
బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలి
రామన్నపేట : బీసీలు రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ మేధావుల వేదిక స్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా వేదిక అధ్యక్షుడు వీరస్వామి అధ్యక్షత ఐఎంఏ హాల్‌లో బీసీల రాజకీయ నాయకత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం ఉన్నప్పటికి, ఇప్పటికీ అన్ని రంగాల్లో బీసీలు సముచిత స్థానం నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అనంతరం బీసీ మేధావుల వేదిక వరంగల్, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, ఐఎంఏ గైనకాలజీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మి, కూరపాటి రాధికను ప్రతినిధులు సన్మానించారు. మండల పరుశురాములు, ధర్మపురి రాజగోవిందు, జంగిలి శ్రీనివాస్, పెండెం సంపత్‌కుమార్, జోనాతన్, సూర్యకిరణ్, రాములు, రాజు, ప్రొఫెసర్లు పురుషోత్తం, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ మేధావుల వేదిక స్థాపక అధ్యక్షుడు చిరంజీవులు