కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన విద్యార్థి అట్ల తరుణ్‌తేజ ఇటీవల విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 53వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అలాగే ఇటీవల ప్రకటించిన సివిల్స్ పరీక్షల్లో అఖిలభారత స్థాయిలో 770 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచారు.
ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన తరుణ్‌తేజ ఐఐటీ ముంబాయి నుంచి బీటెక్ సీఎస్సీ పూర్తి చేశారు. గణితం ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా మంగళవారం తరుణ్‌తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఐఏఎస్ సాధించడమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం మండల స్థాయిలో ఐదు రోజులపాటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణను హనుమకొండలోని ప్రశాంత్‌నగర్‌లోని డీపీఎస్ స్కూల్‌లో ప్రారంభించి ఆమె మాట్లాడారు. తెలుగు, ఆంగ్ల, గణితం సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని కోరారు. ఐదు రోజులపాటు రిసోర్స్‌పర్సన్లు ఇస్తున్న శిక్షణ వినియోగించుకుని ఇందులో నేర్చుకున్న అంశాలతో విద్యను బోధించాలన్నారు. శిక్షణలో హనుమకొండ ఎంఈఓ జి.నెహ్రూ, రిసోర్స్‌పర్సన్లు శ్రీపాల్‌రెడ్డి, ఎం.శ్రీధర్, పృధ్వీరాజ్, శివకోటి, అశోక్, ఎ.శ్రీధర్, మధు, జ్యోతి, రాజ్‌కుమార్, మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు హనుమకొండ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ మంగళవారం తెలిపారు. ప్రతీ రోజు రెండు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో 33 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 12,063 మంది, సెకండియర్‌లో 5,453 మంది పరీక్షలు రాయనున్నట్లు, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌బీఐఈ.సీజీజీ. గౌట్.ఇన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

తరుణ్‌తేజ