అర్జీలు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజా వాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. అర్జీలు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 167 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


