డబుల్‌ ధమాకా | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా

May 12 2025 12:42 AM | Updated on May 12 2025 12:42 AM

డబుల్

డబుల్‌ ధమాకా

సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025

కాజీపేట అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌ ఆర్వో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్లాట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి 48 సాధారణ స్లాట్‌ బుకింగ్స్‌తో పాటు 5 ప్రత్యేక స్లాట్స్‌ ఉండగా.. వరంగల్‌ ఆర్‌ఓకు డబుల్‌ ధమాకాలో భాగంగా.. ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లకు 96 స్లాట్స్‌తో పాటు ప్రత్యేక స్లాట్స్‌ 10 కేటాయించనున్నారు. సోమవారం(నేడు) నుంచి డబుల్‌ స్లాట్‌ ప్రారంభం కానుంది.

15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌

కోరుకున్న సమాయానికి, కోరుకున్న తేదీన కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకుని దస్తావేజులను సైతం భూక్రయవిక్రయదారులు పొందేందుకు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ గత నెల 10న స్లాట్‌ బుకింగ్స్‌ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని వరంగల్‌ ఫోర్ట్‌, వరంగల్‌ రూరల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసింది. వరంగల్‌ ఆర్వోలో జాయింట్‌–1, జాయింట్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా కలిగి ఉంటుంది. దీంతో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు విధులు నిర్వహించనున్నారు. మిగతా వాటిల్లో కేవలం ఒక్క సబ్‌ రిజిస్ట్రార్‌ మాత్రమే అందుబాటులో ఉంటారు.

నాలుగు కార్యాలయాల్లో ‘స్లాట్‌’ సిస్టం

వరంగల్‌ ఆర్వో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంతో పాటు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, నర్సంపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఈనెల 12 నుంచి స్లాట్‌ బుకింగ్స్‌ సిస్టమ్‌ ప్రారంభం కానుంది. రోజూ 48 స్లాట్‌ బుకింగ్స్‌.. ఇందులో ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 1 గంట వరకు 24, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 వరకు 24 స్లాట్‌ బుకింగ్స్‌ సాధారణ ప్రజలకు, సాయంత్రం 5 నుంచి 6 వరకు దివ్యాంగులకు, వయోవృద్ధులకు, పేషెంట్లకు మరో 5 స్లాట్‌ బుకింగ్స్‌ అవకాశం కల్పించారు.

సమయానికి రావొచ్చు..

స్లాట్‌ బుకింగ్‌ సదుపాయంతో ఆన్‌లైన్‌లో ఎంచుకున్న సమయానికి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి భూ క్రయవిక్రయదారులు రానున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తవ్వగానే దస్తావేజులు చేతికందుతాయి. స్లాట్‌ బుకింగ్స్‌తో భూక్రయవిక్రయదారులతో పాటు కార్యాలయ సిబ్బందికి సమయ పాలన అలవాటవుతుంది.

– ఆనంద్‌, సబ్‌రిజిస్ట్రార్‌, వరంగల్‌ ఆర్‌ఓ

న్యూస్‌రీల్‌

వరంగల్‌ ఆర్వోలో ‘డబుల్‌ స్లాట్‌ బుకింగ్స్‌’

నేటి నుంచి ప్రారంభం

భూక్రయవిక్రయదారులకు

తప్పనున్న తిప్పలు

తప్పనున్న తిప్పలు..

వరంగల్‌ ఆర్‌ఓ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రోజూ 160 నుంచి 180 దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా దస్తావేజుల మ్యుటేషన్‌, స్కానింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే.. స్లాట్‌ బుకింగ్‌ సిస్టంతో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు దస్తావేజులు చేతికందే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో రాత్రి 8 గంటల వరకు సైతం రిజిస్ట్రేషన్లు జరిగేవి. దీంతో అధికారులతో పాటు భూక్రయవిక్రయదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

డబుల్‌ ధమాకా1
1/3

డబుల్‌ ధమాకా

డబుల్‌ ధమాకా2
2/3

డబుల్‌ ధమాకా

డబుల్‌ ధమాకా3
3/3

డబుల్‌ ధమాకా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement