
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని మీసేవ కేంద్రాల్లో శిక్షణ కోసం దరఖాస్తులు చేయవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 50 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుకు ఈనెల 17 వరకు గడువు ఉందని, వివరాలకు 9704443476, 9398987337 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుకు నేడు చివరి గడువు
న్యూశాయంపేట: జిల్లా పరిశ్రమల కేంద్రంలో సంస్థాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు కాంట్రాక్ట్ పద్ధతిలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి శని వారం ఆఖరు తేదీ అని వరంగల్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె.రమేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు www. nimsme.gov.inలో సంప్రదించాలని సూచించారు.
కళాశాలలో ప్రవేశానికి కౌన్సెలింగ్
న్యూశాయంపేట: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రీజినల్ కో–ఆర్డినేటింగ్ ఆఫీసర్ డీఎస్.వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ(జి), పాలకుర్తి(జి), పర్వతగిరి(జి), మూడుచెక్కలపల్లి(జి), నర్సంపేట(బాలుర) కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సీట్లు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తికలిగి పదో తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ఈనెల 15న వరంగల్ నగరంలోని యాకూబ్‌పురలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 94909 57296 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
14 కిలోల గంజాయి పట్టివేత
కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో 14.7 కిలోల ఎండు గంజాయిని శుక్రవారం ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ వేముల చంద్రమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షహనావాస్ కాశీం ఆదేశం మేరకు జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు పర్యవేక్షణలో రైల్వే జంక్షన్‌లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఒడిశా నుంచి వచ్చే రైళ్లలో గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా అందిన ముందస్తు సమాచారం ఆధారంగా రైళ్లలో తనిఖీలు చేపట్టారు. అనంతరం జంక్షన్‌లో ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆగి తనిఖీ చేయగా.. రూ.90 వే లు విలువైన గంజాయి లభించగా కేసు నమోదు చే శారు. ఎస్సై తిరుపతి, ఖలీల్, లాలయ్య, కోటిలింగం, ఆయుర్, రషీద్ పాల్గొన్నారు.
ఇద్దరి దుర్మరణం
మరిపెడ: రెండు బైక్‌లు ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం శివారులో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం బాబోజీగూడెం గ్రామ శివారు వెంకురాం తండాకు చెందిన భూక్య సంతోష్ (30), భోజ్యతండాకు చెందిన గుగులోతు కార్తీక్ (35) స్నేహితులిద్దరు కలిసి గురువారం రాత్రి తండా నుంచి మరిపెడ మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. బావోజీగూడెం శివారు వాగోడ్డుతండాకు చెందిన అజ్మీర సుధీర్ మరో ద్విచక్రహనంపై వారు వెళ్తున్న దారిలో వెళ్తున్నాడు. మరిపెడ మున్సిపాలిటీ సమీపంలోని 365జాతీయ రహదారిపై అతివేగం కారణంగా ఆ రెండు బైక్‌లు పరస్పరం ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. సుధీర్‌కు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అజ్మీరా లాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం