ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

May 23 2025 3:16 PM | Updated on May 23 2025 3:16 PM

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులు, రైస్‌మిల్లర్లతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాల్లో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 25,923 మంది రైతుల నుంచి 1,22 372 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు అందుబాటులో గన్నీ సంచులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవాలని సూచించారు. 83 మిల్లులను ట్యాగింగ్‌ చేసి, కొనుగోలు సెంటర్ల కేంద్రాల ధాన్యాన్ని రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అదనంగా లారీలను కేటాయించి రవాణా చేయించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీఓ నీరజ, డీఏఓ అనురాధ, డీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.

కాల్‌సెంటర్‌ను వినియోగించుకోవాలి..

ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను జిల్లాలోని రైతులు వినియోగించుకోవాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో కోరారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, సేకరణ, రవాణా, మద్దతు ధర, సమాచారం, ఇతర ఫిర్యాదుల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్‌ 180042 53424కు కాల్‌ చేయాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement