
అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు
హన్మకొండ: సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గురువారం రాత్రి హనుమకొండ రాంనగర్‌లోని స్వగృహంలో వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన 13 డివిజన్ల బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వెంటనే దాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో చేపట్టకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీనియర్ నాయకులు ఎల్లావుల లలితా యాదవ్, బుద్దె వెంకన్న, చింతల యాదగిరి, బండి రజనీ కుమార్, రాజు నాయక్, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్