
రైతులకు ‘విశిష్ట గుర్తింపు’
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్‌తో సమానమైన ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలని నిర్ణయించింది. ఈమేరకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ పథకం’ను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించనున్నారు. ఇందులో భాగంగా.. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెలాఖరు వరకు దాదాపుగా రైతులందరినీ ఫార్మర్ రిజిస్ట్రీ పథకంలో నమోదు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ముందుకు సాగుతోంది.
వివరాలన్నీ ఒకే చోట
హనుమకొండ జిల్లాలో దాదాపు 1.56 లక్షల మంది, వరంగల్ జిల్లాలో 1.56 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈకార్యక్రమాన్ని ఇటీవల చేపట్టారు. ‘అగ్రి స్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక యాప్ ద్వారా రైతుల పేర్లు నమోదు చేిసి ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నారు. కాగా.. ఈవిశిష్ట నంబర్‌తో కూడిన కార్డుకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూయాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొంది. హనుమకొండ జిల్లాలోని రైతులు ఏఈఓలను కలిసి వివరాలు అందించాలని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్‌సింగ్ కోరుతున్నారు.
కార్డులు అందజేయనున్న ప్రభుత్వం
ముమ్మరంగా సాగుతున్న నమోదు
కేంద్ర పథకాలకు ఇకపై ఇదే
ప్రామాణికం