గడువులోగా పనులు పూర్తి చేయండి
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ పాత స్థలంలో అధునాతన బహుళ అంతస్తు నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్, ‘కుడా’ వైఎస్ చైర్మన్ చాహత్‌బాజ్‌పాయ్ ఆదేశించారు. సోమవారం పాత బస్ స్టేషన్‌ను క్షేత్రస్థాయిలో కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.
స్మైల్ కేంద్రం నిర్వాహకులకు నోటీసు
బల్దియా ఆధ్వర్యంలో హనుమకొండ భీమారం ప్రాంతంలో హెల్త్ కేర్ సొసైటీ ఎన్జీఓ ద్వారా నిర్వహిస్తున్న స్మైల్ కేంద్రాన్ని సోమవారం కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో హెల్త్ కేర్ సొసైటీ నిర్వాహకులకు నోటీసు జారీ చేయాలని ఉప కమిషనర్ సమ్మయ్యను ఆదేశించారు. అనంతరం కమిషనర్ పలివేల్పులలోని లార్డ్స్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి వారికి అందుతున్న వసతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.


