శ్వేతార్కుడిని దర్శించుకున్న న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శ్వేతార్కుడిని దర్శించుకున్న న్యాయమూర్తి

May 8 2025 12:33 AM | Updated on May 8 2025 12:33 AM

శ్వేతార్కుడిని దర్శించుకున్న న్యాయమూర్తి

శ్వేతార్కుడిని దర్శించుకున్న న్యాయమూర్తి

కాజీపేట: కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి దివ్య క్షేత్రాన్ని తెలంగాణ లోకాయుక్త న్యాయమూర్తి బీఎస్‌ జగ్‌ జీవన్‌కుమార్‌ దంపతులు బుధవారం సందర్శించారు. ఆలయ ఆవరణలో కొలువుదీరిన శ్వేతార్కుడితో పాటు 29 దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంత కు ముందు ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మ వారికి స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామి వారి చిత్రపటం, శేష వస్త్రాలతో సన్మానించారు.

మే 12న ఫార్మసీ

ఆఫీసర్స్‌ ఫలితాలు

ఎంజీఎం: ఫార్మసీ ఆఫీసర్స్‌ ఫలితాలు ఈనెల 12న ప్రకటించనున్నట్లు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూమెంట్‌ బోర్డు చైర్మన్‌ గోపికాంత్‌రెడ్డి తెలిపినట్లు తెలంగాణ గవర్నమెంట్‌ ఫార్మసీ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (టీజీపీఓఏ) సెంటర్‌ కమిటీ అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం రిక్రూమెంట్‌ బోర్డు చైర్మన్‌ను కలిసిన టీజీపీఓఏ నాయకులు ఫార్మసీ ఫలితాల ప్రకటనపై చర్చించారు. దీనిపై బోర్డు చైర్మన్‌ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సమావేశంలో టీజీపీఓఏ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కంద కట్ల శరత్‌ బాబు, అడ్వైజర్‌ అహ్మద్‌ ఉల్లాఖాన్‌, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, వరంగల్‌ జిల్లా సెక్రటరీ అవినాష్‌, రాష్ట్ర కమిటీ నాయకులు జహీర్‌, విజయ్‌ కుమార్‌, రాజు, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

జూనియర్‌

సివిల్‌ జడ్జిలకు సన్మానం

వరంగల్‌ లీగల్‌: ఇటీవల వెలువడిన జూని యల్‌ సివిల్‌ జడ్జి ఫలితాల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన న్యాయవాదులు గంగిశెట్టి ప్రసీద, అంబటి ప్రణయ, దార సాయిమేఘన తొలి ప్రయత్నంలోనే ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని అంబేడ్కర్‌ హాల్‌లో వారిని వరంగల్‌, హనుమకొండ జిల్లా ల బార్‌ అసోసియేషన్లు సంయుక్తంగా సన్మానించారు. కార్యక్రమానికి అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్‌, పులి సత్యనారాయణ, జనరల్‌ సెక్రటరీలు డి.రమాకాంత్‌, కొత్త రవి, ఇతర బాధ్యులు మైదం జయపాల్‌, ముసిపట్ల శ్రీధర్‌గౌడ్‌, రేవూరి శశిరేఖ, శివప్రసాద్‌, కిషోర్‌కుమార్‌, బైరపాక జయాకర్‌, సీనియర్‌ న్యాయవాదులు అంబరీష్‌ రావు, వద్దిరాజు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

17 నుంచి ఎంబీఏ

నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాల్గవ సెమిస్టర్‌(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) పరీక్షలు ఈనెల 17 నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసిమ్‌ ఇక్బాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు ఉంటాయని, పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

20 నుంచి పీజీ కోర్సుల

సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పీజీ నాన్‌ప్రొఫెషనల్స్‌ కోర్సుల రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రఽణాధికారి సౌజన్య తెలిపారు. పీజీకోర్సులు ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ, జర్నలిజం మాస్‌కమ్యూనికేషన్‌, ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సైకాలజీ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఎంఎస్‌డబ్లూ, ఎంహెచ్‌ఆర్‌ఎం తదితర కోర్సుల సెకండియర్‌ రెండో సెమిస్టర్ల పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంటు)ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement