కూలిన రాతికోట దక్షిణ ముఖ ద్వారం పైకప్పు
ఖిలా వరంగల్: పడమర కోట నుంచి మధ్యకోటకు వెళ్లే రాతి కోట దక్షిణ ముఖ ద్వారం పైకప్పు (భారీ రాతి స్తంభం) ఒక్కసారిగా కూలింది. ముఖ ద్వారం కింది నుంచి నిత్యం వందలాది మంది స్థానికులు, పర్యాటకులు వస్తూపోతుంటారు. ప్రమాదం పొంచి ఉందని స్థానికులు కేంద్ర పురావస్తుశాఖ అఽధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా రాతి కోట ముఖద్వారం పైకప్పునకు ఏర్పాటు చేసిన రాతి స్తంభం ఒకటి కూలి రెండు ముక్కలైంది. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికై నా రాతి, మట్టికోటల ముఖ ద్వారాలకు మరమ్మతులు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


