శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

May 23 2025 3:16 PM | Updated on May 23 2025 3:16 PM

శుక్ర

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేసింది. తర్వాత జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాలకు సంబంధించి.. నడికూడ (హనుమకొండ జిల్లా), వర్ధన్నపేట (వరంగల్‌), వెంకటాపురం (ములుగు), దంతాలపల్లి (మహబూబాబాద్‌), స్టేషన్‌ఘన్‌పూర్‌ (జనగామ), రేగొండ (జేఎస్‌ భూపాలపల్లి) మండలాలను ‘పైలట్‌’గా ఎంచుకున్నారు. ఆరు మండలాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. భూభారతి సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలనలపై ‘గ్రౌండ్‌ రిపోర్ట్‌’.

సాక్షిప్రతినిధి, వరంగల్‌

20 ఏళ్ల నుంచి ఇప్పటికీ పట్టాకాలేదు..

సర్వేనంబర్‌ 161లో 1–01 ఎకరం భూమి ఉంది. మా తండ్రి వాటా కింద 20 ఏళ్ల కింద ఇచ్చిన భూమి ఇప్పటికీ నా పేరు మీద పట్టా కాలేదు. రెవెన్యూ అధికారులు మోకా మీదికి రాకుండానే గ్రామ పంచాయతీలో రికార్డులు చూసి గత పహాణీల్లో నీ పేరు లేదు కాబట్టి పట్టా చేయమని చెప్పారు. తాతలిచ్చిన ఆస్తులకే పట్టాలు చేయడం లేదు. గత ప్రభుత్వం ధరణిలో చేయకపోవడం వల్ల భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకున్నా.

– శెట్టి సంపత్‌, వెంకటాపురం(ఎం)

పాస్‌ బుక్‌ కోసం అర్జీ పెట్టుకున్నా..

నాకు రామన్నగూడెం శివారులో 24 గుంటల అసైన్డ్‌ భూమి ఉంది. గత ప్రభుత్వంలో సర్వే నిర్వహించారు. కానీ, ఇప్పటివరకు పట్టా కాలేదు. భూభారతి సదస్సులో పట్టా పాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేశా.

– జంగేటి సంజీవ్‌, రామన్నగూడెం, రేగొండ మండలం

వారసత్వ భూమి పట్టా కోసం అర్జీ పెట్టినం..

జాలుబావుల్లో సర్వేనంబర్‌ 58, 67, 68లో రెండెకరాల 10 గుంటలు చెలుక నా పేరు, మా అన్న కొండ లింగయ్య పేర్లపై పట్టా కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. అప్పుడు ధరణిలో చేయకపోవడం వల్ల భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకున్నం. మా తాత వారసత్వంతో పాటు కొన్న భూమి కూడా ఉంది.

– కొండ భూపాల్‌, రైతు, దంతాలపల్లి

భూభారతితో సత్వర పరిష్కారం..

భూభారతి చట్టంతో భూసంబంధిత సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటికే నలభై శాతానికి పైగా పరిష్కరించాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు భూభారతి దరఖాస్తులపై ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నాం. మొదట పైలట్‌ప్రాజెక్టుగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో పూర్తి చేస్తున్నాం.

– వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌

పైలట్‌ మండలాల వారీగా ఇదీ పరిస్థితి..

హనుమకొండ జిల్లా నడికూడలో రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 2,695 అర్జీలు రాగా, సదస్సులు ముగిశాక 203 అర్జీలు తహసీల్దారు కార్యాలయంలో రైతులు అర్జీలు పెట్టుకున్నారు. మొత్తం 2,898 అర్జీల్లో అత్యధికంగా 1,456 సాదాబైనామా, 481 అసైన్డ్‌ సవరణ, 331 డీఎస్‌ పెండింగ్‌, 223 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడా తదితర అంశాలపై అర్జీలు అందగా.. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి.

వరంగల్‌ జిల్లాలో భూభారతి పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికై న వర్ధన్నపేట మండలంలో 3,197 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో 2,917 దరఖాస్తులు రాగా.. తహసీల్దార్‌ కార్యాలయంలో 280 దరఖాస్తులు రైతులు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా 1,415 సాదాబైనామాలు రాగా.. ఆతర్వాత అసైన్డ్‌ భూములకు సంబంధించి 746 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వ భూమార్పిడి కోసం ఏకంగా 192 దరఖాస్తులు వచ్చాయి. ఉన్న భూమి కంటే తక్కువ నమోదైనవారు 155 మంది ఉన్నారు.

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో సదస్సులు ముగిసినప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. మొత్తం 1,068 దరఖాస్తులు వచ్చినట్లు అఽధికారులు చెబుతున్నారు. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 40శాతానికి పైగా.. సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారంలో సత్ఫలితాలు వస్తున్నాయని అఽధికారులు, రైతులు చెబుతున్నారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4,555 దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసినప్పటికీ తహసీల్దార్‌ కార్యాలయంలో పలువురు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని పట్టా భూముల్లో ఉన్న సమస్యలను 40 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.

జేఎస్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 7,111 దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 30 శాతానికిపైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు, రైతులు చెబుతున్నారు.

న్యూస్‌రీల్‌

అంశాలు, జిల్లాల వారీగా అర్జీల వివరాలు..

అంశాలు హనుమకొండ వరంగల్‌ భూపాలపల్లి జనగామ ములుగు మానుకోట

సాదాబైనామా 1,456 1,415 1,999 422 2,801 246

అసైన్డ్‌ 481 746 1,362 35 732 60

వారసత్వ మార్పిడి 223 192 290 140 430 56

భూ విస్తీర్ణంలో తేడాలు 134 155 338 84 101 101

డీఎస్‌ పెండింగ్‌ 331 45 247 29 100 20

మ్యుటేషన్‌పెండింగ్‌ 16 33 06 41 20 23

మిస్సింగ్‌ సర్వే నంబర్లు 08 30 23 05 100 37

ఇనామ్‌–ఓఆర్‌సీ జారీ 119 28 00 07 01 07

భూ వివరణ 00 22 01 11 203 02

భూ సేకరణ 14 05 08 23 03 29

పేరు సరిచేయుట 21 04 19 11 21 22

నిషేధిత జాబితా నుంచి

తొలగించేందుకు 07 01 03 19 24 10

38 –ఈ ధ్రువపత్రం 00 01 00 00 19 00

ఇతర దరఖాస్తులు 88 520 2815 241 00 213

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 20251
1/7

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 20252
2/7

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 20253
3/7

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 20254
4/7

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 20255
5/7

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 20256
6/7

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 20257
7/7

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement