మున్సిపల్ ఓటరు జాబితా నోటిఫికేషన్ జారీ
జనగామ: మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణ, విడుదల నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ రాణి కుముదిని, ఎన్నికల పట్టికల తయారీకి సంబంధించి దశలవారీ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలు పాతవి ఉండగా వీటికితోడు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎన్నికలు జరగనున్నాయి. నేడు(మంగళవారం) 30వ తేదీన మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్ డేటాను సమీకరించడం, 31న పోలింగ్‌స్టేషన్ వారీగా వార్డుల డేటా పునర్వ్యవస్థీకరణ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వార్డుల వారీగా పోలింగ్‌స్టేషన్ జాబితాల తయారీ, జనవరి 1వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితాల ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, 5వ తేదీన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం, 6వ తేదీన ఎన్నికల అధికారుల సమావేశం, 10వ తేదీన తుది ఓటరు జాబితాల విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా నోటిఫికేషన్‌తో రాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగుపడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
జనవరి 10న వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల
నేటినుంచి ఓటరు జాబితాల సమీకరణ


