
మనకంటూ ఓ బ్రాండ్ వచ్చేలా..
నిర్మల్, పోచంపల్లి వంటి ప్రాంతాలకు వచ్చిన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేలా వెదురు బొంగులతో ప్రత్యేక అందాలను ఇచ్చేలా బొమ్మలను తయారు చేయిస్తున్నాం. రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చే అందాల తారలకు బహుమతులుగా ఇవ్వాలా? స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలా? అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30 మంది మహిళలకు 20 రోజులపాటు శిక్షణ ఇచ్చాం. వారు తయారుచేసిన బొమ్మలు చూడముచ్చటగా, సహజసిద్ధంగా ఉన్నాయి. కచ్చితంగా అందరినీ ఆకర్షిస్తాయని భావిస్తున్నాం.
– రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్‌ఓ, ములుగు