ఇన్‌చార్జ్‌ సీఎండీలతో ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జ్‌ సీఎండీలతో ఇబ్బందులు

May 21 2025 1:05 AM | Updated on May 21 2025 1:05 AM

ఇన్‌చ

ఇన్‌చార్జ్‌ సీఎండీలతో ఇబ్బందులు

టీఎస్‌ఈఈయూ –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌

హన్మకొండ: టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్‌కోలో ఇన్‌చార్జ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌ అన్నారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని టీఎస్‌ఈఈయూ–327 కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు గ్రహీతల సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థల్లో డైరెక్టర్ల నియామకంలో జాప్యంతో పాలనాపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ తాను ఈ కార్యక్రమం నుంచి విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడానని, నాలుగైదు రోజుల్లో సమయం ఇస్తానని చెప్పారన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలు పి.మహేందర్‌ రెడ్డి, నీలం ఐలేశ్‌, సురేశ్‌ కుమార్‌ను ఎమ్మె ల్యే నాయిని, ఇనుగాల శ్రీధర్‌, నాయకులు సన్మానించారు. పీసీసీ నాయకుడు ఈ.వి.శ్రీనివాస్‌ రావు, టీఎస్‌ఈఈయూ–327 టీజీ ఎన్పీడీసీఎల్‌ సెక్రటరీ కొండూరి శ్రీనివాస్‌, భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, నరేందర్‌ రెడ్డి, మాధవ రావు, చిట్ల ఓదేలు, బుచ్చయ్య గౌడ్‌, జశ్వంత్‌ కుమార్‌, సదయ్య, శ్రీనివాస్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

కొత్త సబ్‌స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి

హన్మకొండ: కొత్త సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్లు, నోడల్‌ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ 16 సర్కిళ్ల పరిధిలో పురోగతిలో ఉన్న ఇంటర్‌ లింకింగ్‌ లైన్ల పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రేక్‌ డౌన్స్‌, ట్రిప్పింగ్స్‌ లేకుండా ప్రతీ నెల ఫీడర్ల నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రీ మాన్సూన్‌ తనిఖీలు అన్ని ఫీడర్లలో చేపట్టాలని, తద్వారా అంతరాయాలు తగ్గుతాయన్నారు. సబ్‌ స్టేషన్ల నిర్వహణ చేసే సమయంలో అంతరాయం లేకుండా వేరే సబ్‌ స్టేషన్‌ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్లు బి.అశోక్‌ కుమార్‌, టి.సదర్‌ లాల్‌, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్‌, సీఈలు కె.తిరుమల్‌ రావు, రాజుచౌహాన్‌, అశోక్‌, వెంకట రమణ, జీఎంలు వేణు బాబు, దేవేందర్‌, కృష్ణమోహన్‌, వెంకటకృష్ణ, శ్రీనివాస్‌, సత్యనారాయణ, సురేందర్‌, ఉత్తమ్‌, తదితరులు పాల్గొన్నారు.

పీజీ పరీక్షలు షురూ

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆ దిలాబాద్‌ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్‌ ప్రొఫెషనల్‌) రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ కొందరు విద్యార్థులు మంగళవారం ఉదయం కేయూలోని పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసుల చొరవతో వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ మనోహర్‌ విద్యార్థులతో చర్చించారు. త్వరగా పరీక్షలు జరిగితే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. టైంటేబుల్‌ ప్రకారం మధ్యాహ్నం 2గంటల నుంచి యథావిధిగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కేయూ పరిధిలో 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు. వీరి వెంట పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ బీఎస్‌ఎల్‌ సౌజన్య, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ మనోహర్‌, ఆర్ట్స్‌ కాలేజీ పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్‌ జ్యోతి ఉన్నారు.

రేపటి నుంచి జిల్లా స్థాయి బాక్సింగ్‌ ఎంపికలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈనెల 22వ తేదీన జూనియర్స్‌ బాలబాలికల ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి బాక్సింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.రాజేందర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2009 నుంచి డిసెంబర్‌ 31, 2010 మధ్య జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆధార్‌, స్కూల్‌ బోనోఫైడ్‌, జనన ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌లతో పాటు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో పాటు రూ.300 ఎంట్రీ ఫీజుతో ఉదయం 7గంటలకు హనుమకొండలోని డీఎస్‌ఏ బాక్సింగ్‌హాల్‌ నందు హాజరు కావాలని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 24వ తేదీన మంచిర్యాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

ఉదయం కేయూలో విద్యార్థుల ధర్నా

మధ్యాహ్నం నుంచి యథావిధిగా ఎగ్జామ్స్‌

ఇన్‌చార్జ్‌ సీఎండీలతో ఇబ్బందులు1
1/3

ఇన్‌చార్జ్‌ సీఎండీలతో ఇబ్బందులు

ఇన్‌చార్జ్‌ సీఎండీలతో ఇబ్బందులు2
2/3

ఇన్‌చార్జ్‌ సీఎండీలతో ఇబ్బందులు

ఇన్‌చార్జ్‌ సీఎండీలతో ఇబ్బందులు3
3/3

ఇన్‌చార్జ్‌ సీఎండీలతో ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement