
సెకండియర్ బోధన చేయలేమని..
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో విద్యా బోధన అందించలేమని, ఇతర కళాశాలల్లోకి వెళ్లాలని హనుమకొండ నయీంనగర్‌లోని ఆర్‌డీ జూనియర్ కళాశాల యాజమాన్యం తెలిపిందని ఆ కళాశాల విద్యార్థులు తెలిపారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు వచ్చారు. ఆర్‌డీ కళాశాలలో ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యాబోధన అందిస్తున్నారని, తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రావడం లేదని, ద్వితీయ సంవత్సరం ఇతర కాలేజీల్లో చేరాలని అధ్యాపకులు చెప్పారని వివరించారు. తాము ఏ కాలేజీలో చేరాలో అర్థం కావడం లేదని, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.