కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
● వరంగల్ జిల్లా కుష్ఠు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్‌సింగ్
వరంగల్: ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సహకరించి కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని వరంగల్ జిల్లా కుష్ఠు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్‌సింగ్ అన్నారు. కాశిబుగ్గ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాను కుష్ఠు రహిత జిల్లాగా చేయడానికి ప్రతీ ఇంటికి వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షకులు రోజు ఉదయం 6నుంచి 9 గంటల వరకు వెళ్లి ఇంట్లో ఎవరికై న అనుమానిత మచ్చలు ఉంటే వాటిని పరీక్షించాలన్నారు. పరీక్షల ద్వారా నిర్ధారణ చేసి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేయాలని సూచించారు. కుష్ఠు వ్యాధి సాధారణంగా అన్ని వ్యాధుల వలే వచ్చే వ్యాధి అని, దీన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్సలు తీసుకుంటే నయమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాశిబుగ్గ పట్టణ ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ కిరణ్, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఆరోగ్య కార్యకర్త శైలజ, ఆశ కార్యకర్తలు కమల, స్వరూప పాల్గొన్నారు.
భారీ అండాశయ కణతి తొలగింపు
ఎంజీఎం: వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన గర్భిణి పెంతల సింధు ప్రసవం కోసం నగరంలోని సీకేఎం ఆస్పత్రిలో చేరింది. సోమవారం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. మహిళ కడుపులో భారీ అండాశయ కణతి (3.5 కేజీలు) ఉండడంతో శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతంగా తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మీదేవి తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీ, పీజీలు, నర్సింగ్ స్టాఫ్ సౌజన్య, అనస్తీషియా విభాగం వైద్యులు డాక్టర్ బేబీరాణి, రమేశ్, సైఫ్, దీపిక, రహీమున్నిస్సా పాల్గొన్నారు.
పేరిణి కళాకారులకు నృత్య కౌముది పురస్కారం
హన్మకొండ కల్చరల్: వరంగల్‌కు చెందిన కళాకృష్ణ నృత్య అకాడమీలో పేరిణి నృత్యంలో ఇన్‌స్ట్రక్టర్‌గా శిక్షణ పొందుతున్న యువ పేరిణి కళాకారులు బండారి వైష్ణవి, తొడెన్గా సంతోశ్ పేరిణి నృత్యంలో తెలంగాణ నుంచి నృత్యకౌముది పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సౌజన్యంతో అభినయ నృత్య భారతి ఏలూరు వారి ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయి నృత్యపోటీలు నిర్వహించారు. అకాడమీ నిర్వాహకులు, పేరిణి నృత్యగురువు గజ్జెల రంజిత్ పర్యవేక్షణలో కళాకారులు నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంతోశ్, వైష్ణవికి నిర్వాహకులు పురస్కారం ప్రదానం చేశారు.
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి


