
ముంపునకు గురికాకుండా చర్యలు చేపట్టండి
క్షేత్రస్థాయిలో మేయర్, ఎమ్మెల్యే,
కమిషనర్ పర్యటన
హసన్‌పర్తి: వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. 55, 56వ డివిజన్లలోని జవహర్ కాలనీ, పోచమ్మ గుడి, గోపాలపురం చెరువు, నక్షత్ర కాలనీ ప్రాంతాల్లో వారు పర్యటించారు. నాలాల్లో చేపట్టనున్న పూడిక పనుల ప్రక్రియను పరిశీలించారు. వడ్డేపల్లి మత్తడి నుంచి వచ్చే నాలా జవహర్‌నగర్ వద్ద ముంపునకు గురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానికుల కోరిక మేరకు గోపాలపురం చెరువును శుభ్రం చేసి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరలోనే వడ్రా..
హైడ్రా తరహాలో ఇక్కడ వడ్రా అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు తెలిపారు. శిఖం, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్‌కుమార్, జక్కుల రజిత, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, గడ్డం శివరాం, మణీంధర్‌నాథ్, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, సంతోశ్‌బాబు, డీఈలు రవికిరణ్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.