కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల రెండో, ఆరో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకా రం జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికా రి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. హనుమకొండలో పలు పరీక్షా కేంద్రాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం,పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, వెంకటయ్య సందర్శించి పరిశీలించారు.
చిరు వ్యాపారులను ఆగం చేయొద్దు
రామన్నపేట: సుందరీమణుల ఓరుగల్లు పర్యటనలో భాగంగా రోడ్ల వెంట ఉన్న చిరువ్యాపార సముదాయాలను తొలగించి ఆ వ్యాపారుల జీవితాలను ఆగం చేయొద్దని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో పలు కూడళ్లలో చిరు వ్యాపారుల సముదాయాలను కూల్చినందుకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఓరుగల్లు చరిత్రను విశ్వవ్యాప్తం చేయడంపై తాము వ్యతి రేకం కాదని, కానీ సుందరీమణులు వస్తున్నారని పండ్ల వ్యాపారులు, చిన్నచిన్న ఉపాధి దుకాణాలు తొలగించి వారి జీవితా ల ను రోడ్డునపడేయడం దుర్మార్గమన్నారు. అ నంతరం ఎంజీఎం కూడలిలో నాయకులు మా నవహారం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రే టర్ వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, సిద్ధం రాజు, మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, ఇమ్మడి లోహిత రాజు, నాగేశ్వర్‌రావు, నాయకులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య బోధించాలి
మామునూరు: ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యబోధన చేయాలని ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ కోలా ఆనంద కిషోర్, డీఈఓ జ్ఞానేశ్వర్ సూచించారు. ఈమేరకు వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజులు జిల్లాస్థాయి ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని బుధవారం వారు ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. రాష్ట్రస్థాయి పరిశీలకులు డాక్టర్ కందాల రామయ్య డాక్టర్ కె.శ్రీనివాస్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీసీఈవి సెక్రటరీ జి.కృష్ణమూర్తి, ఎంఎంఓ సుజన్ తేజ, కోర్సు ఉప సంచాలకులు వెంకటేశ్వరరావు, రిసోర్స్ పర్సన్స్ తాటి పాముల రమేష్, సంపత్, అశోక్, శ్రీనివాస్, కొమురయ్య, ఆనందమోహన్ పాల్గొన్నారు.
శిక్షణకు హాజరుకాని 21 మంది టీచర్లకు షోకాజ్ నోటీసు
విద్యారణ్యపురి: ఖిలావరంగల్ మండలంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఐదు రోజులపాటు జరిగే శిక్షణకు హాజరుకాని 21 మంది ఉపాధ్యాయులకు వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ షోకా జ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 596మంది ఉ పాధ్యాయులు శిక్షణకు హాజరుకావాల్సిఉంది. అందులో 21మంది టీచర్లు శిక్షణకు హాజరు కాలేదని గుర్తించారు. వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సృజన్‌తేజ బుఽ దవారం తెలిపారు. శిక్షణకు ఎందుకు హాజరు కాలేదో ఒక్కరోజులో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తు నిట్ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పీజీ కోర్సుల్లో ఎంటెక్, ఎమ్మెస్సీల్లో ప్రవేశానికి గాను జూన్ 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు ccmt2025 helpdesk@ nitw లేదా ccmn2025 helpdesk@ nitw లో సంప్రదించాలని పేర్కొన్నారు.

కేయూ డిగ్రీ పరీక్షలు షురూ