
కానిస్టేబుల్‌కు అభినందనలు
రామన్నపేట: వృత్తి ధర్మంలో భాగంగా మానవత్వం చాటుకున్న ఓ కానిస్టేబు ల్ మంచి మనస్సును ప్రజలు అభినందించారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ గోపాలస్వామి గుడి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దుస్తులు కూడా సరిగ్గా లేక ఎండవేడి తట్టుకోలేక పడిపోగా, స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ కల్యాణ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాధిత వ్యక్తికి దుస్తులు తెప్పించి తొడిగి 108 వాహనాన్ని పిలిపించి ఎంజీఎం ఆస్పత్రికి వైద్యం కోసం తరలించాడు. ఇదంతా గమనించిన స్థానికులు సదరు కానిస్టేబుల్ స్పందించి సహాయం చేసిన తీరుకు అభినందనలు తెలిపారు.