
జగ్గారెడ్డి బట్టలు ఊడగొట్టడం ఖాయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి
హన్మకొండ: ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు నోరు జారీ మాట్లాడితే పార్టీ కార్యకర్తలు జగ్గారెడ్డి బట్టలు ఊడగొట్ట డం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొల ను సంతోష్ రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు అన్నారు. బుధవారం హనుమకొండ దీన్‌దయాల్ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడారు. ఇటీవల సినిమా తీస్తున్న జగ్గారెడ్డికి మతి భ్రమించిందని, పూర్తిగా విలన్‌లా ప్రవర్తిస్తున్నాడన్నారు. గతంలో రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలే ఆయనను ఓడించిందని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్‌ను విమర్శించడం అర్థరహితమన్నారు. బీజేపీ నాయకులు రావు పద్మ, వన్నాల శ్రీరాములు,డాక్టర్ కాళీప్రసాద్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూలగొట్టడంపై నిలదీసిన ఈటల రాజేందర్‌పై జగ్గారెడ్డి నోరు పారేసుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలను వారు తి ప్పికొట్టారు. సమావేశంలో నాయకులు గజ్జెల్లి శ్రీరా ములు, సండ్ర మధు, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.