరిత హోటల్, గోదావరి మెయిన్ ఘాట్, వీఐపీ ఘాట్, హెలిపాడ్ దగ్గరలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఉన్న పీహెచ్సీలో 10 పడకలతో తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో డాక్టర్(ఎంఎల్‌హెచ్‌పీ), హెల్త్ సూపర్వైజర్, ఇద్దరు చొప్పున ఏఎన్ఎం, ఆశ వర్కర్లను నియమించారు. వ్యాధి తీవ్రతను బట్టి అత్యవసరమైతే మహాదేవపూర్‌లోని సీహెచ్‌సీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
సుందరీమణుల రాకకు సుందరంగా..
ఖిలా వరంగల్: ప్రపంచ సుందరీమణుల రాకకు కోట సుందరంగా ముస్తాబవుతోంది. శుక్రవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో శిల్పకళా సంపద మరింత అందంగా, ఆకర్షణీయంగా కనివిందు చేస్తోంది. ఈ సందర్భంగా కాకతీయుల రాజధాని మధ్యకోటలో జరుగుతున్న పనులను కుడా, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శుక్రవారం పరిశీలించారు. శిల్పాల ప్రాంగణం, కోట రోడ్డుకు ఇరువైపులా మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. విద్యుత్‌కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ తగిన ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాల వెలుగుల్లో శిల్పకళా వైభవాన్ని సుందరీమణుల వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రాత్రి శిల్పాల ప్రాంగణంలో ట్రయల్ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు అజిత్‌రావు, భీమ్రావు, బల్దియా అధికారులు, కేంద్ర పురావస్తు శాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్చార్జ్ అజయ్, గైడ్ దేనబోయిన రవియాదవ్, డీఈ మల్లికార్జున్, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసర సమయాల్లో రెడ్ క్రాస్
హన్మకొండ అర్బన్: అత్యవసర సమయంలో రెడ్ క్రాస్ సేవలు ముందుంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ రెడ్ క్రాస్ భవన్లో వేడుకలను రెడ్‌క్రాస్ పాలకవర్గం ఘనంగా నిర్వహించింది. సొసైటీలోని తలసేమియా సెంటర్‌ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రం, తలసేమియా సెంటర్, జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా రక్తదాన శిబిరాల నిర్వహణ కేటగిరిలో కిట్స్ వరంగల్ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించి 540 యూనిట్ల రక్తం సేకరించి రెడ్ క్రాస్ రక్త కేంద్రానికి అందచేసినందుకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సతీశ్‌చంద్రను సీపీ సన్‌ప్రీత్‌సింగ్, పాలకవర్గం శాలువా, షీల్డ్‌తో సత్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయచందర్‌రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ.శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, సుధాకర్ రెడ్డి, డాక్టర్ సంధ్యారాణి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ల రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, ప్రొఫెసర్ పాండురంగారావు, కన్సల్టింగ్ ఇంజనీర్ కె.సత్యనారాయణరావు, బన్ను ఆరోగ్య ది సేవా సొసైటీ ప్రతినిధులు వీరమళ్ల కిరణ్‌కుమారి, చంద్రజిత్డ్డి, రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులు, తలసేమియా బాధితులు, రెడ్ క్రాస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుళ్లకు సీపీ అభినందన వరంగల్ క్రైం: అత్యధికసార్లు రక్తదానం చేసిన వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్ కన్నె రాజు, కేయూ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సుబేదారి రెడ్‌క్రాస్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కన్నె రాజు 37వ సారి, రవీందర్ 18వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేయగా.. వారిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. సీపీ సన్‌ప్రీత్ సింగ్ -
మానసిక వికాసానికి క్రీడలు దోహదం
● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి ● వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభంవరంగల్ స్పోర్ట్స్: మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని, బాల్యం నుంచే ఏదో ఒక క్రీడను ఎంచుకుని అందులో రాణించాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో నెలరోజుల పాటు నిర్వహించనున్న ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని కేఎంసీ మైదానంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులను వృథా చేయకుండా ప్రత్యేక శిక్షణ శిబిరాల ద్వారా సరికొత్త మెళకువలు నేర్చుకోవాలని క్రీడాకారులకు చెప్పారు. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా కేఎంసీ మైదానం.. ఎంతో మంది జాతీయస్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో డబ్ల్యూసీఏ ఉపాధ్యక్షులు సదాశివ, రాము, కార్యవర్గ సభ్యుడు అభినవ్ వినయ్, కోచ్ గోవింద్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని మీసేవ కేంద్రాల్లో శిక్షణ కోసం దరఖాస్తులు చేయవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 50 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుకు ఈనెల 17 వరకు గడువు ఉందని, వివరాలకు 9704443476, 9398987337 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుకు నేడు చివరి గడువు న్యూశాయంపేట: జిల్లా పరిశ్రమల కేంద్రంలో సంస్థాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు కాంట్రాక్ట్ పద్ధతిలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి శని వారం ఆఖరు తేదీ అని వరంగల్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె.రమేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు www. nimsme.gov.inలో సంప్రదించాలని సూచించారు. కళాశాలలో ప్రవేశానికి కౌన్సెలింగ్ న్యూశాయంపేట: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రీజినల్ కో–ఆర్డినేటింగ్ ఆఫీసర్ డీఎస్.వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ(జి), పాలకుర్తి(జి), పర్వతగిరి(జి), మూడుచెక్కలపల్లి(జి), నర్సంపేట(బాలుర) కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సీట్లు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తికలిగి పదో తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ఈనెల 15న వరంగల్ నగరంలోని యాకూబ్పురలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 94909 57296 నంబర్లో సంప్రదించాలని సూచించారు.14 కిలోల గంజాయి పట్టివేతకాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో 14.7 కిలోల ఎండు గంజాయిని శుక్రవారం ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ వేముల చంద్రమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షహనావాస్ కాశీం ఆదేశం మేరకు జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు పర్యవేక్షణలో రైల్వే జంక్షన్లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఒడిశా నుంచి వచ్చే రైళ్లలో గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా అందిన ముందస్తు సమాచారం ఆధారంగా రైళ్లలో తనిఖీలు చేపట్టారు. అనంతరం జంక్షన్లో ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆగి తనిఖీ చేయగా.. రూ.90 వే లు విలువైన గంజాయి లభించగా కేసు నమోదు చే శారు. ఎస్సై తిరుపతి, ఖలీల్, లాలయ్య, కోటిలింగం, ఆయుర్, రషీద్ పాల్గొన్నారు. ఇద్దరి దుర్మరణంమరిపెడ: రెండు బైక్‌లు ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం శివారులో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం బాబోజీగూడెం గ్రామ శివారు వెంకురాం తండాకు చెందిన భూక్య సంతోష్ (30), భోజ్యతండాకు చెందిన గుగులోతు కార్తీక్ (35) స్నేహితులిద్దరు కలిసి గురువారం రాత్రి తండా నుంచి మరిపెడ మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. బావోజీగూడెం శివారు వాగోడ్డుతండాకు చెందిన అజ్మీర సుధీర్ మరో ద్విచక్రహనంపై వారు వెళ్తున్న దారిలో వెళ్తున్నాడు. మరిపెడ మున్సిపాలిటీ సమీపంలోని 365జాతీయ రహదారిపై అతివేగం కారణంగా ఆ రెండు బైక్‌లు పరస్పరం ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. సుధీర్‌కు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అజ్మీరా లాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నేటితో ముగియనున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు
హన్మకొండ కల్చరల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న భద్రకాళి, భద్రేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ శేషుభారతి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు నేతృత్వంలో శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా శతుష్టార్చన పూజలు నిర్వహించిన అనంతరం భద్రకాళి అమ్మవారికి ఉదయం శరభ వాహన సేవ, సాయంత్రం పుష్పరథ సేవ జరిపించారు. ఈ పూజాది కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ప్రతినిధులు.. ఉభయ దాతలుగా వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్, బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణగౌడ్, రాష్ట్ర నాయకులు జనగాం శ్రీనివాస్‌గౌడ్, బత్తిని సుదర్శన్ గౌడ్, కుమారస్వామి, కార్పొరేటర్ పోశాల పద్మ తదితరులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’ అప్పుడు.. ఇప్పుడు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం 1975కు పూర్వం శిధిలావస్థలో ఉండేది. అప్పటి వరకు కీకర దండకారణ్యం కావడంతో కాకులు దూరని కారడవిగా ఉండే ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు ప్రత్యేక చొరవ తీసుకొని జీర్ణోద్దరణ కమిటీ వేసి పనులు ప్రారంభించారు. కమిటీలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, అప్పటి కలెక్టర్ ఇతరులు సభ్యులుగా ఉన్నారు. రోడ్డు, రవాణా, విద్యుత్, కనీస అవసర సదుపాయాలు కల్పించారు. 1982లో శృంగేరి శారద పీఠాధిపతులు విద్యాతీర్థమహాస్వామి, భారతీతీర్ధస్వామి చేతుల మీదుగా కుంభాభిషేకం చేసి జీర్ణోద్దరణ జరిపారు. తర్వాత దేవస్థానం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అనేక మార్పులు సంతరించుకున్నాయి. నాడు పదుల సంఖ్యలో వచ్చే భక్తులు.. ప్రస్తుతం వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం దేవాలయం వార్షికాదాయం రూ.6 కోట్లకు చేరింది. రోడ్డు, రవాణా, అంతర్రాష్ట్ర వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. దేవస్థానం దేశవ్యాప్తంగా కీర్తి పొందుతూ ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి సీఎం కేసీఆర్ రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో రూ.25కోట్ల వరకు నిధులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక దృిష్టితో నిధులు మంజూరు చేయగా పనులు జరుగుతున్నాయి. ఈనెల 15 నుంచి 26 వరకు సరస్వతీనది పుష్కరాలను ప్రభుత్వం నిర్వహించనుంది. పుష్కరాల ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. త్రివేణి సంఘమైన(గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతీనది) కాళేశ్వరంలో 12ఏళ్లకోసారి ఒక్కో నదికి పుష్కరాలు నిర్వహిస్తుంటారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం తగదు
హన్మకొండ అర్బన్: సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా చొరబడి సోదాలు చేయ డాన్ని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సాక్షి పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏపీ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను హరించేలా ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హితవు పలికారు. నిరసన కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జ్ వర్ధెల్లి లింగయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్య, కోశాధికారి బోల్ల అమర్, రాష్ట్ర నాయకులు వల్లాల వెంకటరమణ, గాడిపెల్లి మధు, వేణుమాధవ్, యూనియన్ ప్రతినిఽధి తోట సుధాకర్, టీయూడబ్ల్యూజే –143 హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజ్‌కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకే శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు పిన్నా శివకుమార్, అబ్బు వెంకట్‌రెడ్డి, అల్లం రాజేష్ వర్మ, సదానందం, ఎలక్ట్రానిక్ మీడియా, ఫొటో జర్నలిస్టు సంఘాల నుంచి తిరుపతి, గొట్టె వెంకట్, సంపెట వెంకటేశ్వర్లు, వరప్రసాద్, ఐజేయూ – టీయూడబ్ల్యూజే జిల్లా నాయకుడు ఊటుకూరు సాయిరాం, సీనియర్ జర్నలిస్టులు అల్వాల సదాశివుడు, కోలా కృష్ణకుమార్ రెడ్డి, అహ్మద్, బత్తిని రాజేందర్, రమేష్, నరేందర్, వెంకటస్వామి, సుధాకర్, నాగరాజు, రమేష్, అనిల్, రాజిరెడ్డి, శ్రీనివాస్, డెస్క్ జర్నలిస్టులు మహేష్, ఓంకార్, రవికుమార్, అశోక్, రాజు, రమేష్, దాసరి బాబు, రాంచందర్ రావు, రామాచారి, శ్రావణ్, శ్రీనివాస్, మధుసూదన్, పాత్రికేయులు పాల్గొన్నారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన -
మనకంటూ ఓ బ్రాండ్ వచ్చేలా..
నిర్మల్, పోచంపల్లి వంటి ప్రాంతాలకు వచ్చిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేలా వెదురు బొంగులతో ప్రత్యేక అందాలను ఇచ్చేలా బొమ్మలను తయారు చేయిస్తున్నాం. రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చే అందాల తారలకు బహుమతులుగా ఇవ్వాలా? స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలా? అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30 మంది మహిళలకు 20 రోజులపాటు శిక్షణ ఇచ్చాం. వారు తయారుచేసిన బొమ్మలు చూడముచ్చటగా, సహజసిద్ధంగా ఉన్నాయి. కచ్చితంగా అందరినీ ఆకర్షిస్తాయని భావిస్తున్నాం. – రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ, ములుగు -
భూసేకరణ త్వరగా పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్: హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో నుంచి వెళ్తున్న 163 (జీ) గ్రీన్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో జాతీయ రహదారి 163 (జీ), కాలా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, సీజీఎంఆర్వో శివశంకర్, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి జాతీయ రహదారులు, రెవెన్యూ, ఆర్అండ్బీ శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి హరిచందన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. రెండో దశ ప్రాజెక్టులో భాగంగా హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి పరిధిలో జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. సరస్వతీ పుష్కరాల తర్వాత భూసేకరణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లకు సంబంధించి భూసేకరణపై ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. సమావేశంలో జాతీయ రహదారుల శాఖ వరంగల్, ఖమ్మం ప్రాజెక్టు డైరెక్టర్లు దుర్గాప్రసాద్, దివ్య, ఆర్అండ్బీ ఎస్ఈ నాగేంద్రరావు, ఈఈ సురేశ్‌బాబు, ఆర్డీఓలు ఎన్.రవి, ఉమారాణి, సత్యపాల్‌రెడ్డి, రాథోడ్ రమేశ్, నారాయణ, తహసీల్దార్లు, జాతీయ రహదారుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన -
నాలాల పూడికతీత వేగవంతం చేయాలి
వరంగల్ అర్బన్ : నాలాల పూడికతీతలో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ నగరం ముంపు నివారణలో భాగంగా భద్రకాళి, బొందివాగు, నయీంనగర్, దర్గా కాజీపేట, శాకరాశికుంట, చిన్నవడ్డేపల్లి, శివనగర్, వరంగల్ 12 మోరీలు, అలంకార్ బ్రిడ్జి, నంది హిల్స్, జూ పార్క్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన నాలాల పూడికతీత పనులను శుక్రవారం మేయర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. పలు చోట్ల బాక్స్ డ్రెయిన్లు, నాలలతో పాటు అంతర్గత నాలాల పూడికతీత సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఆయా పనులు పూర్తిస్థాయిలో జరగాలని సూచించారు. తనిఖీల్లో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఏఈలు ముజమ్మిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ‘అమృత్ 2.0’కు నగరానికి రూ.3కోట్లు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా చేపడుతున్న జల్ హీ అమృత్ కార్యక్రమ లక్ష్యాలను అమలు చేసేందుకు వరంగల్ నగరానికి రూ.3కోట్లు కేటాయించిందని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆస్కితో కలిసి నగరంలో చేపట్టనున్న అంశాలపై శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో స్మార్ట్ సిటీ, ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జల్ హీ అమృత్ కార్యక్రమం స్టార్ రేటింగ్ కోసం హాజరైనట్లు పేర్కొన్నారు. అమృత్ నగరాలకు కేటాయించిన ర్యాంకింగ్‌లో భాగంగా జీడబ్ల్యూఎంసీకి ప్రభుత్వం రూ.3 కోట్ల్లు కేటాయించి, అందులో రూ.2.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. నగరంలోని 5, 15 ఎంఎల్డీ ఎస్టీపీలలో ఆన్లైన్ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ (ఓసీఈఎంఎస్) ఏర్పాటుకు, ఎస్టీపీ భవనాల మీద సోలార్ ఎనర్జీ తయారీకి ప్యానెళ్లు ఏర్పాటు చేసి ప్రతీరోజు 70 కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి, 15 ఎంఎల్డీ ప్లాంట్‌లో మురికి నీటిని శుద్ధీకరణకు వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఈ నీటిని పరిశ్రమలకు పంపడానికి (రీ యూజ్) మొత్తంగా రూ.3 కోట్లకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి -
టీచర్ల శిక్షణకు డీఆర్పీలు సిద్ధంగా ఉండాలి
విద్యారణ్యపురి: త్వరలో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల శిక్షణకు డిస్ట్రిక్ట్ రిసోర్స్‌పర్సన్ (డీఆర్పీ)లు సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి కోరారు. ఐదురోజులుగా హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాలవికాస్‌లో రాష్ట్రస్థాయిలో గణితం, సోషల్ స్టడీస్ జిల్లా రిసోర్స్పర్సన్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. సమావేశంలో ఎస్సీఈఆర్టీ కోర్సు కో–ఆర్డినేటర్లు ఎల్లయ్య, గణపతి, రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం అధ్యక్షుడు రథంగాపాణిరెడ్డి పాల్గొన్నారు. రామప్పను సందర్శించిన హనుమకొండ జడ్జివెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని హనుమకొండ జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి జస్టిస్ పట్టాభి రామారావు, ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా.. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్‌కుమార్, వెంకటేశ్ వివరించగా.. రామప్ప శిల్పకళాసంపద బాగుందని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సై జక్కుల సతీశ్ ఉన్నారు. నిట్ బీఓజీ చైర్‌పర్సన్‌గా మోహన్రెడ్డికాజీపేట అర్బన్: నిట్ వరంగల్ బీఓజీ (బోర్డ్ ఆఫ్ గవర్నర్స్) చైర్‌పర్సన్‌గా పద్మశ్రీ డాక్టర్ బీ.వీ.ఆర్ మోహన్‌రెడ్డిని కేంద్ర మంత్రిత్వ శాఖ శుక్రవారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్నెళ్ల కాల పరిమితితో చైర్‌పర్సన్‌గా ఆయన కొనసాగుతారు. కాలపరిమితి అనంతరం నూతన చైర్పర్సన్ నియామకం జరిగేంత వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. నిట్ వరంగల్ విద్యా సంస్థలో విద్యార్థులకు పరిశ్రమల జ్ఞానం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంలో బీవీఆర్.మోహన్‌రెడ్డి నియామకం అవడం ఆనందంగా ఉందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. అధికారులకు అభినందనలుహన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ విభాగం 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచినందుకు ఇటీవల హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికెట్లు డీఆర్డీఓ, డీపీఎంలకు అందజేశారు. ఈమేరకు శుక్రవారం డీఆర్డీఓ మేన శ్రీనివాస్, డీపీఎంలు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేసి అభినందించారు. -
అటవీశాఖ తరఫున అందమైన వెదురు బొమ్మలు
ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ సందర్శనకు ఈ నెల 14వ తేదీన రానున్న 35 మంది అందాల తారలను ఆకర్షించేలా జిల్లా అటవీశాఖ తరఫున ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈమేరకు జంగాలపల్లి గ్రామంలోని 30 మంది మేదరులకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు శిక్షకుల సమక్షంలో వెదురు బొమ్మల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఇప్పటివరకు వారు చేసిన వెదరుబొంగు గ్లాసులు, డేగ, ఎడ్లబండిపై రైతు దంపతులు, చిలుకలు, విసనకర్ర, తాబేలు, పిచ్చుకలు, పింఛం వదిలిన నెమలి వంటి బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ బొమ్మలను అందాలతారలకు జ్ఞాపికలుగా అందించాలా.. వచ్చేవారంతా చూసేందుకు స్టాల్ ఏర్పాటు చేయాలా? అనే విషయంపై పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఆబొమ్మలకు సుందరీ మణులు ఆకర్షితులైతే వీటికి ఉచిత ప్రచారం జరగడంతోపాటు జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ వస్తుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాకు రెండుసార్లు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అటవీశాఖ ఈ బొమ్మలను అందించగా ఆయన మంత్రముగ్ధుడయ్యారు. మంత్రి సీతక్క.. అధికారులను అభినందించారు. ఈ కోణంలో రామప్పకు వచ్చే సుందరీమణులను ఈ బొమ్మలు ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. 20 రోజులపాటు మేదరులకు ప్రత్యేక శిక్షణ ఇప్పటికే పూర్తికావొచ్చిన తయారీ రామప్పలో స్టాల్ ఏర్పాటుకు ప్రణాళిక -
రైతులకు ‘విశిష్ట గుర్తింపు’
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్‌తో సమానమైన ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలని నిర్ణయించింది. ఈమేరకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ పథకం’ను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించనున్నారు. ఇందులో భాగంగా.. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెలాఖరు వరకు దాదాపుగా రైతులందరినీ ఫార్మర్ రిజిస్ట్రీ పథకంలో నమోదు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ముందుకు సాగుతోంది. వివరాలన్నీ ఒకే చోట హనుమకొండ జిల్లాలో దాదాపు 1.56 లక్షల మంది, వరంగల్ జిల్లాలో 1.56 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈకార్యక్రమాన్ని ఇటీవల చేపట్టారు. ‘అగ్రి స్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక యాప్ ద్వారా రైతుల పేర్లు నమోదు చేిసి ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నారు. కాగా.. ఈవిశిష్ట నంబర్‌తో కూడిన కార్డుకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూయాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొంది. హనుమకొండ జిల్లాలోని రైతులు ఏఈఓలను కలిసి వివరాలు అందించాలని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్‌సింగ్ కోరుతున్నారు. కార్డులు అందజేయనున్న ప్రభుత్వం ముమ్మరంగా సాగుతున్న నమోదు కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం -
అక్రమదాడులపై వెల్లువెత్తిన నిరసన
– 10లోuవిజయవాడలోని ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి నివాసంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా దాడులు చేయడాన్ని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్లబ్యాడ్జీ లు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏపీ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. – హన్మకొండ అర్బన్ -
అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు
హన్మకొండ: సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గురువారం రాత్రి హనుమకొండ రాంనగర్‌లోని స్వగృహంలో వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన 13 డివిజన్ల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వెంటనే దాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో చేపట్టకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీనియర్ నాయకులు ఎల్లావుల లలితా యాదవ్, బుద్దె వెంకన్న, చింతల యాదగిరి, బండి రజనీ కుమార్, రాజు నాయక్, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ -
‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025శ్రీభద్రకాళికి వసంతోత్సవం హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి చతురన్తసేవ, సాయంత్రం విమానకసేవ (సర్వభూపాల వాహనసేవ) నిర్వహించారు. పూజాకార్యక్రమాలకు రాష్ట్ర కుమ్మరి కుల సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆమంచి నాగపరిమళ, శ్రీనివాస్ రావు దంపతులు, ఆమంచి రాజ్ప్రదీప్, అనసూయ, అనిల్ కార్తీక్, రాజేశ్వరి, ధర్మరాజు, వందన, అవునూరి రాంమూర్తి ప్రజాపతి, కుమారస్వామి, నాంపల్లి ప్రభాకర్, శ్రీనివాస్, రమేశ్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. జూపార్క్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనన్యూశాయంపేట : హనుమకొండ హంటర్‌రోడ్డులోని కాకతీయ జూ పార్క్‌లో కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన అంతర్గత రోడ్డు, సీసీ డ్రెయిన్ పనులకు గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్క్ సందర్శన కోసం వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. వర్షాకాలం వచ్చేలోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కోమల, రాజు, ఎఫ్ఆర్ఓ మయూరి, డీఈ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. శిల్పాల ప్రాంగణంలో ఏర్పాట్ల పరిశీలనఖిలా వరంగల్: ప్రపంచ సుందరీమణులు ఈనెల 14న ఖిలావరంగల్ కోటకు రానున్న నేపథ్యంలో గురువారం శిల్పాల ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను విద్యుత్‌శాఖ అఽధికారులతో కలిసి టూరిజం జీఎం నాథన్ పరిశీలించారు. సౌండ్ అండ్ లైటింగ్ షోకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కోటకు వెళ్లే రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలను బల్దియా సిబ్బంది తొలగించారు. ఫ్లడ్‌లైట్ల నిర్వహణను పరిశీలించారు. కోటను సందర్శించిన వారిలో నోడల్ ఆఫీసర్ పుష్పలత రెడ్డి, వివిధ శాఖల అధికారులు శివాజీ, బండి నాగేశ్వర్రావు, మల్లికార్జున్, కుసుమ సూర్యకిరణ్, విజయ్, శ్రీకాంత్, అజయ్, కోట గైడ్ రవియాదవ్ తదితరులు ఉన్నారు. ‘సాక్షి ఎడిటర్ ఇంటిపై పోలీసుల దాడికి ఖండన నయీంనగర్: ఎలాంటి నోటీస్ లేకుండా విజయవాడలోని సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేసిన ఏపీ పోలీసుల తీరును ఖండిస్తున్నామని, ఈఘటనను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఉన్నత న్యాయస్థానాల దృష్టికి యూనియన్ ద్వారా తీసుకువెళ్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ కక్షపూరిత కుట్రలో భాగంగా సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారని పేర్కొన్నారు. అక్కడి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని జర్నలిస్టులను, ఎడిటర్లను నియంత్రించుకోవాలనుకోవడం మతి లేని చర్యగా భావిస్తున్నామని తెలిపారు. ఏపీ పోలీసుల తీరుపై అన్ని యూనియన్లు, ప్రెస్ క్లబ్‌లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు.కాజీపేట: ఏళ్లుగా ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తున్న చెరువులు, ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన గుట్టలు, మట్టిగడ్డలు అక్రమార్కుల చేతిలో చిక్కి శల్యమైపోతున్నాయి. వీటిలోని మట్టి, మొరాన్ని ఇష్టారాజ్యంగా తవ్వుతుండడంతో ధ్వంసమవుతున్నాయి. స్థానిక అధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న బడా నాయకులు ఈ మొరం దందాలో భాగస్వాములు కావడం గమనార్హం. గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల్లోని కొన్ని గ్రామాల్లో మట్టి తరలింపు కోసం అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. గ్రామస్తులకు ఇష్టం లేకపోయినా కొందరు గ్రామపెద్దలే ఇందులో కీలకపాత్ర పోషిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వీరికి అధికారులు సహకరిస్తుండడంతో సామాన్యులు మిన్నకుండిపోతున్నారు. ఏకంగా ఓ కమిటీ ఏర్పాటు.. నగరం చట్టూ పక్కల ఉన్న చెరువులు, గుట్టలనుంచి మట్టిని తరలించేందుకు కొంతమంది కాంట్రాక్టర్లు ఒక మాఫియాలా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమకొండ, ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తి చుట్టూ పక్కల మండలాల్లో జరుగుతున్న రియల్ వ్యాపారానికి ఈ మట్టి అవసరం కావడంతో వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో మట్టి తవ్వకాలకు అనుకూలంగా పంచాయతీ తీర్మానాలు చేయడం గమనార్హం. పరోక్షంగా సహకరిస్తున్న అధికారులు.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో రియల్ వ్యాపారంలో సాగుతున్న మట్టి, మొరం దందాను అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. పది ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వెంచర్లు చేస్తున్న రియల్ వ్యాపారులు రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ధర్మసాగర్, మడికొండ, ఎలుకుర్తి, రాంపేట, అయోధ్యపురం, రాంపురం, సుబ్బయ్యపల్లె, సోమిడి, హసన్‌పర్తి, వేలేరు తదితర గ్రామాల శివారులో జరుగుతున్న రియల్ దందాలో రహదారుల కోసం వాడుతున్న మట్టిని చూస్తే ఆశ్యర్యపోయే పరిస్థితులు కనిపిస్తాయంటున్నారు. పరిశ్రమల అవసరాలకు కొత్తగా చేపట్టే నిర్మాణాలకు అవసరమైన మట్టిని ఇక్కడి నుంచే తరలిస్తున్నారు. లారీ మొరం రూ.6వేల నుంచి రూ.7,500ల వరకు విక్రయిస్తున్నారు. ఆసామికి మాత్రం రూ.2వేల లోపే నగదు ఇస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అధికారులే దృష్టి సారించాలి.. నగరం చుట్టు పక్కల మండలాలనుంచి నిత్యం వందలాది లారీల్లో మట్టి తరలిస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి పట్టించుకోకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. అధికారులు నిఘా పెట్టి అక్రమ మొరం వ్యాపారాన్ని ఆపాలి. – నార్లగిరి రామలింగం, మాజీ కార్పొరేటర్ నూతన వెంచర్లను పరిశీలించాలి.. నగరం చుట్టూ జరుగుతున్న నూతన రియల్ వెంచర్లలో అడుగిడితే వాస్తవ పరిస్థితి అవగతమవుతుంది. రాత్రి, పగలు తేడా లేకుండా నూతన వెంచర్లకు లారీలు మట్టితో వస్తున్నాయి. ఇదంతా సంబంధిత అధికారులకు కనిపించకపోవడం బాధాకరం. – మర్రిపెల్లి సుధాకర్, ధర్మసాగర్ ‘తలసేమియా’పై అవగాహన కల్పించాలిహనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం/హన్మకొండ చౌరస్తా: తలసేమియా వ్యా ధిపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రినుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.మదన్మోహన్రావుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. తలసేమియా జన్యు సంబంధమైన వ్యాధి అని, దీంతో బాధపడుతున్నవారి కుటుంబసభ్యులు తప్పకుండా జన్యు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధిగ్రస్తులకు తరచూ రక్త మార్పిడి అవసరమని, వీరి కోసం రెడ్‌క్రాస్ ఆవరణలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం డాక్టర్ గీత, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ దీప్తి, రామేశ్వరి, కౌముది, ఖాదర్ అబ్బాస్, రమేశ్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. ‘జల్ హి అమృత్’కు హాజరైన కమిషనర్వరంగల్ అర్బన్ : సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అర్బన్ గవర్నెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో మున్సిపల్ కమిషనర్లతో (జల్ హి అమృత్ అటల్ మిషన్ ఫర్ విజువనెన్స్ అండ్ అర్బన్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్) 2.0 కింద నిర్వహించిన ఒకరోజు శిక్షణ శిబిరం, కార్యశాలలో బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. జల్ హి అమృత్ 2.0 లక్ష్యం, మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగించడం ద్వారా నీటి నిర్వహణను మెరుగుపర్చడం, శుద్ధి కర్మాగారాల నిర్వహణకు సమర్థవంతంగా చేయించడం తదితర అంశాలపై శిక్షణ కొనసాగింది. అనంతరం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ నిర్వహిస్తున్న మురుగునీటి శుద్ధీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కాజీపేట ఏసీపీగా ప్రశాంత్రెడ్డివరంగల్ క్రైం : కాజీపేట సబ్ డివిజన్ ఏసీపీగా పింగిలి ప్రశాంత్‌రెడ్డిని నియమిస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాజీపేట ఏసీపీగా పనిచేసిన తిరుమల్ ఇటీవల హైదరాబాద్‌లోని హైడ్రా డీఎస్పీగా బదిలీ అయ్యారు. తెలంగాణ సైబర్ సెక్యురిటీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ప్రశాంత్‌రెడ్డి బదిలీపై కాజీపేట ఏసీపీగా వస్తున్నారు. న్యూస్‌రీల్ నగరం చుట్టుపక్కల గ్రామాల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు రియల్ వెంచర్లు, నిర్మాణాలకు విరివిగా వాడకం రూ.కోట్లలో సాగుతున్న వ్యాపారం రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోని అధికారులు గ్రామాల్లో అనుకూలంగా తీర్మానాలు లారీ మొరం రూ.6వేల నుంచి రూ.7,500ల వరకు విక్రయం ఆసామికి ఇచ్చేది మాత్రం రూ.2వేలలోపే.. నిబంధనలు ఏంటంటే? నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టిని తవ్వకూడదు. ఒకవేళ రైతుల పొలాల్లోకి ఒండ్రుమట్టి అవసరమైతే నీటిపారుదల శాఖ అధికారులకు సూచనలు, సలహాల మేరకు రెండు నుంచి మూడు అడుగుల లోతు వరకు తవ్వకాలు జరపవచ్చు. చెరువు కట్టలకు 100 అడుగుల దూరం వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. ప్రైవేట్ భూముల్లో తవ్వకాలు చేయడానికి సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. జిల్లా అధికారులు ఇకనైనా స్పందించి మట్టితరలింపును అడ్డుకోవాలని పలువురు ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. -
విద్యార్థుల నమోదు పెంచాలి
హనుమకొండ డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుదలకు కృషిచేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. గురువారం జిల్లాలోని వివిధ ఉపాధ్యాయసంఘాల బాధ్యులతో తన కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవి సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. అక్కడక్కడా కొందరు టీచర్లు ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు తిరుగుతున్నారన్నారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రయత్నించేలా ఉపాధ్యాయుల సంఘాలుగా సహకారం అందించాలన్నారు. జిల్లాలోని 41 పాఠశాలల్లో విద్యార్థులు అసలే లేరన్నారు. వీటిలో విద్యార్థులను చేర్పించుకునేలా కృషిచేయాలన్నారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో ఐదు, ఏడో తరగతి పూర్తిచేసిన విద్యార్థులను సమీప ఉన్నతపాఠశాలల్లో చేర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గల పిల్లలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డి నేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ మహేశ్, జెండర్ ఈక్విటీ కో–ఆర్డినేటర్ సునీత, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. -
పోస్టుమార్టం అంతా గోప్యం!
ఎంజీఎం/మామునూరు: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పేరూరు–లంకపల్లి అడవుల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్ కమాండర్లు మందుపాతర పేలి చనిపోయారని పోలీసులు ప్రకటించారు. వారి మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువచ్చారు. అక్కడినుంచి మామునూరు ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ముగ్గురు తహసీల్దార్లు, గ్రేహౌండ్స్ అధికారులు నాలుగు గంటలపాటు రహస్యంగా పోస్టుమార్టం చేయించారు. కనీసం మార్చురీ వద్ద మృతి చెందిన పోలీసుల పేర్లు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీఫెన్ రవీంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నక్సలైట్ల దాడిలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండర్లు వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కళ్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు సాయంత్రం మీడియాకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మృతదేహాలను చాపల్లో చుట్టి ప్రత్యేక బందోబస్తు నడుమ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. అక్కడ కమాండర్ల మృతదేహాలకు రాష్ట్రమంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సీపీ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ నివాళులర్పించారు. కాగా, ముగ్గురు జవాన్లలో ఇద్దరు హైదరాబాద్, మరొకరు కామారెడ్డికి ప్రాంతానికి చెందిన వారు. బుల్లెట్ గాయాలతోనే మృతి.. బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ల్యాండ్‌మైన్ పేలడంతోనే జవాన్లు చనిపోయి ఉంటే మృతదేహాలు చెల్లాచెదురయ్యేవి. కాగా, ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతో వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్‌ను అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్చురీ వద్ద కనిపించని కుటుంబ సభ్యులు.. సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ, పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు ముగ్గురు జవాన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోస్టుమార్టం వద్దకు రానివ్వకుండా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. ఎంజీఎం మార్చురీ వద్ద కమాండర్ల పేర్లు వెల్లడించని అధికారులు డీజీపీ వచ్చాక సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల ప్రత్యేక బందోబస్తుతో హెడ్‌క్వార్టర్స్‌కు మృతదేహాల తరలింపు -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
సీపీ సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు ఇబ్బంది పడేలా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.. మందుబాబులను హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాల ముందు, రోడ్డుపై మద్యం సేవిస్తుండడంతో వచ్చిపోయే ప్రజలు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్న తీరుపై ఈ నెల 4వ తేదీన సాక్షిలో ప్రత్యేక విజిట్ కథనం ప్రచురితమైంది. దీంతోపాటు పోలీసులకు పలు ఫిర్యాదులు రావడంలో సీపీ స్పందించారు. బహిరంగ మద్యపానంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పగలు, రాత్రి సమయాల్లో మద్యం దుకాణం పరిసరాలతోపాటు నిర్మానుష్య ప్రదేశాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు నిర్మాణంలో ఉన్న భవనాలు, మనుషులు నివాసం లేని పురాతన భవనాల్లో తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. దీనిలో భాగంగానే బుధవారం రాత్రి కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 221 మంది మందుబాబులను అదుపులోకి తీసుకొని వారిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా జనగామ డివిజన్ పరిధిలో 57 కేసులు నమోదు కాగా, హనుమకొండ డివిజన్ పరిధిలో 42 , ఘన్పూర్ 40, కాజీపేట 24, వర్ధన్నపేట 24, నర్సంపేట 24, వరంగల్ 10 కేసులు నమోదైనట్లు వివరించారు. మద్యం దుకాణాల పరిసరాల్లో ఎవరూ బహిరంగంగా మద్యం సేవించకుండా దుకాణ యజమానులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. పెగడపల్లి డబ్బాల్ జంక్షన్ వద్ద.. నయీంనగర్: గురువారం రాత్రి పెగడపల్లి డబ్బాల్ జంక్షన్ వద్ద ఉన్న వైన్స్ పక్కనే ఉన్న ఇళ్ల ముందు కూర్చుని మద్యం సేవిస్తున్న 23 మంది మందుబాబులను హనుమకొండ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ మద్యం సేవిస్తూ మహిళలకు, యువతులకు, పాదచారులకు, చుట్టు పక్క ఇళ్ల వారికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సొంత విత్తనాలే శ్రేయస్కరం
ఖిలా వరంగల్: ఏడాదంత శ్రమించినా.. పంట దిగుబడి లేకుంటే రైతుల కష్టం వృథా అవుతుంది. పంట దిగుబడి తగ్గడానికి ప్రకృతి వైపరీత్యాలు ఒక కారణమైతే.. మరో ప్రధాన కారణం విత్తనాల ఎంపిక. విత్తనాల వల్ల ఎందరో రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో గత ఏడాది మిరప, పత్తి అంతకుముందు వరి రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. పూత, కాత దిగుబడి రాకపోవంతో అనేకమంది రైతులు ఆర్ధికంగా నష్టపోయారు. ఈనేపథ్యంలో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు గత రెండు ఏళ్ల నుంచి రైతులు సొంతంగా విత్తనాలను తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కల్తీల బెడద, కొనుగోలు భారం తగ్గించుకునేందుకు ఇంకొందరు మేలైన విత్తనాలను సేకరించుకుంటున్నారు. ఖరీదైన విత్తనాలు కొనుగోలు చేసినప్పుటికీ పంట ఏపుగా పెరుగుతుందే తప్ప దిగుబడి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని గత ఏడాది నష్టపోయిన రైతులు చెబుతున్నారు. నకిలీవిత్తనాలతో మిరప, మొక్కజొన్న, పత్తి సాగు చేసి కంపెనీల చుట్టూ పరిహారం కోసం తిరిగినా, గిట్టుబాటు అవడం లేదని వాపోతున్నారు. ఆకర్షనీయంగా సంచులతో విత్తనాలు నింపి ప్రత్యేక ఆఫర్ల పేరిట వ్యాపారులు రైతులకు ఎర చూపి అంటకడుతున్నారు. నష్టపోయిన రైతులను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. విసిగివేసారిన రైతులు కొందరు గత ఏడాది పండించిన పంటలో కొంత భాగాన్ని వేరుగా చేసి నాణ్యమైన విత్తనాలను తయారు చేసుకుంటున్నారు. దీని వల్ల ఆర్ధిక భారం తగ్గడంతోపాటు కల్తీల బెడద తగ్గనుంది. నకిలీల బారిన పడకుండా రైతుల ముందుచూపు ప్రతి ఏడాది విత్తనాల కొనుగోలుతో ఆర్థిక భారంజాగ్రత్తలు పాటించాలి..విత్తన షాపుల్లో మేలైన విత్తనాలుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగితే మొత్తం పరిహారం రైతు ఖాతాలో జమయ్యేలా చూడాలి. మార్కెట్లో లభ్యమయ్యే విత్తనాలు కొనకుండా సొంతంగా విత్తనాలు తయారు చేసుకోవడం మేలు. ప్రతి ఏడాది సొంత విత్తనాల ఉపయోగించి మేలైన దిగుబడిని సాధిస్తున్నా. – పులి అశోక్, రైతు సూరిపెల్లి ధాన్యాన్ని దాచి ఉంచాను.. గత ఏడాది వరకు విత్తనాలను కొనుగోలు చేశా. ఒక్కోసారి దిగుబడిలో తేడా వచ్చి పెట్టుబడి కూడా రాలేదు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టే మిరప పంటలో విత్తనాల ఎంపిక కీలకమైంది. లేకుంటే నష్టాలు తప్పవు. ఈ ఏడాది మేలైన వరి ధాన్యాన్ని దాచి ఉంచా. వాటితోనే సాగు చేసి అధిక దిగుబడి సాధించేందుకు ప్రయత్నిస్తా. – జగపతి బాబు, రైతు, రాంగోపాల్‌పురం, వరంగల్ -
తెలుగు భాషా వికాసాన్ని అడ్డుకోవడం సరికాదు
హన్మకొండ కల్చరల్ : తెలుగు భాషా వికాసాన్ని అడ్డుకోవడం సరికాదని కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో రెండవ ఆప్షన్‌గా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ జారీచేసిన జీవోను వ్యతిరేకిస్తూ బుధవారం హనుమకొండ పింజర్లరోడ్లోని రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయంలో తెలుగుభాషా పరిరక్షణకు నిర్వహించిన చర్చా గోష్టిలో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, కవులు, రచయితలు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగు భాషను పాలకులు నిర్లక్ష్యం చేయడం విచారకరమైన విషయమని అంశపశయ్య నవీన్ అన్నారు. మాతృభాషను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని పొట్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కార్యక్రమంలో గిరిజామనోహరబాబు, నాగిళ్ల రామశాస్త్రి, బిల్ల మహేందర్, పి, చందు, వీఆర్ విద్యార్థి తదితరులు పాల్గొన్నారు. కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య -
ఏసుక్రీస్తు అందరికీ దేవుడు
● దైవజనుడు పాల్సన్రాజ్ ● ముగిసిన క్రీస్తు జ్యోతి ప్రార్థన పండుగలుధర్మసాగర్: సర్వమానవాళి కోసం భూలోకానికి వచ్చిన ఏసుక్రీస్తు ప్రజలందరికీ దేవుడని కరుణా పురం సొసైటీ ఆప్ క్రైస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్రాజ్ అన్నారు. ధర్మసాగర్ మండలం కరుణాపురంలో క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో 20వ క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం వార్షికోత్సవ ఐదు రోజుల ప్రార్థన పండుగలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో పాల్సన్రాజ్ మాట్లాడుతూ.. 2006లో ప్రారంభమైన క్రీస్తుజ్యోతి ప్రార్థన పండుగలు ప్రతి ఏటా కన్నుల పండువగా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. సొసైటీ జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాశ్ మాట్లాడుతూ క్రీస్తు జ్యోతి ప్రార్థన పండుగలకు వివిఽ ద రాష్ట్రాల నుంచి 5 రోజుల్లో లక్షకు పైగా తరలివచ్చి దీవెనలు పొందారని తెలిపారు. మందిరం పాస్టర్లు, సేవకులు, వలంటీర్స్, బ్రదర్స్, సిస్టర్స్, క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు. -
అమ్మవారికి భద్రపీఠసేవ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీభద్రకాళి దేవాలయంలో అమ్మవారికి ఉదయం భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవలతో పాటు డోలోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శ్రీకుడాశ్రీ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నాయిని అమరేందర్‌రెడ్డి, నాయిని లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సారయ్య అమ్మవారి ఉత్సవమూర్తికి బంగారంతో చేయించిన వడ్డానాన్ని బహుకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. హాస్టళ్లకు జాయింట్ డైరెక్టర్ల నియామకంకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని రెండు హాస్టళ్లకు జాయింట్ డైరెక్టర్లను నియమించినట్లు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం తెలిపా రు. టూరిజం మేనేజ్మెంట్ పార్ట్‌టైం లెక్చరర్ డా క్టర్ కె.నాగేశ్వర్రావును గణపతిదేవ హాస్టల్–2, 3 బ్లాక్‌లకు, టూరిజం మేనేజ్మెంట్ పార్ట్‌టైం లెక్చరర్ డాక్టర్ ఎం.కృష్ణసుమంత్ను డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ హాస్టల్‌కు నియమించారు. ఈమేరకు వీరికి వీ సీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య ఎల్పీ.రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఇంటర్లో అడ్మిషన్లు పెంచేందుకు కెరియర్ క్యాంపులున్యూశాయంపేట: ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పెంచేందుకు కెరియర్ క్యాంపులు నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడతూ.. గత విద్యాసంవత్సరంలో జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో ఏయే కళాశాలలో తక్కువ శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందుకు గల కారణాలు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని సూచించారు. ఇంటర్‌బోర్డు నియమ నిబంధన మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు ఫైర్ సేప్టీ తదితర సర్టిఫికెట్టు తప్పనిసరిగా పొందాలన్నారు. మూడు లే–ఔట్లకు అనుమతులున్యూశాయంపేట: మూడు లే–ఔట్ అనుమతులు జారీ చేస్తూ లేఔట్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన లేఔట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో జీడబ్ల్యూఎంసీ పరిధిలో మూడు లేఔట్ అనుమతుల కోసం ప్రతిపాదన రాగా.. వాటిని కమిటీ నిబంధనలు అనుసరించి పరిశీలించి, సమావేశంలో చర్చించి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీటీసీపీ జ్యోతి, సిటీ ప్లానర్ రవీందర్, జిల్లా పంచాయతీ రా జ్ అధికారి ఇజ్జగిరి పాల్గొన్నారు. -
కుంభకోణాల కాంగ్రెస్
హన్మకొండ: నిధులు, ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే కాంగ్రెస్ నాయకులు కుంభకోణాలకు, అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని శాఖల్లో అవినీతికి పాల్పడుతున్నారని, చివరకు రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలనూ వదలడం లేదని దుయ్యబట్టారు. వీరి చేష్టలతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను దోపిడీ చేయడమే ఆదాయ మార్గంగా ఎంచుకున్న కాంగ్రెస్ మొన్న ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్లు, నిన్న పత్తి కొనుగోళ్లలో రూ.3వేల కోట్లు, నేడు రైతుల పంట కొనుగోలు కేంద్రాల్లో వినియోగించే తేమ శాతం కొలిచే యంత్రం, వేయింగ్ మిషన్, గ్రేడింగ్ మిషన్, టార్పాలిన్ షీట్ల టెండర్ల నిర్వహణలో టీజీ ఆగ్రోస్ దోపిడీకి పాల్పడిందని అన్నారు. తెలంగాణ ఆగ్రోస్ నిర్వహించిన టెంటర్ల తేదీని చెర్మన్ అనుయాయుల కోసం మార్చడమే కాకుండా సమయం దాటిపోయిన తర్వాత సీల్ వేసిన బాక్స్‌లు ఓపెన్ చేసి టెండర్లు వేయించారని, దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో బీఆర్ఎస్ వద్ద ఉన్నాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు 25 ఎక్సెస్‌తో సమయం దాటిన తర్వాత టెండర్ దాఖలు చేశారని, దీనిపై ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు నయీముద్దీన్, బండి రజనీకుమార్, శరత్‌శ్చంద్ర, చాగంటి రమేష్ పాల్గొన్నారు. అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది మంత్రుల గాలి మాటలు.. చేతి వాటం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి -
ప్రతీ పేదవాడికి అండగా ఉంటాం
వాజేడు/వెంకటాపురం(కె) : ప్రతీ పేదవాడికి అండగా నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వాజేడు, వెంకటాపురం(కె) ఏజెన్సీ మండలాల్లో ఆయన బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటాపురం(కె) మండల కేంద్రంలోని ఇంజనీరింగ్ సబ్ డివిజన్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన, పాత్రాపురం గ్రామంలో రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దున ఉన్న టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పైలట్ ప్రాజెక్టులో భాగంగా పలు ఇళ్లకు భూమిపూజ చేశారు. వాజేడు మండల కేంద్రంలోని నాగారం గ్రామం నుంచి పాయబాటలు గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఏడ్జెర్లపల్లి నుంచి బొమ్మనపల్లి వరకు రూ.3 కోట్లతో నిర్మించే బీటీ పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఎంపీడీఓ భవనానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన బర్త్ వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. పది నెలల కాలంలోనే 57, 662 ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. భూభారతి చట్టం పేదరైతులకు చుట్టంగా మారిందని అన్నారు. రాజీవ్ యువవికాసం పథకంలో జూన్ 2న రూ.6వేల కోట్లు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడిన అనంతరం నూతన పథకాలు అమలు చేస్తామన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మారుమూల టేకులగూడెం నుంచే అన్ని సంక్షేమ పథకాలను ప్రవేశ పెడతామన్నారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్ భార్య రాంబాయి, కూలి పనులను చేసుకునే ఉయిక అర్జున్ భార్య సావిత్రి మంత్రి పొంగులేటి శ్రీనువాస్రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అందలేదని చెప్పారు. స్పందించిన ఆయన త్వరలోనే వచ్చేలా చూస్తానని తెలిపారు. ఈ సందర్భంగా టేకులగూడెం వద్ద రైతులు మంత్రిని సన్మానించి నాగలిని బహూకరించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్పీ శబరీష్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, వెంకటాపురం(కె) సీఐ కుమార్ ఆధ్వర్యంలో టేకులగూడెం వరకు రహదారి వెంట పోలీసు బలగాలు భద్రతగా ఉన్నాయి. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, ఎస్పీ శబరీశ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ, ఆర్డీఓ వెంకటేష్, ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏజెన్సీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
ఆశించినమేర పనులు జరగలేదు..
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల ఏర్పాట్లలో ఆశించిన మేర పనులు జరగడం లేదని, మూడు షిప్టుల్లో పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు అన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, అధికారులతో కలిసి సరస్వతీనది పుష్కరాల ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. వీఐపీ ఘాట్ విస్తరణ, గోదావరి ఘాట్లు, టెంట్‌సిటీ, గోదావరి హారతి ప్రాంతం, పుష్కర స్నానాల ప్రాంతం, 86గదుల గెస్ట్‌హౌస్, హెలిపాడ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్లకు పలుసూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి విధులు కేటాయించాలన్నారు. మొట్టమొదటి సారి గా జాయ్‌రైడ్, టెంట్‌సిటీ ఏర్పాటు చేస్తున్నారని కలెక్టర్‌ను అభినందించారు. సివిల్ పనులు చాలా పెండింగ్ ఉన్నాయని, లోపాలు రావొద్దని తెలిపారు. రానున్న వారం రోజులు చాలా ముఖ్యమని, 24/7 పనులు జరగాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ పనులు నత్తనడకన జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో మంత్రి వస్తున్నారని, రూపురేఖలు మారాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. షవర్ పనులు పెండింగ్ ఉన్నాయని, గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. మరుగుదొడ్ల పనుల్లో వేగం పెంచాలన్నారు. ఫుడ్ కోర్టు, స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వీఐపీ ఘాట్ రోడ్డు బారికేడింగ్ చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు ఏర్పాటు చేయాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. పుష్కరాలు పూర్తి అయ్యే వరకు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులకు అనుమతి లేదని తెలిపారు. ప్రతి రోజు 5వేల మందికి ఉచిత అన్నదానం చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. 15న సీఎం వస్తున్నారని, సరస్వతీమాత విగ్రహం ప్రారంభో త్సవం, పుష్కర స్నానం, దర్శనం, హారతి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 5 సెక్టార్లు, 18 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 12వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు వీక్షించేలా పట్టణంలోని ప్రధాన కూడళ్లులో ఎల్ఈడీ స్క్రీ న్స్ ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ.. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావే శంలో మంత్రులు దిశానిర్దేశం చేశారని తెలిపారు. అన్నిశాఖలు సమన్వయంతో పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయశాఖ ఆర్జేసి రామకృష్ణారావు, ఈఓ మహేష్, అడిషనల్ ఎస్పీ కిషన్ పాల్గొన్నారు.టెంట్‌సిటీ పనులు ప్రారంభం పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టెంట్‌సిటీ ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం రూ.50లక్షల వ్యయంతో హైదరాబాద్‌కు చెందిన ఆలిఎలిమెంట్ అనే ప్రైవేట్ సంస్థ టెంట్‌సిటీ పనులను ప్రారంభించింది. టెంట్‌సిటీ వీఐపీ(సరస్వతి)ఘాట్ సమీపంలో 30 టెంట్సిటీలు నిర్మిస్తున్నారు. 12 రోజులపాటు భక్తులు బస చేయడానికి వేసవి దృష్ట్యా ఏసీలు టాయిలెట్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక రోజుకు రూ.3వేల అద్దె తీసుకోనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన మూడు షిప్టుల్లో పనులు చేయాలని సూచనపనులను పరిశీలిస్తున్న దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్, ఎస్పీఇంటెలిజెన్స్ ఎస్పీ పరిశీలన కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఎస్పీ భాస్కరన్ బుధవారం ఆయన వీఐపీ, సాధారణ ఘాట్, పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్లు, ఆలయం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం కాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనను సన్మానించి, తీర్ధప్రసాదం అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నడికూడ: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిగిల్ల గ్రామానికి చెందిన మోకిడి దీపక్ (30)హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ప నిచేస్తున్నాడు. బుధవారం ఉ దయం తన బైక్‌పై ప్ర యాణిస్తుండగా వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలివరంగల్ క్రైం: ప్రతిభ ఉన్న పిల్లలను తల్లిదండ్రులు పోత్సహించి, వారి అభ్యున్నతికి కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన హసన్‌పర్తి సబ్ ఇన్స్పెక్టర్ దామెరుప్పుల దేవేందర్ కుమారుడు దామెరుప్పుల అక్షిత్‌ను సీపీ అభినందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన వేర్ ద మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్ రచనను అక్షిత్ తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో మూడు నిమిషాల్లో అనర్గళంగా చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా అక్షిత్‌తో పాటు ఎస్సై దేవేందర్, ఆయన సతీమణి స్వప్న, మెంటార్ కోమనేని రఘును సీపీ అభినందించారు. -
కేయూ స్పోర్ట్స్‌బోర్డులో అవకతవకలు
● వీసీ, రిజిస్ట్రార్లకు వినతిపత్రాలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డులో అవకతవకలకు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కేయూ ఫిజికల్ ఎడ్యూకేషన్ కళాశాలకు చెందిన నలుగురు పరిశోధకులు మహ్మద్ పాషా, పల్లవి, బుచ్చయ్య, అవినాష్ బుధవారం వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రానికి వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ, ఓ కాంట్రాక్టు సీనియర్ అసిస్టెంట్ కలిసి ఇష్టానుసారంగా స్పోర్ట్స్ బోర్డు పరిధిలోని పీడీలకు సంబంధంలేకుండా పలు క్రీడల టీమ్‌లకు ఓ వ్యక్తిని కోచ్ కమ్ మేనేజర్‌గా పంపారని ఆరోపించారు. 2022 నుంచి 2025 అకాడమిక్ ఇయర్ వరకు స్పోర్ట్స్ బోర్డు టీం లిస్టులు, పీడీల పేర్లు వారికి వినియోగించిన నిధులు సెటిల్మెంట్స్ బిల్సుపై కమిటీవేసి విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని కోరారు. స్పోర్ట్స్ బోర్డు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన వీసీ ప్రతాప్‌రెడ్డి.. స్పోర్ట్స్ బోర్డుపై కమిటీతో విచారణ చేపడతామని హామీ ఇచ్చారని ఫిజికల్ ఎడ్యూకేషన్ కాలేజీ పరిశోధకుడు మహ్మద్‌పాషా తెలిపారు. -
దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా..
● శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హన్మకొండ కల్చరల్ : విశ్వాబ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజల అభ్యున్నతికి, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హామీ ఇచ్చారు. బుధవారం హనుమకొండ భద్రకాళి రోడ్‌లోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం శ్రీగాయత్రిమాత, శివాలయంలో ఉదయం 6గంటల నుంచి సుప్రభాత సేవలు నిర్వహించారు. అనంతరం అర్చకులు గుటోజు కేదారీశ్వరాచారి బ్రహ్మంగారి మూలమూర్తికి పంచామృతాభిషేకం, మేలుకొలుపు, పూజలు చేశారు. తర్వాత దేవాలయంలో వివిధ పుష్పాలతో వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఆవాహన, గణపతిపూజ, నవగ్రహపూజ, మంటపారాధన, ఆరాధనపూజ నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు మారేడోజు సదానందాచారి, కార్యదర్శి జల్లిపెల్లి పెంటయ్యచారి అధ్యక్షతన జరిగిన పూజ కార్యక్రమంలో బండా ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనసూరి చంద్రమౌళి, వేల్పుల దేవాచారి, పెందోట చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
క్యాడ్, క్యామ్ ల్యాబ్ ఎంతో ఉపయోగకరం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సి టీలోని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్(క్యాడ్) అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫ్యాక్చరింగ్(క్యామ్) ల్యాబ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. ల్యాబ్‌ను బుధవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక డిజైన్ ప్లానింగ్‌తో ఏర్పాటుచేసి ల్యాబ్ మెకానికల్ ఇంజనీరింగ్‌తో పాటు బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ మాట్లాడుతూ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ రెండు విడతల్లో అందించిన కంప్యూటర్లతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు మనిషా, సాబూ, పద్మజ, రమణి, ముత్యం వంశీలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.రాధిక, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.నేతాజీ, లైబ్రరీ అసిస్టెంట్ డాక్టర్ ఎస్.సుజాత పాల్గొన్నారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి -
గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025
● ఈనెల 14న రెండు బృందాలుగా 57 మంది రాక ● రామప్ప, వరంగల్కోట, వేయిస్తంభాల ఆలయం సందర్శన ● అప్రమత్తమైన అధికార యంత్రాంగం ● అదనపు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ● హైదరాబాద్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం సీసీ కెమెరాల నిఘా.. నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసుశాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 49వేల వరకు ఉన్నాయి. ‘స్మార్ట్‌సిటీ’ నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 750 సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్నారు. అయితే సుందరీమణుల పర్యటన నేపథ్యంలో హరిత కాకతీయ, వరంగల్ కోట, వేయిస్తంభాల ఆలయంతో పాటు కీలక ప్రదేశాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రామప్ప ఆలయ ప్రాంగణం, బయట సుమారు 50నుంచి 70 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించే వీలుగా అనుసంధానం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో ఓరుగల్లులో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, పర్యాటక తదితర శాఖల ఆధ్వర్యాన పర్యాటక ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రధానంగా ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సుందరీమణులకు మూడంచెల పోలీసు భద్రతతో పాటు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ ట్రైసిటీతో పాటు రామప్పలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను వారి పర్యటన ముగిసే వరకు హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) నుంచి కూడా పర్యవేక్షించేలా అనుసంధానం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం నుంచి ఆ దిశగా పనులు ఊపందుకున్నాయి. హైదరాబాద్ నుంచి రామప్ప, ఓరుగల్లుకు.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే మిస్‌వరల్డ్–2025 పోటీలకు 144 దేశాల నుంచి సుందరీమణులు చేరుకుంటున్న విషయం తెలిసిందే. అందులో 57 మంది రెండు బృందాలుగా ఈనెల 14వ తేదీన రామప్ప, వరంగల్‌లోని వేయిస్తంభాల దేవాలయం, వరంగల్ కోటను సందర్శించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 35 మందితో కూడిన ఓ బృందం హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రామప్పకు వెళ్తుంది. 22 మంది సభ్యుల మరో బృందం అదే సమయానికి బయలుదేరి వరంగల్ హరిత కాకతీయకు చేరుకుంటుంది. వీరికి స్వాగతం పలకడం.. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలను చూపించడం.. కాకతీయ రాజుల పరిపాలన, కళాసంపద, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా దేశాలకు చెందిన సుందరీమణులు నచ్చే, మెచ్చే వంటకాలను కూడా ప్రభుత్వం తరఫున సిద్ధం చేస్తున్నారు. అలాగే హనుమకొండ హరిత కాకతీయకు చేరుకునే 22 మంది సుందరీమణులు, వారి వెంట వచ్చే మరో ఇద్దరు మహిళల కోసం రూమ్‌లు కేటాయించారు. వీరికి మూడంచెల భద్రతలో భాగంగా ఒక్క హరిత కాకతీయ హోటల్ ప్రాంగణంలో సుమారు ఐదువందల మందికి పైగా భద్రతా సిబ్బందిని కేటాయించనున్నట్లు చెబుతున్నారు. వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్పలోనూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. భద్రతపై అధికారుల సమీక్షలు మిస్ వరల్డ్–2025 పోటీలకు వచ్చే సుందరీమణుల ఓరుగల్లు పర్యటన నేపథ్యంలో వారి భద్రత విషయమై అధికారులు రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, హనుమకొండ, వరంగల్, ములుగు కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, దివాకర, వివిధ శాఖల ఉన్నతాధికారులు పలుమార్లు భేటీ అయ్యారు. ఇదే సమయంలో మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘాపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.వరంగల్ కోటలో పరిశీలిస్తున్న కలెక్టర్(ఫైల్)న్యూస్‌రీల్ -
ఈదురు గాలులతో ఎన్పీడీసీఎల్కు నష్టం
హన్మకొండ: ఈదురు గాలులకు టీజీ ఎన్పీడీసీఎల్కు భారీ నష్టం వాటిల్లింది. ఈనెల 5న రాత్రి వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. దీంతో హనుమకొండ జిల్లాలో రూ.25 లక్షలు, వరంగల్ జిల్లాలో 22.79 లక్షల నష్టం జరిగింది. హనుమకొండ జిల్లాలో 97 స్తంభాలు విరిగిపోయాయి. మూడు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లాలో 293 స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ లైన్లు 4.28 కిలో మీటర్లు దెబ్బతింది. ఆరు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సమస్య తలెత్తిన సమయం నుంచి పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండి పునరుద్ధరణ పనులు పూర్తి చేశారన్నారు. మరమ్మతు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా అందించినట్లు హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్‌రావు, వరంగల్ ఎస్ఈ కె.గౌతం రెడ్డి తెలిపారు. విద్యుత్ సామగ్రి సరిపడా అందుబాటులో ఉందని, విద్యుత్ సిబ్బంది 24/7 క్షేత్రస్థాయిలో ఉంటున్నారన్నారు. అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ విద్యుత్ సరఫరాను మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే పున్నరుద్ధరించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, అర్ధరాత్రి సైతం లెక్కచేయకుండా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారని అభినందించారు. వినియోగదారులు విద్యుత్‌పై జాగ్రత్త వహించాలని, విద్యుత్ స్తంభాలు, ఇంట్లోని స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకోవద్దన్నారు. స్వీయ నియంత్రణ ముఖ్యమని ఎట్టి పరిస్థితుల్లో స్వయంగా విద్యుత్ మరమ్మతులు చేప్పట్టవద్దని కోరారు. విద్యుత్ అంతరాయం, ఇతర సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912, 180042 50028కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రూ.47.79 లక్షలు నష్టం -
ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తిచేయాలి
హన్మకొండ కల్చరల్: ఓరుగల్లులో ఈనెల 14న ప్రపంచ సుందరీమణులు పర్యటించనున్న నేపథ్యంలో పురావస్తుశాఖ, టూరిజం అధికారులు, జిల్లా యంత్రాంగం సమస్వయంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ పర్యవేక్షకులు నిఖిల్‌దాస్ ఆదేశించారు. సుందరీమణులు వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించనున్నందున బుధవారం రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు దేవాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిఖిల్‌దాస్ మాట్లాడుతూ.. కాకతీయుల చరిత్ర, మన సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. దేవాలయం చుట్టూ గార్డెన్, సెంట్ర ల్ లైటింగ్, డ్రెయినేజీ సిస్టం, కల్యాణ మండపం పునరుద్ధరణకు సంబంధించి మిగిలి ఉన్న పనుల ను పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ హెచ్ఆర్.దేశాయ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రోహిణి, అసిస్టెంట్ ఇంజనీర్లు కృష్ణచైతన్య, కిశోర్‌రెడ్డి, కన్జర్వేషన్ అసిస్టెంట్ నవీన్‌కుమార్, గోల్గొండ కన్జర్వేషన్ అసిస్టెంట్ మల్లేశం, ఈఓ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. వేయిస్తంభాల ఆలయ పరిసరాలను బుధవారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి పరిశీలించారు. ఆలయ పరిసరాలను, పార్కింగ్, పారి శుద్ధ్య నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ నిఖిల్‌దాస్ వేయిస్తంభాల దేవాలయాన్ని పరిశీలించిన అధికారులు -
అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలి
హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేసే విషయంలో పారదర్శకత పాటించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతం అన్నారు. బుధవారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల డేటా వెరిఫికేషన్ క్షేత్ర స్థాయిలో నిబంధనల ప్రకారం సరిచూశాకే నియోజకవర్గ నోడల్ అధికారి ద్వారా జాబితాను కలెక్టర్ లాగిన్‌కు పంపాలన్నారు. పైలట్ గ్రామాల్లో ఇప్పటి వరకు ఇండ్లు ప్రారంభం కాని వారి స్థానంలో ఇతర గ్రామానికి చెందిన వారిని ఎంపిక చేస్తామన్నారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించిన ఏఈలు ప్రస్తుతం గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, ఆ తర్వాత నగరంలో చేపట్టే నిర్మాణాలను పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. అంతకు ముందు గ్రేటర్ వరంగల్ పరిధిలోని సోమిడి, వడ్డేపల్లి, దేశాయిపేట ప్రాంతాల్లో వెరిఫికేషన్ అధికారులు నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎండీ గౌతమ్, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడేతో కలసి పరిశీలించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్, జిల్లా నోడల్ అధికారులు రామిరెడ్డి, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధించిన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రానున్న రోజుల్లో ఎంత ధాన్యం వస్తుందో అంచనా వేసి కొనుగోలు పూర్తయిన వెంటనే కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం తరలింపులో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ వై.వి.గణేష్, డీఆర్డీఓ మేన శ్రీను, డీసీఎస్ఓ కొమురయ్య, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, డీఏఓ రవీందర్ సింగ్, సహకార అధికారి సంజీవరెడ్డి, మార్కెటింగ్ అధికారి అనురాధ, డీపీఎం ప్రకాష్ పాల్గొన్నారు. జిల్లా పేరు నిలబెట్టాలి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు నివారణ మందుల అమ్మకాల్లో వరంగల్ జిల్లాకు మంచి పేరు ఉందని, దీనిని ఇలాగే కొనసాగించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సీడ్, ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ డీలర్స్, వివిధ కంపెనీ ప్రతినిధులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చుట్టుపక్కల జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి విత్తన, ఎరువులు, పురుగు మందులు తీసుకెళ్తుంటారని, డీలర్లు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. దుకాణాల ద్వారా చేపట్టే క్రయవిక్రయాలకు సంబంధించి రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు చూపించాల్సి ఉంటుందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల విక్రయాలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించి నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, డీఏఓ రవీందర్ సింగ్, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, సతీష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య -
‘దంతం’.. అందని వైద్యం
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఇన్‌చార్జ్‌ల పాలన రోగులకు శాపంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు దంత వైద్యం కోసం ప్రభుత్వ పరంగా ఎంజీఎం ఆస్పత్రి పెద్ద దిక్కు. రోజూ వందలాది మంది దంత సమస్యలతో చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. ఇంత పెద్ద డెంటల్ వైద్య విభాగాన్ని నిత్యం పర్యవేక్షించాల్సిన హెచ్ఓడీని డిప్యూటేషన్‌పై హెల్త్ యూనివర్సిటీకి పంపించడంతో విభాగం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సదరు హెచ్ఓడీ డిప్యూటేషన్ ఏళ్ల తరబడి కొనసాగుతుండడంతో సమస్యలు పరిష్కారం కావడంలేదు. ప్రస్తుతం దంత వైద్య విభాగం మూలన పడే పరిస్థితి నెలకొంది. రోజూ ఆస్పత్రికి వంద మందికిగా పైగా డెంటల్ సమస్యలతో వచ్చే రోగులకు ఒకే అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్యం అందించాల్సిన పరిస్థి తి నెలకొంది. పళ్లు తొలగించడం, చికిత్స చేయడం తదితర వైద్యసేవలు భారంగా మారాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగుల గంట తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనా సందర్భంలో ఆ డాక్టర్ సెలవుపై వెళ్తే దంత వైద్య విభాగం సేవలు నిలిచిపోయినట్టే. నోటిఫికేషన్‌తో సరి.. ఎంజీఎం ఆస్పత్రి దంత వైద్యవిభాగంలో వైద్యుల కొరత తీర్చడానికి కలెక్టర్ ఆదేశాలతో పరిపాలనాధికారులు రెండు పోస్టులకు ఈ ఏడాది మార్చి 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. 22 నుంచి 24వ తేదీ వరకు ఆసక్తి ఉన్న దంత వైద్య అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. వారం రోజుల్లోగా మెరిట్ జాబితా తయారు చేసిన అధికారులు ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసి 30 రోజులు గడస్తున్నా నియామకం చేపట్టడం లేదు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అధికారులు ముందుకు సాగుతూ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎంజీఎం ఆస్పత్రిలోని డెంటల్ విభాగాన్ని డాక్టర్ల కొరత వెంటాడుతోంది. ఇంత పెద్ద ఆస్పత్రికి ఉన్నది ఇద్దరు వైద్యులు. అందులో ఒకరు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఉన్నది ఒకే డాక్టర్. కాంట్రాక్టు పద్ధతిన దంత వైద్యుల నియామకానికి మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసినా నేటికీ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఏదైనా కారణం చేత ఆ ఒక్క డాక్టర్ రాకుంటే ఇక ఆ విభాగానికి సెలవే. దీంతో పంటి సమస్యలతో వచ్చిన రోగులు చుక్కలు చూడాల్సిందే. ఎంజీఎంకు డెంటల్ డాక్టర్ల కొరత నోటిఫికేషన్ ఇచ్చారు.. నియామకం మరిచారు ఇద్దరు వైద్యుల్లో ఒకరు డిప్యూటేషన్‌లో.. రోగులకు ఒకే అసిస్టెంట్ ప్రొఫెసర్ దిక్కు ఆస్పత్రికి వచ్చే రోగులకు తప్పని పాట్లు -
శ్వేతార్కుడిని దర్శించుకున్న న్యాయమూర్తి
కాజీపేట: కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి దివ్య క్షేత్రాన్ని తెలంగాణ లోకాయుక్త న్యాయమూర్తి బీఎస్ జగ్ జీవన్‌కుమార్ దంపతులు బుధవారం సందర్శించారు. ఆలయ ఆవరణలో కొలువుదీరిన శ్వేతార్కుడితో పాటు 29 దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంత కు ముందు ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మ వారికి స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామి వారి చిత్రపటం, శేష వస్త్రాలతో సన్మానించారు. మే 12న ఫార్మసీ ఆఫీసర్స్ ఫలితాలుఎంజీఎం: ఫార్మసీ ఆఫీసర్స్ ఫలితాలు ఈనెల 12న ప్రకటించనున్నట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూమెంట్ బోర్డు చైర్మన్ గోపికాంత్‌రెడ్డి తెలిపినట్లు తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) సెంటర్ కమిటీ అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం రిక్రూమెంట్ బోర్డు చైర్మన్‌ను కలిసిన టీజీపీఓఏ నాయకులు ఫార్మసీ ఫలితాల ప్రకటనపై చర్చించారు. దీనిపై బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సమావేశంలో టీజీపీఓఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంద కట్ల శరత్ బాబు, అడ్వైజర్ అహ్మద్ ఉల్లాఖాన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, వరంగల్ జిల్లా సెక్రటరీ అవినాష్, రాష్ట్ర కమిటీ నాయకులు జహీర్, విజయ్ కుమార్, రాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ సివిల్ జడ్జిలకు సన్మానంవరంగల్ లీగల్: ఇటీవల వెలువడిన జూని యల్ సివిల్ జడ్జి ఫలితాల్లో వరంగల్ జిల్లాకు చెందిన న్యాయవాదులు గంగిశెట్టి ప్రసీద, అంబటి ప్రణయ, దార సాయిమేఘన తొలి ప్రయత్నంలోనే ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని అంబేడ్కర్ హాల్లో వారిని వరంగల్, హనుమకొండ జిల్లా ల బార్ అసోసియేషన్లు సంయుక్తంగా సన్మానించారు. కార్యక్రమానికి అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీలు డి.రమాకాంత్, కొత్త రవి, ఇతర బాధ్యులు మైదం జయపాల్, ముసిపట్ల శ్రీధర్‌గౌడ్, రేవూరి శశిరేఖ, శివప్రసాద్, కిషోర్‌కుమార్, బైరపాక జయాకర్, సీనియర్ న్యాయవాదులు అంబరీష్ రావు, వద్దిరాజు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 17 నుంచి ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాల్గవ సెమిస్టర్(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 17 నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసిమ్ ఇక్బాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు ఉంటాయని, పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు. 20 నుంచి పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ నాన్ప్రొఫెషనల్స్ కోర్సుల రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రఽణాధికారి సౌజన్య తెలిపారు. పీజీకోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, జర్నలిజం మాస్‌కమ్యూనికేషన్, ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ, సైకాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్‌డబ్లూ, ఎంహెచ్ఆర్ఎం తదితర కోర్సుల సెకండియర్ రెండో సెమిస్టర్ల పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంటు)ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వివరించారు. -
బహిరంగ మద్యపానంపై పోలీసుల దాడులు
వరంగల్ క్రైం: నగరంలోని వైన్‌షాపుల ఎదుట బహిరంగ మద్యపానంపై పోలీసులు మంగళవారం కొరఢా ఝులిపించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వైన్‌షాపు పర్మిట్‌రూమ్‌లో కాకుండా పక్కన వీధులు, సమీప షాపులు, గృహాల ఎదుట మందుబాబులు సిట్టింగ్ వేస్తున్నారు. దీంతో అక్కడి నుంచి వెళ్లే మహిళలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వైనంపై ఈ నెల 4వ తేదీన ‘రోడ్లు, దుకాణాలే సిట్టింగ్ సెంటర్లు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన సుబేదారి పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. సుబేదారి పరిధిలోని అన్ని వైన్‌షాపుల వద్ద బహిరంగ మద్యపానం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేశారు. పర్మిట్రూంలలోనే మందుబాబులు మద్యం సేవించేలా చూడాలని వైన్‌షాపు నిర్వాహకులను హెచ్చరించారు. -
భద్రకాళి అమ్మవారికి రథసేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు, వేదపండితులు మంగళవారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి హోమం, బలిఉత్సవం జరి పారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని భద్రకాళి మహాత్రిపుర సుందరిగా అలంకరించి రథసేవ నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు హనుమకొండ నాయీబ్రాహ్మణ సంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, అతిథులుగా శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ బండారు జగదీశ్‌బాబు, గౌరవ సలహాదారులు తూముల సాంబయ్య, జీవనాఽథ్, కమిటీ సభ్యులు వాసు, రాముల రమేశ్, నరేందర్, జగన్, సురేశ్, శివ, సతీశ్, మధుసూదన్ పాల్గొన్నారు. ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఈనెలాఖరులోగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్, కిచెన్‌షెడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. డీడబ్ల్యూఓ జయంతి, డీఈఓ వాసంతి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, సీడీపీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
మాతృ మరణాలు నివారించాలి : డీఎంహెచ్ఓ
ఎంజీఎం: జిల్లాలో మాతృ మరణాలను నివారించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. 2024–2025లో సోమిడి, శాయంపేట మండలం గట్లకనపర్తిలో రెండు మాతృ మరణాలు జరిగాయి. ఈ మేరకు డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య ఇలాంటి ఘట నలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే గుర్తించిన లోపాలను ఎలా సరిదిద్దాలో వివరించారు. సమావేశంలో గైనకాలజిస్ట్లు జీఎంహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి, సీకేఎం డాక్టర్ స్వప్న, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, ఫిజీషి యన్లు డాక్టర్ ఆశాలత, డాక్టర్ నిఖిల, డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ అనిత, ఎస్ఓ ప్రసన్నకుమార్, డెమో అశోక్‌రెడ్డి, విజయలక్ష్మి, సురేఖ, సుప్రియ, ఆశవర్కర్లు పాల్గొన్నారు. కామర్స్ డీన్‌గా ప్రొఫెసర్ రాజేందర్కేయూ క్యాంపస్: కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల డీన్‌గా పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం వీసీ ప్రతాప్‌రెడ్డి..రాజేందర్‌కు ఉత్తర్వులు అందజేశారు. ఇప్పటివరకు డీన్‌గా ప్రొఫెసర్ అమరవేణి బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పదవీకాలం ముగియడంతో రాజేందర్‌ను నియమించారు. కేయూలో 2005లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయన నియమితులయ్యారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, బీఓఎస్‌గా, ఖమ్మం పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈనెల 7న డీన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాజేందర్‌రెడ్డి.. రెండు సంవత్సరాలపాటు పదవిలో ఉంటారు. కే హబ్ డైరెక్టర్‌గా సవితాజ్యోత్స్నకాకతీయ యూనివర్సిటీలోని కే హబ్ డైరెక్టర్‌గా కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ టి.సవితాజ్యోత్న్సను నియమిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు వీసీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. రూసా నోడల్ ఆఫీసర్ సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఇన్నోవేషన్హబ్ ఇన్చార్జ్ కోఆర్డినేటర్‌గా సిద్ధార్థ కే హబ్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంప్లాయ్‌బిలిటీ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఇన్చార్జ్ కోఆర్డినేటర్‌గా కేయూ ఇంజనీరింగ్ కాలేజీ (కోఎడ్యుకేషన్) కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.సిద్ధార్థ నియమితులయ్యారు. ఈ మేరకు వీసీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులను సిద్ధార్థకు అందజేశారు. హోదాకు తగని సీఎం వ్యాఖ్యలు : టీపీటీఎఫ్ విద్యారణ్యపురి: ఉద్యోగులనుద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు తన హోదాకు తగవని అవగాహనా రాహిత్యంతో అర్థరహితంగా ఉన్నాయని టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరడం సహజమని, పరిష్కరించాలి లేదంటే సానుకూలంగా స్పందించి చర్చించాలి కానీ, అసహనంతో మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడిచినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని వాపోయారు. మలిన జల శుద్ధి కేంద్రాలకు నిధులువరంగల్ అర్బన్: మలిన జల శుద్ధి కేంద్రాల అభివృద్ధికి ప్రోత్సాహక నిధులు అందజేయనున్నట్లు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీ థిల్లాన్ అన్నారు. అమృత్ 2.0లో ఎంపికై న నగరాల కమిషనర్లు, ఉన్నతాధికారులతో మంగళవారం ఆమె ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా థిల్లాన్ మాట్లాడుతూ నగరాల స్థాయి, రేటింగ్ ఆధారంగా నిధులు ఇవ్వనున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీని వాస్, ఈఈలు రవి కుమార్, సంతోష్‌బాబు, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనులు చేపట్టండి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధి కారులను ఆదేశించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న 29వ డివిజన్లో మేయర్ మంగళవారం పర్యటించారు. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రఘునాథకాలనీలో విరిగిన మూడు విద్యుత్ స్తంభాలు, చెట్టును పరిశీలించారు. వాటిని తొలగించాలని డీఆర్ఎఫ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి మేయర్ మాట్లాడారు. నాలాల్లో పూడికతీసేందుకు టెండర్లు పిలవాలని సూచించారు. రోడ్లు, డ్రెయిన్లలో ప్రజలు చెత్త వేయకుండా చూడాలని, అనుమతి లేకుండా పోతనరోడ్డులోని స్క్రాప్ దుకాణాలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీచేసి జరిమానా విధించాలని, వేంకటేశ్వరస్వామి ఆలయ పక్క వీధిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బందికి డివిజన్లో అనువుగా ఉన్న ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి అన్నపూర్ణ భోజనం ఏర్పాటు చేయాలని, సమయపాలన పాటించేలా చూడాలని సీఎంహెచ్ఓ రాజారెడ్డిని మేయర్ ఆదేశించారు. ఆమె వెంట శానిటరీ సూపర్వైజర్ భాస్కర్, ఎన్పీడీసీఎల్ ఏఈ రవీందర్, లైన్‌మన్ సాంబయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ కంటేష్ తదితరులు పాల్గొన్నారు. యూజీడీ డీపీఆర్ సిద్ధం చేయండి నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ)పై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో అధి కారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జోన్ల వారీగా సమగ్ర అధ్యయనం చేసి యూజీడీ డీపీఆర్ తయారచేయాలని సూచించారు. సమీక్షలో గ్రేటర్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్‌బాబు, మాధవీలత పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలను నియంత్రించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వరంగల్/మామునూరు: మత్తు పదార్థాలను నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. మామునూరు, ఏనుమాముల, గీసుకొండ పోలీస్స్టేషన్లను ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ తిరుపతితో కలిసి సీపీ మంగళవారం సందర్శించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిసరాలు, హాజరు రిజిస్టర్లు, పలు కేసుల ఫైళ్లను సీపీ పరిశీలించారు. స్టేషన్‌న్ల పరిధిలో సెక్టార్ల వారీగా ఎస్సైలు నిర్వర్తిస్తున్న విధులు, బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరును ఇన్స్పెక్టర్లు రమేశ్, రాఘవేందర్, మహేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు తప్పనిసరిగా రౌడీషీటర్లపై నిఘా పెట్టి వారి స్థితిగతులపై ఆరా తీయాలని అన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి కేసు నమోదు చేయడమేకాకుండా నిందితులను అరెస్టు చేయాలని సూచించారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పెట్రోలింగ్ నిర్వహించాలని సీపీ పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సైలు కృష్ణవేణి, శ్రీకాంత్, రాజు, సిబ్బంది ఉన్నారు. -
కేయూలో వర్క్‌షాప్ బ్రోచర్ ఆవిష్కరణ
కేయూ క్యాంపస్: కేయూ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో జూన్ 13 నుంచి 16 వరకు మాలిక్యూలర్ డాకింగ్ అంశంపై జాతీయస్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం క్యాంపస్‌లోని పరిపాలన భవనంలో వర్క్‌షాప్ బ్రోచర్‌ను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. ఈసందర్భంగా జువాలజీ విభాగం అధిపతి జి.షమిత మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో ఇన్సిలికో డ్రగ్ డిజైన్, మాలి క్యూల్ బిల్డింగ్, ప్రొటీన్ మాడలింగ్, డాకింగ్ సిమ్యులేషన్ అంశాలపై హ్యాండ్స్ ఇన్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే వారు ఈనెల 20లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తివివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, వివరాలకు ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి (9110741338)ని సంప్రదించాలని సూచించారు. -
డిగ్రీ పరీక్షలపై అయోమయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సులకు సంబంధించి 2, 4,6 సెమిస్టర్లు, బ్యాక్లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 14వ తేదీనుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు గడువు విధించారు. అయినప్పటికీ ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు పరీక్షల విభాగానికి చెల్లించలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, అధికారులు మాత్రం ఫీజులు చెల్లించిన కళాశాలల విద్యార్థులకు మాత్రం ఈనెల 14నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 107 కాలేజీలు ఫీజుల చెల్లింపు.. కేయూ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అటానమస్, గురుకులాలు కలిపి 292 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అందులో 217 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు రెండు సార్లు టైంటేబుల్‌ను ప్రకటించి ఫీజులు చెల్లించాలని కోరారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, అందువల్ల పరీక్షల నిర్వహణకు సహకరించబోమని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీ అధికారులు రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశారు. అయినా చాలా కాలేజీలు ముందుకు రాకపోవటంతో ఈనెల 4న కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏయే ప్రైవేట్ కాలేజీలు ఇప్పటివరకు పరీక్షల ఫీజులు చెల్లించలేదో గుర్తించారు. సెమిస్టర్ల పరీక్షలు జరిగేనా ? తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో వారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ఆరవ సెమిస్టర్ కీలకమైంది. ఈ పరీక్షలు జరగకుంటే వారు ఉన్నత చదువులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వారు టీజీ ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్‌కు ప్రిపేరవుతున్నారు. ఆ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ విద్యార్థులనుంచి వినిపిస్తోంది. డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షలకు సుమారు 1.70 లక్షల మందికిపైగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఫీజులు చెల్లించిన కాలేజీలకే పరీక్షలు నిర్వహిస్తే, చెల్లించని కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏమిటనే చర్చ నడుస్తోంది. ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు కేయూ పరిధిలో విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం. వారికి సమయం కూడా ఇచ్చాం. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు ఫీజులు చెల్లించిన అన్ని యాజమాన్యాల కాలేజీల్లో ఈ నెల14నుంచి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తాం. రెండు, మూడు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేస్తాం. ఇప్పటికై నా ఫీజులు చెల్లించని కాలేజీలు ఒకటి, రెండు రోజుల్లోనైనా ఫీజులు చెల్లించి నామినల్‌రోల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. – కె.రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారి ఇటీవల దోస్త్ నోటిఫికేషన్.. 2025–2026 విద్యాసంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. కేయూ అధికారులు పరీక్షల ఫీజులు చెల్లించని 138 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పేర్లను దోస్త్ నుంచి తొలగించారు. దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేదు. దీంతోనైనా పరీక్ష ఫీజులు చెల్లించేందుకు యాజ మాన్యాలు ముందుకువస్తాయని భావించారు. మంగళవారం పరీక్ష ఫీజు గడువు ముగిసే వరకు 138 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే చెల్లించాయి. మొత్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి మంగళవారం వరకు 107 కాలేజీలు ఫీజులు చెల్లించాయి. కేయూ పరిధిలో ఫీజులు చెల్లించని 138 కళాశాలలు దోస్త్ నుంచి తొలగింపు వీటిలో ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలే ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు వాయిదా ముగిసిన ఫీజు చెల్లింపు గడువు ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటీ? -
కమలాపూర్ సీహెచ్‌సీలో విచారణ
కమలాపూర్ : గర్భిణికి ఆపరేషన్ చేసి ప్రసవ అనంతరం గేజ్ ప్యాడ్ తొలగించకుండా మరిచిన ఘటనకు సంబంధించి కమలాపూర్ సీహెచ్‌సీలో డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ గౌతం చౌహాన్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాలింత తిరుమలతో పాటు ఆమె బంధువులు, సీహెచ్‌సీ వైద్యురాలిని విచారించి వివరాలు సేకరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సీహెచ్‌సీలో విచారణ చేపట్టి వివరాలు సేకరించామని తెలిపారు. 3.5 కిలోల బేబీ డెలివరీ కోసం చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చిందని, సున్నితమైన ప్రదేశం కావడంతో నరాలు చిట్లి బ్లీడింగ్ అయి కొంత ఇబ్బంది ఏర్పడిందని, ప్రస్తుతం తిరుమల ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు. పూర్తిగా కోలుకోవడం కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించాలని చూశామని, కానీ అందుకు తిరుమల బంధువులు అంగీకరించలేదని, దీంతో వారికి నచ్చిన ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పినట్లు వివరించారు. ఇక్కడ వైద్య పరంగా ఎలాంటి ఇబ్బంది జరగలేదని, ప్రొటోకాల్ ప్రకారమే డెలివరీ చేశామని వైద్యులు చెబుతున్నారని, విచారణలో భాగంగా ముందస్తుగా వారికి మెమోలు జారీ చేసి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. విచారణ సందర్భంగా స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు పలువురు గ్రామస్తులు విచారణాధికారులకు సీహెచ్‌సీ, పీహెచ్సీ వైద్యులు, సిబ్బందిపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. పీఓ ఎంసీహెచ్ డాక్టర్ మంజుల, ఎంపీ హెచ్ఈఓ రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ నరేష్, రమ్య పాల్గొన్నారు. బాలింత, ఆమె బంధువులు, వైద్యుల నుంచి వివరాల సేకరణ -
ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు
● హైకోర్టు జడ్జి జస్టిస్ రాజేశ్వరరావు మహబూబాబాద్ రూరల్ : జీవితంలో సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, వాటి నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఆత్మహత్యలు–నివారణ సదస్సు కరపత్రాలను జిల్లా కేంద్రంలోని అడ్వకేట్స్ కాలనీలో హైకోర్టు జడ్జి రాజేశ్వరరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవించడానికే జీవితం అని, ఆత్మహత్యలకు పాల్ప డొద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో త్వరలో పోలీసుల సహకారంతో ఆత్మహత్యలు–నివారణ సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
కేయూ క్యాంపస్ : ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపి వేయాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాకతీయ యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి యూనివర్సిటీ మొదటి గేట్ వరకు శాంతిర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న భారత్ బచావో బాధ్యుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాంబ్రహ్మం మాట్లాడుతూ దండకారణ్యంలో కేంద్రం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్‌ని ఆపివేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అపార ఖనిజ సంపద కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు అప్పగించేందుకు అడ్డంకిగా ఉన్న మావోయిస్టులను, ఆదివాసీలను లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను చేపట్టిందని ఆరోపించారు. ర్యాలీలో డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, బీఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడు శివ, భారత్ బచావో బాధ్యులు వెంగల్ రెడ్డి, రాజా మహ్మద్, సదానందం, అరసం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మార్క శంకర్ నారాయణ, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఉప్పుల శివ, మహేష్, రాజేష్, శివ, సన్నీ పాల్గొన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలి కేయూలో విద్యార్థి సంఘాల ర్యాలీ -
వడదెబ్బతో మహిళ మృతి
గార్ల : వడదెబ్బతో మహిళ మృతిచెందిన సంఘటన సోమవారం గార్లలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్లలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన అక్కి పార్వతి (51) రెండ్రోజుల క్రితం మిరప తోటలో కాయలు ఏరేందుకు పనికి వెళ్లింది. ఆదివారం నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో అపస్మారక స్థితికి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు సీహెచ్‌సీకి తరలించగా, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని డాక్టర్ రాజ్కుమార్జాదవ్, తహసీల్దార్ ఆర్.శారద, ఎస్సై ఎస్కె రియాజ్‌పాషా సందర్శించి ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ
కాళేశ్వరం: కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శని, దరిద్రం అని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ.. వాస్తవాలు’ అనే కార్యక్రమాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, వాటర్‌బోర్డు కార్పారేషన్ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, విద్యాసాగర్‌రావు, చిన్న య్య, చందర్, మాజీ జెడ్పీచైర్పర్సన్లు శ్రీహర్షిణి, వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ అంతటికీ సాగు, తాగునీరందించారని, అలాంటి ప్రాజెక్టుకు రిపేర్లు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయడంలేదని, తెలంగాణ రైతులపై చిత్తశుద్ధి ఉంటే మంత్రి శ్రీధర్‌బాబు రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఒక్క పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టు కుంగినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిసమావేశాల్లో ప్రస్తావిస్తున్నారని, ప్రాజెక్టుపై దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. నీటిరంగ నిపుణులు వి.ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్యారేజీలు కూలిపోడమే సీఎం రేవంత్‌రెడ్డి ఆశయమని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంలో ఎవరికీ అనుమానం లేకున్నా.. తనకుందని అనడంలో కుట్ర దాగి ఉన్నదని పేర్కొన్నారు. బ్యారేజీ కుంగిపోవడం, భారీ శబ్దం రావడంపై ఇప్పటికీ ఎన్డీఎస్ఏ నివేదికలు ఇవ్వలేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ.. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతంగానికి నీటిని అందించాలన్నారు. అంతకు ముందు గోదావరిని పరిశీలించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంట్ రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయకుండా నిర్వీర్యం చేస్తుండ్రు శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు -
మూడు రోజులైతే మళ్లీ విధుల్లోకి..
కొత్తగూడ : కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చాడు. ఉగ్రవాదుల చర్యతో సెలవులు రద్దయ్యాయి.. మూడ్రోజులైతే మళ్లీ విధుల్లో చేరేవాడు. ఉన్న రెండ్రోజులు బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు వెళ్లి సంతోషంగా గడపాలనుకున్నాడు.. కాని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. గంగారం మండలం అందుగుల గూడెం గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మద్దెల ప్రకాశ్(32) ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దేశ రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తూ గ్రామస్తులతో కలివిడిగా ఉండేవాడు. గోవిందాపూర్ గ్రామంలో శుభకార్యానికి బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లిన అతను రాత్రి తిరిగి వస్తుండగా పెగడపల్లి సమీప మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్సై కుశకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సెలవులపై వచ్చిన జవాన్..రోడ్డు ప్రమాదంలో మృతి అందుగులగూడెంలో విషాదం -
‘సోలార్’పై విముఖత
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా..ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 889.7 మెగావాట్లకు సరిపడా 682 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 210.6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 162 మంది రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. 177.1 మెగావాట్లకు గాను 141 మందికి లెటర్ ఆఫ్ ఆక్సెప్టెనీ ఇచ్చారు. ఇంకా 520 మంది రైతులు సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై విముఖతతో ఉన్నారు. దరఖాస్తు స్వీకరించడానికి గడువు పొడిగించిన ఆశించిన మేరకు దరఖాస్తులు రాలేదు. అదే విధంగా ఈఎండీ చెల్లించేందుకు దరఖాస్తులు ముందుకు రావడం లేదు. రుణాలపై స్పష్టత ఇవ్వని బ్యాంకర్లు ● ఈఎండీ చెల్లించేందుకు ముందుకురాని రైతులు ● ఉమ్మడి జిల్లాలో 682 దరఖాస్తులు ● ఈఎండీలు చెల్లించినది 162.. ముందుకు రాని వారు 520 మందిహన్మకొండ : భారీ పెట్టుబడి.. గిట్టుబాటు కానీ ధర.. 12ఏళ్ల వరకు రైతుకు ప్రయోజనం లేకపోవడం.. రుణంపై బ్యాంకర్లకు స్పష్టత లేక పోవడం.. రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి రావడం.. ప్రతినెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో తీవ్ర విముఖత వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసినప్పటి ఉత్సాహం ఈఎండీ చెల్లించడంలో రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీఎం కుసుం పథకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తుల స్వీకరణకు మూడు సార్లు గడువు పొడిగించింది. ఇప్పుడు ఈఎండీలు చెల్లించడానికి రెండు సార్లు గడువు విధించింది. అయినా ఈఎండీలు చెల్లించడానికి రైతులు ముందుకు రావడం లేదు. దీంతో ఈ పథకం ఆశించిన మేర సఫలం కాలేక పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకు వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పథకాన్ని రూపొందించారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల లోపు దూరం మాత్రమే ఉండాలి. 500 కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల ఉత్పత్తి వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. సోలార్ ప్లాంట్‌పై అవగాహన లేకనే.. ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు రూ.3 కోట్ల ఖర్చు అవుతుంది. ఇందులో రైతులు తమ వాటాగా 25 శాతం భరిస్తే, బ్యాంకుల ద్వారా 75 శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కొన్ని బ్యాంకులకు సోలార్ ప్లాంట్‌పై అవగాహన లేదన్నారు. కనీసం 25 శాతం కింద రూ.3 కోట్ల వ్యయంలో రైతు వాటాగా రూ.75 లక్షలు భరించలేమని, అదే విధంగా ప్రభుత్వం యూనిట్‌కు చెల్లిస్తామని చెప్పిన రూ.3.13లు ఏటు సరిపోవన్నారు. 12 ఏళ్ల వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి రావడంతో అప్పటి వరకు రైతుకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వాపోయారు. దీంతో తాము నష్టపోతున్నట్లు చెబుతున్నారు. లాభదాయకంగా లేదు.. మా నాన్న పేరుపై వ్యవసాయ భూమి ఉంది. పీఎం కుసుం పథకం ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేద్దామని దరఖాస్తు చేశాం. యూనిట్ ధర చూస్తే ఏ మాత్రం లాభదాయకంగా లేదు. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. 25 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.13 మాత్రమే చెల్లిస్తుండడం ఏ మాత్రం ప్రయోజనం కాదు. ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌కు రూ.4 నుంచి రూ.4.50 వరకు చెల్లిస్తున్నారు. 14, 15 సంవత్సరాల వరకు వచ్చే ఆదాయం వాయిదాలకే వెళ్తుంది. తర్వాతే రైతు చేతికి ఆదాయం వస్తుంది. అప్పటి వరకు పరిస్థితిలు ఎలా ఉంటాయోనని ఈఎండీ చెల్లించలేదు. – పెసరు కార్తీక్ రెడ్డి, సూదనపల్లి, హనుమకొండ జిల్లాల వారీగా వివరాలు.. జిల్లా వచ్చిన ఈఎండీ ఎల్ఓఏ దరఖాస్తులు–మెగావాట్లు చెల్లింపు–మెగావాట్లు జారీ–మెగావాట్లు హనుమకొండ 76 95.2 26 33.2 24 29.2 జేఎస్ భూపాలపల్లి 116 138.8 19 22.8 19 22.8 జనగామ 179 243.2 51 66 41 52 మహబూబాబాద్ 127 177.3 41 57.6 33 43.6 ములుగు 50 70.2 5 5 4 4 వరంగల్ 134 265 20 26 20 25.5 -
సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు ముమ్మరం
కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 15నుంచి 26వతేదీ వరకు జరిగే సరస్వతీ నది పుష్కరాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ పేర్కొన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సబ్ కలెక్టక్ మయాంక్ సింగ్‌తో కలిసి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. సరస్వతీ(వీఐపీ) ఘాట్, సరస్వతీ మాతా విగ్రహం ఏర్పాటు, శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం పనులు పరిశీలించారు. టెంట్ సిటీ నిర్మాణానికి సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడారు. త్వరగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేటినుంచి సరస్వతిమాత విగ్రహం ఏర్పాటు పనులు జరుగుతుందని తెలిపారు. వీఐపీ ఘాట్ వద్ద తోరణ నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని ఎండోమెంట్ ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. తాగునీరు, భక్తులు దుస్తులు మార్చు గదులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈఓ మహేష్, ఇరిగేషన్ ఈఈ తిరుపతి రావు, డీపీఓ వీరభద్రయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్టీసీ డీఎం ఇందు, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, డీటీ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మ 10వ తేదీ వరకు పనులు పూర్తిచేయాలి -
మామిడి ప్యాకింగ్ కేంద్రాల తనిఖీ
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మామిడి డీలర్ల దుకాణాలతో పాటు ప్యాకింగ్ కేంద్రాలను మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్, డీఎంఓ సురేఖలు సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మామిడి ప్యాకింగ్ చేస్తున్న విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ..రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు తనిఖీ చేసి మామిడి ప్యాకర్లు, ఆహార భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. వరంగల్‌లోని హరీష్ ఫ్రూట్ కో, ఎన్ఎస్.ఫ్రూట్ కో, అమ్జద్ ఫ్రూట్ కో, ఎస్కె ఫ్రూట్ కో, ఎస్ఎఫ్ఎ. ఫ్రూట్ కోలను సందర్శించి మామిడి కాయలు పండుగా మారేందుకు కార్బైడ్, ఇతర రసాయనాలు వాడుతున్నారన్న విషయాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. మామిడి కాయలు పండేందుకు ఎగుమతి, బరువు, దూరం ప్రకారం ఒకటినుంచి నాలుగు సాచెట్లు ప్రభుత్వ ఆమోదిత ఇథిలిన్ రైపనర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం నమూనా సాచెట్లను సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌లోని లేబరేటరీలకు పంపిస్తున్నట్లు జేడీఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి శ్రీరామోజు రాము, సిబ్బంది పాల్గొన్నారు. పీపీటీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంవిద్యారణ్యపురి: పీపుల్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశానికి సోమవారం హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్‌కుమార్ ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్‌లోని ప్రగతి విద్యానికేతన్‌లో ఉచిత విద్యను అందిస్తారన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పీపుల్స్ ట్రస్ట్ ప్రతినిధి పవన్‌కుమార్, టీఎస్‌యూటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.రవీందర్‌రాజు, తాటికాయల కుమార్, పెండెం రాజు, సుజన్‌ప్రసాద్‌రావు, జిల్లా కార్యదర్శి సీఎస్ఆర్ మల్లిక్ పాల్గొన్నారు. -
బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలి
రామన్నపేట : బీసీలు రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ మేధావుల వేదిక స్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా వేదిక అధ్యక్షుడు వీరస్వామి అధ్యక్షత ఐఎంఏ హాల్లో బీసీల రాజకీయ నాయకత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం ఉన్నప్పటికి, ఇప్పటికీ అన్ని రంగాల్లో బీసీలు సముచిత స్థానం నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అనంతరం బీసీ మేధావుల వేదిక వరంగల్, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, ఐఎంఏ గైనకాలజీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మి, కూరపాటి రాధికను ప్రతినిధులు సన్మానించారు. మండల పరుశురాములు, ధర్మపురి రాజగోవిందు, జంగిలి శ్రీనివాస్, పెండెం సంపత్‌కుమార్, జోనాతన్, సూర్యకిరణ్, రాములు, రాజు, ప్రొఫెసర్లు పురుషోత్తం, దామోదర్, తదితరులు పాల్గొన్నారు. బీసీ మేధావుల వేదిక స్థాపక అధ్యక్షుడు చిరంజీవులు -
కానిస్టేబుల్ కుటుంబానికి అండగా..
వరంగల్ క్రైం : ఆకస్మికంగా మృతిచెందిన కానిస్టే బుల్ కుటుంబానికి తమవంతు బాధ్యతగా సేకరించిన ఆర్థికసాయాన్ని సోమవారం వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అందజేశారు. కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండారి కిరణ్ కుమార్ గతేడాది మరణించాడు. దీంతో తమ మిత్రుడి కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచనతో 2013 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుళ్లు వరంగల్ కమిషనరేట్, ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కానిస్టేబుళ్లతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది రూ.2.50 లక్షల రికరింగ్ డిపాజిట్ పత్రాలతో పాటు రూ.37వేల నగదు ను సీపీ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అదనపు డీసీపీ సురేష్ కుమార్, ఆర్ఐ సింహాచలం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శివ, రాజు పాల్గొన్నారు. డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెహన్మకొండ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ నాయకులు ఎం.శ్రీనివాస్, సీహెచ్.యాకస్వామి, జి.ఎస్.పాణి, బట్టు స్వామి, యు.ఆర్.కృష్ణ, తిరుపతి సోమవారం పేర్కొన్నారు. కార్మిక ద్రోహి ఆశ్వత్థామ రెడ్డి రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చలు జరపడం సిగ్గుచేటని విమర్శించారు. ఆర్టీసీ జేఏసీతో అశ్వత్థామ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వారు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాము సమ్మెలోకి వెళ్లడం లేదని ఆయన చేసిన ప్రకటనను వారు ఖండించారు. అశ్వత్థామ రెడ్డి మాటలను కార్మికులు నమ్మరన్నారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకపోవడంతో చివరకు సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలైన ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నా రు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి కేటాయించాలని, 2021 వేతన సవరణ 21 డిమాండ్లపై రాష్ట్ర జేఏసీతో చర్చించి వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలువకుండా డిమాండ్ల పరిష్కారంపై స్పష్టత ఇవ్వకపోతే సమ్మెకు వెళ్తామన్నారు. కార్మికులంతా సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు.! ఏటూరునాగారం : మండల కేంద్రంలోని జంపన్నవాగు కరకట్ట సమీపంలో ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన అన్వర్ ఈనెల 2వ తేదీన రాత్రి 10:45లకు తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. గమనించిన సదరు వ్యక్తులు అన్వర్‌పై దాడి చేసి సెల్‌ఫోన్‌ను లాక్కొని వీడియోలు, ఫొటోలు డిలిట్ చేసినట్లు బాధితుడు అన్వర్ తెలిపారు. ఇదే విషయంపై సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్ల డించారు. అసలు గుప్తనిధుల కోసం తవ్వారా? లేదా వారి ఇంటి అవసరాల కోసమా అనేది పోలీసులు విచారణ చేపట్టి తేల్చాల్సి ఉంది. కానీ గ్రామంలో మాత్రం గుప్తనిధుల కోసమే తవ్వినట్లు వినికిడి. అంతేకాకుండా బంగారు బిల్ల లు కూడా దొరికినట్లు పుకార్లు షికార్లయ్యాయి. ఈ విషయంపై ఎస్సైను వివరణ కోరగా అన్వర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచా రణ చేపట్టి కేసు నమోదు చేసిద ర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. -
విద్యుత్ భద్రత పాటించాలి
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఖిలా వరంగల్: విద్యుత్ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. విద్యుత్ శాఖ భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం వరంగల్ రంగశాయిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎన్పీడీసీఎల్ వరంగల్ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు పెద్దపీట వేసి వినియోగదారులు, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, అధికారులు, సిబ్బందికి రక్షణ పరమైన పరికరాలు అందజేస్తున్నామని చెప్పారు. ఏదైనా సమస్య వస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే జేఎల్ఎం నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతమ్‌రెడ్డి, డీఈ టెక్నికల్ ఆనందం, డీఈ ఆపరేషన్స్ మల్లికార్జున్, ఏడీ చంద్రమౌళి, సురేష్, కిషోర్ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025
– 8లోuపశుసంవర్థక శాఖలో మళ్లీ కలకలం ● యూనిట్ల వివరాలివ్వాలని ఈడీ నోటీసులు ● డీవీఏహెచ్ఓలను ఆరా తీస్తున్న ‘విజిలెన్స్’ ● కొందరు వీఏఎస్లను విచారణకు పిలిచిన ఏసీబీ? ● రిటైర్డ్ అయినా తప్పని ఎంకై ్వరీ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పైనా పేచీ.. న్యూస్‌రీల్ -
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 143 అర్జీలు రాగా.. అందులో జీడబ్ల్యూఎంసీ 16, హౌసింగ్ పీడీ 13, తహసీల్దార్ కాజీపేట 9, తహసీల్దార్ ఎల్కతుర్తి 7, మిగతావి వివిధ శాఖలకు వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 119 దరఖాస్తులు రాగా.. వాటిని పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ 35, హౌసింగ్ 42 దరఖాస్తులు, మిగిలినవి ఇతర శాఖలకు వచ్చాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ మాట్లాడుతూ.. జిల్లాలోని వ్యవసాయ భూములను మండల అధికారి కార్యాలయం లేదా రైతు వేదికల్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై 143 అర్జీలు