
చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు
హన్మకొండ అర్బన్: యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని మంత్రి త్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, రేషన్‌కార్డులు, బియ్యం పంపిణీపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్‌ఓ వైవీ గణేశ్, డీఆర్‌డీఓ మేన శీను, డీసీఓ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి