
పరీక్షల బోర్డు నిబంధనలు పాటించాలి
విద్యారణ్యపురి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం వరంగల్ జిల్లాకు సంబంధించి హనుమకొండలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో స్క్వాడ్ బృందాలతో నిర్వహించిన సమావేశంలో డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ పాల్గొని మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా స్క్వాడ్‌ల బృందాలు తనిఖీలు చేపట్టాలన్నారు. వరంగల్ జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 5,200 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక ప్లయింగ్‌స్కాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసమావేశంలో డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 12,063 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,453 మంది పరీక్షలు రాయనున్నట్లు డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. ఈపరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ