రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన నాయకులు
రామన్నపేట: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఎంజీఎం సర్కిల్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నాయకులు గోపాల నవీన్‌రాజ్, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి భాస్కర్, టీపీసీసీ కార్యదర్శులు మీసాల ప్రకాశ్, కొత్తపల్లి శ్రీనివాస్, మబ్బు ప్రవీణ్, భాషపాక సదానందం, మడిపల్లి కృష్ణ, సకినాల రజనీకాంత్, కత్తెరశాల వేణుగోపాల్, జారతి రమేశ్, నారగోని స్వప్న మురళి, కార్పొరేటర్లు తేజస్వి శిరీష్, వస్కుల బాబు, కావేటి కవిత, బాల్నే సురేశ్, భోగి సువర్ణ సురేశ్, గుండు చందన, పూర్ణచందర్ పాల్గొన్నారు.


