డీసీసీబీని మరింత ప్రగతిలోకి తీసుకెళ్లాలి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు
హన్మకొండ: వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)ని మరింత ప్రగతిలోకి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకు ప్రగతి, బ్రాంచ్‌ల పనితీరును సమీక్షించారు. ఆడిట్ నివేదికను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రుణాలు ఇవ్వడంతో పాటు డిపాజిట్లు సేకరించాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ డీసీసీబీకి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ వచ్చిన సందర్భంగా చైర్మన్ రవీందర్ రావును బ్యాంకు వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు, డీసీఓలు, బ్యాంకు అధికారులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, డైరెక్టర్లు హరిప్రసాద్, ఎన్నమనేని జగన్ మోహన్ రావు, రాజేశ్వర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మాడుగుల రమేశ్, దొంగల రమేశ్, గోపాల్ రావు, యాదగిరి రెడ్డి, నర్సింగ రావు, శ్రీనివాస్, రవిరాజు, నరేందర్, ప్రదీప్ చందర్, డీసీఓ సంజీవ రెడ్డి, నాబార్డ్ డీడీఎం చంద్ర శేఖర్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎం పద్మావతి, టీజీ క్యాబ్ జీఎం సుజాత, డీజీఎం అశోక్, ఏజీఏం రాజు, మేనేజర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్లకు స్థానచలనం
● నాయబ్ తహసీల్దార్లు కూడా..
హన్మకొండ అర్బన్: ఇటీవలహహనుమకొండ జిల్లాకు బదిలీపై వచ్చిన తహసీల్దార్లకు కలెక్టర్ ప్రావీణ్య పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న కొందరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పించారు. వారితోపాటు పలువురు నాయబ్ తహసీల్దార్లకు కూడా స్థానచలనం కల్పించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీల వివరాలు..
భీమదేవరపల్లి తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.ప్రవీణ్‌కుమార్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇటీవల వరంగల్ జిల్లా నుంచి వచ్చిన బి.రాజేశ్‌కు పోస్టింగ్ ఇచ్చారు. వేలేరు తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెచ్.కోమిని కలెక్టరేట్ బదిలీ చేశారు. వేలేరుకు కలెక్టరేట్‌లో సూపరిటెండెంట్‌గా ఉన్న ఏవీఎన్‌వీ ప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చారు. పరకాల ఆర్డీఓ కార్యాలయం డీఏవోగా విధులు నిర్వర్తిస్తున్న టి.విజయలక్ష్మికి పరకాల తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. పరకాల ఆర్డీఓ కార్యాలయం డీఏఓగా కరీంనగర్ నుంచి ఇటీవల వచ్చిన సీహెచ్. రాజుకు పోస్టింగ్ ఇచ్చారు. నడికూడ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.నాగరాజును కలెక్టరేట్‌కు బదిలీ చేసి అక్కడికి తహసీల్దార్‌గా ఇటీవల సిద్దపేట జిల్లా నుంచి వచ్చిన జి.రవీందర్‌రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల బదిలీల్లో ములుగు జిల్లా నుంచి హనుమకొండ జిల్లాకు వచ్చిన తహసీల్దార్ డి.సమ్మయ్యకు కలెక్టరేట్‌లో పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టరేట్ పోస్టింగ్స్ ఇచ్చిన తహసీల్దార్లకు సెక్షన్లు కేటాయించాల్సి ఉంది.
నాయబ్ తహసీల్దార్లు..
జిల్లాలో నాయబ్ తహసీల్దార్లకు కూడా స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. పరకాలలో పనిచేస్తున్న కె.సూర్యనారాయణను జిల్లా కేంద్రంలోని భూసేకరణ విభాగానికి, పౌరసరఫరాల సంస్థలో పనిచేస్తున్న శివతేజను కలెక్టరేట్‌కు, కలెక్టరేట్‌లో పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ను ఐనవోలుకు, పరకాల ఆర్డీఓ ఆఫీస్‌లో పనిచేస్తున్న సుమన్‌ను పరకాల తహసీల్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


