ఆశించినమేర పనులు జరగలేదు.. | - | Sakshi
Sakshi News home page

ఆశించినమేర పనులు జరగలేదు..

May 8 2025 12:34 AM | Updated on May 8 2025 12:34 AM

ఆశించ

ఆశించినమేర పనులు జరగలేదు..

కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల ఏర్పాట్లలో ఆశించిన మేర పనులు జరగడం లేదని, మూడు షిప్టుల్లో పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌ వెంకట్‌రావు అన్నారు. మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, అధికారులతో కలిసి సరస్వతీనది పుష్కరాల ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. వీఐపీ ఘాట్‌ విస్తరణ, గోదావరి ఘాట్‌లు, టెంట్‌సిటీ, గోదావరి హారతి ప్రాంతం, పుష్కర స్నానాల ప్రాంతం, 86గదుల గెస్ట్‌హౌస్‌, హెలిపాడ్‌ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్లకు పలుసూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి విధులు కేటాయించాలన్నారు. మొట్టమొదటి సారి గా జాయ్‌రైడ్‌, టెంట్‌సిటీ ఏర్పాటు చేస్తున్నారని కలెక్టర్‌ను అభినందించారు. సివిల్‌ పనులు చాలా పెండింగ్‌ ఉన్నాయని, లోపాలు రావొద్దని తెలిపారు. రానున్న వారం రోజులు చాలా ముఖ్యమని, 24/7 పనులు జరగాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ పనులు నత్తనడకన జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో మంత్రి వస్తున్నారని, రూపురేఖలు మారాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. షవర్‌ పనులు పెండింగ్‌ ఉన్నాయని, గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. మరుగుదొడ్ల పనుల్లో వేగం పెంచాలన్నారు. ఫుడ్‌ కోర్టు, స్టాళ్లు, ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. వీఐపీ ఘాట్‌ రోడ్డు బారికేడింగ్‌ చేయాలని సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీములు ఏర్పాటు చేయాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. పుష్కరాలు పూర్తి అయ్యే వరకు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులకు అనుమతి లేదని తెలిపారు. ప్రతి రోజు 5వేల మందికి ఉచిత అన్నదానం చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. 15న సీఎం వస్తున్నారని, సరస్వతీమాత విగ్రహం ప్రారంభో త్సవం, పుష్కర స్నానం, దర్శనం, హారతి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 5 సెక్టార్లు, 18 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 12వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు వీక్షించేలా పట్టణంలోని ప్రధాన కూడళ్లులో ఎల్‌ఈడీ స్క్రీ న్స్‌ ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఎస్పీ కిరణ్‌ ఖరే మాట్లాడుతూ.. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావే శంలో మంత్రులు దిశానిర్దేశం చేశారని తెలిపారు. అన్నిశాఖలు సమన్వయంతో పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, దేవాదాయశాఖ ఆర్జేసి రామకృష్ణారావు, ఈఓ మహేష్‌, అడిషనల్‌ ఎస్పీ కిషన్‌ పాల్గొన్నారు.

టెంట్‌సిటీ పనులు ప్రారంభం

పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టెంట్‌సిటీ ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం రూ.50లక్షల వ్యయంతో హైదరాబాద్‌కు చెందిన ఆలిఎలిమెంట్‌ అనే ప్రైవేట్‌ సంస్థ టెంట్‌సిటీ పనులను ప్రారంభించింది. టెంట్‌సిటీ వీఐపీ(సరస్వతి)ఘాట్‌ సమీపంలో 30 టెంట్‌సిటీలు నిర్మిస్తున్నారు. 12 రోజులపాటు భక్తులు బస చేయడానికి వేసవి దృష్ట్యా ఏసీలు టాయిలెట్స్‌, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక రోజుకు రూ.3వేల అద్దె తీసుకోనున్నారు.

దేవాదాయ శాఖ కమిషనర్‌ వెంకట్‌రావు

సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన

మూడు షిప్టుల్లో పనులు చేయాలని సూచన

పనులను పరిశీలిస్తున్న దేవాదాయశాఖ

కమిషనర్‌ వెంకట్‌రావు, కలెక్టర్‌, ఎస్పీ

ఇంటెలిజెన్స్‌ ఎస్పీ పరిశీలన

కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ ఎస్పీ భాస్కరన్‌ బుధవారం ఆయన వీఐపీ, సాధారణ ఘాట్‌, పార్కింగ్‌ స్థలాలు, హెలిపాడ్‌లు, ఆలయం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం కాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనను సన్మానించి, తీర్ధప్రసాదం అందజేశారు.

ఆశించినమేర పనులు జరగలేదు..1
1/1

ఆశించినమేర పనులు జరగలేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement