బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
ఖిలా వరంగల్: శిక్షణ శిబిరాల ద్వారా ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని ఓ పాఠశాలలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ గురువారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి కొండా సురేఖ శిబిరాన్ని సందర్శించారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఈఓ జ్ఞానేశ్వర్, సుజన్ తేజ, నాగేశ్వర్‌రావు, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
పోస్టర్ ఆవిష్కరణ
న్యూశాయంపేట: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్లను వరంగల్ కలెక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, ఆర్‌ఎల్‌సీ శ్రీనివాస్, ప్రిన్సిపాళ్లు భిక్షపతి, శ్రీపాల, రాజు, కృష్ణకుమారి, నీలిమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి


