
పూడికతీత పనుల తనిఖీ
వరంగల్ అర్బన్: హనుమకొండ పరిధి నయీంనగర్ నాలా బ్రిడ్జి, మంగలి వాగు బ్రిడ్జి నాలాల పూడికతీత పనుల్ని బుధవారం కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. నాలాల్లో ఏమాత్రం వ్యర్థాలు లేకుండా ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. పూడికతీత పనుల్లో నిర్లక్ష్యం చేస్తే వరదల వల్ల కాలనీకు ముప్పు వాటిల్లుతుందని గుర్తించుకోవాలని సూచించారు.
ఉనికిచెర్లకు
పట్టణ రూపు తీసుకొస్తా..
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్: ఉనికిచర్ల గ్రామానికి పట్టణ రూపు తీసుకొస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధి ఉనికిచర్లలో రూ.1.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, వరద కాలువల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఉనికిచర్ల గ్రామాభివృద్ధికి ‘కుడా’ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉనికిచర్ల– రా పాకపల్లి రోడ్డుకు రూ.41 లక్షలు మంజూరైన ట్లు, పనులు ప్రారంభమవుతాయన్నారు.

పూడికతీత పనుల తనిఖీ