
గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025
● ఈనెల 14న రెండు
బృందాలుగా 57 మంది రాక
● రామప్ప, వరంగల్‌కోట,
వేయిస్తంభాల ఆలయం సందర్శన
● అప్రమత్తమైన అధికార యంత్రాంగం
● అదనపు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
● హైదరాబాద్ కమాండ్
కంట్రోల్‌కు అనుసంధానం
సీసీ కెమెరాల నిఘా..
నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసుశాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 49వేల వరకు ఉన్నాయి. ‘స్మార్ట్‌సిటీ’ నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 750 సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్నారు. అయితే సుందరీమణుల పర్యటన నేపథ్యంలో హరిత కాకతీయ, వరంగల్ కోట, వేయిస్తంభాల ఆలయంతో పాటు కీలక ప్రదేశాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రామప్ప ఆలయ ప్రాంగణం, బయట సుమారు 50నుంచి 70 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించే వీలుగా అనుసంధానం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో ఓరుగల్లులో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, పర్యాటక తదితర శాఖల ఆధ్వర్యాన పర్యాటక ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రధానంగా ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సుందరీమణులకు మూడంచెల పోలీసు భద్రతతో పాటు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ ట్రైసిటీతో పాటు రామప్పలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను వారి పర్యటన ముగిసే వరకు హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) నుంచి కూడా పర్యవేక్షించేలా అనుసంధానం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం నుంచి ఆ దిశగా పనులు ఊపందుకున్నాయి.
హైదరాబాద్ నుంచి రామప్ప, ఓరుగల్లుకు..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే మిస్‌వరల్డ్–2025 పోటీలకు 144 దేశాల నుంచి సుందరీమణులు చేరుకుంటున్న విషయం తెలిసిందే. అందులో 57 మంది రెండు బృందాలుగా ఈనెల 14వ తేదీన రామప్ప, వరంగల్‌లోని వేయిస్తంభాల దేవాలయం, వరంగల్ కోటను సందర్శించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 35 మందితో కూడిన ఓ బృందం హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రామప్పకు వెళ్తుంది. 22 మంది సభ్యుల మరో బృందం అదే సమయానికి బయలుదేరి వరంగల్ హరిత కాకతీయకు చేరుకుంటుంది. వీరికి స్వాగతం పలకడం.. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలను చూపించడం.. కాకతీయ రాజుల పరిపాలన, కళాసంపద, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా దేశాలకు చెందిన సుందరీమణులు నచ్చే, మెచ్చే వంటకాలను కూడా ప్రభుత్వం తరఫున సిద్ధం చేస్తున్నారు. అలాగే హనుమకొండ హరిత కాకతీయకు చేరుకునే 22 మంది సుందరీమణులు, వారి వెంట వచ్చే మరో ఇద్దరు మహిళల కోసం రూమ్‌లు కేటాయించారు. వీరికి మూడంచెల భద్రతలో భాగంగా ఒక్క హరిత కాకతీయ హోటల్ ప్రాంగణంలో సుమారు ఐదువందల మందికి పైగా భద్రతా సిబ్బందిని కేటాయించనున్నట్లు చెబుతున్నారు. వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్పలోనూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
భద్రతపై అధికారుల సమీక్షలు
మిస్ వరల్డ్–2025 పోటీలకు వచ్చే సుందరీమణుల ఓరుగల్లు పర్యటన నేపథ్యంలో వారి భద్రత విషయమై అధికారులు రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, హనుమకొండ, వరంగల్, ములుగు కలెక్టర్‌లు ప్రావీణ్య, సత్యశారద, దివాకర, వివిధ శాఖల ఉన్నతాధికారులు పలుమార్లు భేటీ అయ్యారు. ఇదే సమయంలో మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘాపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
వరంగల్ కోటలో పరిశీలిస్తున్న కలెక్టర్(ఫైల్)
న్యూస్‌రీల్

గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025

గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025