
మహిళా కానిస్టేబుల్‌కు సీపీ అభినందన
వరంగల్ క్రైం: ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ స్పందనను సీపీ సన్‌ప్రీత్‌సింగ్ బుధవారం అభినందించారు. వరంగల్ కమిషనరేట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ వి భాగంలో మహిళా కానిస్టేబుల్ స్పందన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె గత నెల పంజాబ్ రాష్ట్రం జలందర్‌లో నిర్వహించిన మొదటి ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఫెన్సింగ్ క్రీడలో సీనియర్ ఉమెన్స్ టీం ఫాయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించే పోలీస్ సిబ్బందికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి, ఏఆర్ ఏసీపీ అంతయ్య పాల్గొన్నారు.
ఎంసీఏ పరీక్షలు షురూ..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. క్యాంపస్‌లోని ఎకనామిక్స్ విభాగంలో ఏర్పా టు చేసిన ఎంసీఏ పరీక్ష కేంద్రాన్ని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం పరిశీలించారు. కేయూ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల వివిధ సెమిస్టర్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం ఏటూరు నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని బుధవారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.వెంకటయ్యతో కలిసి పరిశీలించారు.
బెస్ట్ ప్రాక్టీసెస్
నమోదు గడువు పెంపు
విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు తమ పాఠశాలల్లో ఆచరించే బెస్ట్ ప్రాక్టీస్ నమోదు గడువును ఎస్‌సీఈఆర్టీ పెంచినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి బుధవారం తెలిపారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, కేజీబీవీల, తెలంగాణ మోడల్ పాఠశాలలు, తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు ఈనెల 22వ తేదీ వరకు ఎస్‌సీఈ ఆర్‌టీవెబ్‌సైట్‌లో, హెచ్‌టీటీపీఎస్//ఎస్‌సీఈఆర్టీ.తెలంగాణ.గౌట్.ఇన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి సందేహాలుంటే డి.మధుసూదన్‌రెడ్డి 97058 06579 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఉపకార వేతనాలకు
దరఖాస్తుల ఆహ్వానం
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని బీసీ కులానికి చెందిన శిక్షణలో ఉన్న అడ్వకేట్ విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి బీసీ అడ్వకేట్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు కలెక్టరేట్‌లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
నాయకత్వ లక్షణాలు
పెంచుకోవాలి..
విద్యారణ్యపురి: పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు సంబంధించిన విషయాల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. బుధవారం జిల్లాలోని భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని డీఈఓ వాసంతి సందర్శించి హెచ్‌ఎంలను ఉద్దేశించి మాట్లాడారు. వృత్తిపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని అలాగే నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకోవాలన్నారు. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే, పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ మార్గాలను అనుసరించాలని హెచ్‌ఎంలకు డీఈఓ సూచించారు. శిక్షణలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, కమ్యూనిటీ మొబలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, రిసోర్స్‌పర్సన్లు రామకృష్ణ, వేణు ఆనంద్, మనోహర్‌నాయక్, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

మహిళా కానిస్టేబుల్‌కు సీపీ అభినందన