
అమ్మవారికి భద్రపీఠసేవ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీభద్రకాళి దేవాలయంలో అమ్మవారికి ఉదయం భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవలతో పాటు డోలోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శ్రీకుడాశ్రీ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నాయిని అమరేందర్‌రెడ్డి, నాయిని లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సారయ్య అమ్మవారి ఉత్సవమూర్తికి బంగారంతో చేయించిన వడ్డానాన్ని బహుకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు.
హాస్టళ్లకు జాయింట్ డైరెక్టర్ల నియామకం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని రెండు హాస్టళ్లకు జాయింట్ డైరెక్టర్లను నియమించినట్లు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం తెలిపా రు. టూరిజం మేనేజ్‌మెంట్ పార్ట్‌టైం లెక్చరర్ డా క్టర్ కె.నాగేశ్వర్‌రావును గణపతిదేవ హాస్టల్–2, 3 బ్లాక్‌లకు, టూరిజం మేనేజ్‌మెంట్ పార్ట్‌టైం లెక్చరర్ డాక్టర్ ఎం.కృష్ణసుమంత్‌ను డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ హాస్టల్‌కు నియమించారు. ఈమేరకు వీరికి వీ సీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య ఎల్‌పీ.రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఇంటర్‌లో అడ్మిషన్లు
పెంచేందుకు కెరియర్ క్యాంపులు
న్యూశాయంపేట: ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పెంచేందుకు కెరియర్ క్యాంపులు నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడతూ.. గత విద్యాసంవత్సరంలో జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో ఏయే కళాశాలలో తక్కువ శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందుకు గల కారణాలు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని సూచించారు. ఇంటర్‌బోర్డు నియమ నిబంధన మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు ఫైర్ సేప్టీ తదితర సర్టిఫికెట్టు తప్పనిసరిగా పొందాలన్నారు.
మూడు లే–ఔట్‌లకు అనుమతులు
న్యూశాయంపేట: మూడు లే–ఔట్ అనుమతులు జారీ చేస్తూ లేఔట్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన లేఔట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో జీడబ్ల్యూఎంసీ పరిధిలో మూడు లేఔట్ అనుమతుల కోసం ప్రతిపాదన రాగా.. వాటిని కమిటీ నిబంధనలు అనుసరించి పరిశీలించి, సమావేశంలో చర్చించి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీటీసీపీ జ్యోతి, సిటీ ప్లానర్ రవీందర్, జిల్లా పంచాయతీ రా జ్ అధికారి ఇజ్జగిరి పాల్గొన్నారు.

అమ్మవారికి భద్రపీఠసేవ

అమ్మవారికి భద్రపీఠసేవ