
భక్తజన ప్రవాహం
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
రేపటి నుంచి
పీజీ కోర్సుల పరీక్షలు
● 26 పరీక్ష కేంద్రాలు..
4,300 మంది విద్యార్థులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాలో పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్( నాన్ ప్రొఫెషనల్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సౌజన్య ఆదివారం తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ తదితర కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కేయూ పరిధిలో పీజీ కోర్సుల పరీక్షల నిర్వహణకు 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,300 మంది పరీక్షలు రాయనున్నట్లు వారు తెలిపారు.
బాల్య వివాహం అడ్డగింత
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూశాయంపేట ప్రాంతంలో ఆదివారం ఓ కల్యాణ మండపంలో బాలికకు వివాహం జరుగుతున్నట్లు పోలీసులకు అందిన సమాచారంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాలతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు, చైల్డ్‌లైన్ అధికారులు సంయుక్తంగా అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక, యువకుడి తల్లిదండ్రులను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. చిన్నవయస్సులో పెళ్లి చేస్తే తీవ్ర అనర్థాలు కలుగుతాయన్నారు.
అత్యాధునిక వసతులతో
రైల్వే స్టేషన్
ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ తరహాలో అత్యాధునిక హంగులు, వసతులతో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయడం అభినందనీ యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ రైల్వేస్టేష న్‌ను మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, అరూ రి రమేశ్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వేస్టేషన్‌ను ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోదీ పర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రత్న సతీశ్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, తాబేటి వెంకట్‌గౌడ్, బన్న ప్రభాకర్, ఎరుకుల రఘనారెడ్డి, కనుకుంట్ల రంజిత్ కుమార్, గోకే వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
● విధులకు హాజరు కాకుండానే
హాజరైనట్లు సంతకాలు
● చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల
డిమాండ్
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాలాల పూడికతీత పనుల్లో చేతివాటం తంతుగా మారింది. ఇప్పటికే ప్రతీ పనికి ‘నీకింత.. నాకెంత’లా సాగుతున్న పర్సంటేజీల దందాపై కొందరు కార్పొరేటర్లు, జీడబ్ల్యూఎంసీ అధికారులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నగరం వరద ముంపునకు గురికాకుండా ముందస్తుగా చేపట్టే నాలాల పూడికతీత పనుల్లోనూ కమీషన్ల దందా కలకలం రేపుతోంది. ప్రతీసారి ఆలస్యంగా మొదలుపెట్టే ఈ పూడికతీత పనులు సాగుతున్న తీరు చూస్తే నిజంగానే పూడికతీత కోసమా? లేక నిధుల మేత కోసమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా నాలాల క్లీనింగ్ అరకొరగానే సాగుతోంది.
అంచనాలు పెంచి..
కాజీపేట, హనుమకొండ, వరంగల్ ట్రైసిటీస్‌లో ప్రధాన నాలాలతో పాటు అంతర్గత నాలాల పూడికతీత కోసం బల్దియా ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నది. ఆరేళ్లలో సుమారు రూ.9.49 కోట్ల వరకు ఖర్చు చేసిన అధికారులు.. గతేడాది సైతం రూ.2.32 కోట్లు వరకు వెచ్చించారు. అంతకు ముందు సంవత్సరం రూ.1.24 కోట్లుంటే.. చాలాచోట్ల అంచనాలు పెంచి రూ.2.32 కోట్లకు చేర్చారన్న విమర్శలు వచ్చాయి. ప్రధాన నాలాలతో పాటు 42 అంతర్గత నాలాల్లో పూడిక తీతకు డబ్బులు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఆ డబ్బును గ్రేటర్ వరంగల్‌లోని కొందరు ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు అందరినీ ‘సమన్వయం’ చేసి ‘లెక్కలు’ తేలిన పిదపే పనులు ప్రారంభించారన్న చర్చ కూడా ఉంది. ఈసారి కూడా సుమారు కోటిన్నరకు పైగా పూడికతీత పనులకు వెచ్చిస్తున్న బల్దియా చాలాచోట్ల నామినేషన్ పద్ధతిన పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
అడుగడుగునా నిర్లక్ష్యం..
శంభునిపేట, ఏకశిలానగర్, శివనగర్, ఉర్సు డీకే నగర్, కరీమాబాద్ సాకరాశికుంట, 12 మోరీలు, రామన్నపేట, హంటర్‌రోడ్డు, ఉర్సు బొడ్రాయి, తిరుమల జంక్షన్, వడ్డ్డేపల్లి, ప్రశాంత్‌నగర్, నయీంనగర్, చైతన్యపురి కాలనీ ప్రాంతాలతో పాటు వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధి పలు డివిజన్లలో పూడికతీత పనులు చేపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో పనుల్లో పారదర్శకత కోసం కొత్తగా యాప్‌ను రూపొందించి జీపీఆర్‌ఎస్, జియో ట్యాగింగ్ పద్ధతిని కూడా కొన్నిచోట్ల ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలాచోట్ల నాలాల పూడికతీత పనులు జేసీబీ, హిటాచీ యంత్రాలతో ౖపైపెన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దగ్గరుండి పని చేయించాల్సి న ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండడం లేదు. దీంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్)ని మాత్రమే తీసి ఇతర వ్యర్థాలను వదిలేస్తున్నారని నగరవాసులు చెబుతున్నారు. ఇటీవల వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో పర్యటించిన నగర మేయర్ గుండు సుధారాణి పూడికతీత పనులు పరిశీలించారు. వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈనెల 20 నుంచి
24వ తేదీ వరకు
● రెండో దశలో ఎస్‌ఏలకు..
● మెరుగైన బోధనే లక్ష్యంగా ట్రైనింగ్
పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు
● సరస్వతి నది పుష్కరాలకు పోటెత్తిన భక్తులు ● తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు రద్దీ
● ఆలయాల్లో దర్శనాలు.. పుష్ప గిరి పీఠాధిపతి విద్యా భారతి స్వామి పూజలు
● సుమారు 1.80 లక్షల మంది పుష్కర స్నానాలు.. పర్యవేక్షించిన కలెక్టర్ రాహుల్ శర్మ
న్యూస్‌రీల్
పూడికతీత పనుల్లో కమీషన్ల వేట
‘గ్రేటర్’లో
కొనసాగుతున్న
తంతు
ఏటా రూ.కోట్లు
తగలేస్తున్న ‘బల్దియా’
మొక్కుబడిగా పనులు..
నామమాత్రంగా తనిఖీలు
గత అక్రమాలపై
ఫిర్యాదులు..
తేల్చని ‘విజిలెన్స్’
‘విజిలెన్స్’ విచారణ బుట్టదాఖలు
ఎప్పటిలాగే ఈసారి కూడా పనులను ఆలస్యంగా మొదలెట్టారు. జూన్ 2 నుంచే వర్షాలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసినా పూడికతీత పనులు వేగంగా సాగడం లేదు. సగం పనులు పూర్తయ్యేలోపే వర్షాలు పడితే గతంలో మాదిరిగానే ఈసారి విడుదలైన నిధుల్లో సగానికి పైగా స్వాహా అయ్యే అవకాశాలు ఉన్నాయని బల్దియా అధికారులు, కార్పొరేటర్లే అంటున్నారు. పూడికతీత పనుల్లో అక్రమాలు జరిగాయంటూ గతంలో కొందరు మాజీ కార్పొరేటర్లు, పౌరుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. చర్యలు మాత్రం లేకపోవడంతో నిధుల దుర్వి నియోగం సర్వసాధారణంగా మారింది.
లక్ష్యం మేరకు పూడిక తీయట్లేదు..
భద్రకాళి చెరువు మరింత లోతు పూడిక తీయాల్సింది. 3లక్షల క్యూబిక్ ఫీట్లు పూడిక తీయాల్సి ఉండగా సగం కూడా పూర్తికాలేదు. అధికారులు మాత్రం 70శాతం అయ్యిందని మంత్రులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలా అయితే వర్షాకాలంలో చెరువునిండి నీరు బయటకు వస్తుంది. వర్షాలుపడే లోపే పూడికతీత పూర్తిచేయాలి. భద్రకాళి చెరువులోకి డ్రెయినేజీ నీరు రాకుండా గోడ నిర్మించాలి. – పుల్లూరు సుధాకర్, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు

భక్తజన ప్రవాహం

భక్తజన ప్రవాహం

భక్తజన ప్రవాహం

భక్తజన ప్రవాహం

భక్తజన ప్రవాహం

భక్తజన ప్రవాహం

భక్తజన ప్రవాహం