
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 143 అర్జీలు రాగా.. అందులో జీడబ్ల్యూఎంసీ 16, హౌసింగ్ పీడీ 13, తహసీల్దార్ కాజీపేట 9, తహసీల్దార్ ఎల్కతుర్తి 7, మిగతావి వివిధ శాఖలకు వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలి:
అదనపు కలెక్టర్ సంధ్యారాణి
న్యూశాయంపేట: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 119 దరఖాస్తులు రాగా.. వాటిని పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ 35, హౌసింగ్ 42 దరఖాస్తులు, మిగిలినవి ఇతర శాఖలకు వచ్చాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ మాట్లాడుతూ.. జిల్లాలోని వ్యవసాయ భూములను మండల అధికారి కార్యాలయం లేదా రైతు వేదికల్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై
143 అర్జీలు

అర్జీలు వెంటనే పరిష్కరించాలి