
బహిరంగ మద్యపానంపై పోలీసుల దాడులు
వరంగల్ క్రైం: నగరంలోని వైన్‌షాపుల ఎదుట బహిరంగ మద్యపానంపై పోలీసులు మంగళవారం కొరఢా ఝులిపించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వైన్‌షాపు పర్మిట్‌రూమ్‌లో కాకుండా పక్కన వీధులు, సమీప షాపులు, గృహాల ఎదుట మందుబాబులు సిట్టింగ్ వేస్తున్నారు. దీంతో అక్కడి నుంచి వెళ్లే మహిళలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వైనంపై ఈ నెల 4వ తేదీన ‘రోడ్లు, దుకాణాలే సిట్టింగ్ సెంటర్లు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన సుబేదారి పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. సుబేదారి పరిధిలోని అన్ని వైన్‌షాపుల వద్ద బహిరంగ మద్యపానం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేశారు. పర్మిట్‌రూంలలోనే మందుబాబులు మద్యం సేవించేలా చూడాలని వైన్‌షాపు నిర్వాహకులను హెచ్చరించారు.