
కేయూ స్పోర్ట్స్‌బోర్డులో అవకతవకలు
● వీసీ, రిజిస్ట్రార్లకు వినతిపత్రాలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డులో అవకతవకలకు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కేయూ ఫిజికల్ ఎడ్యూకేషన్ కళాశాలకు చెందిన నలుగురు పరిశోధకులు మహ్మద్ పాషా, పల్లవి, బుచ్చయ్య, అవినాష్ బుధవారం వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రానికి వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ, ఓ కాంట్రాక్టు సీనియర్ అసిస్టెంట్ కలిసి ఇష్టానుసారంగా స్పోర్ట్స్ బోర్డు పరిధిలోని పీడీలకు సంబంధంలేకుండా పలు క్రీడల టీమ్‌లకు ఓ వ్యక్తిని కోచ్ కమ్ మేనేజర్‌గా పంపారని ఆరోపించారు. 2022 నుంచి 2025 అకాడమిక్ ఇయర్ వరకు స్పోర్ట్స్ బోర్డు టీం లిస్టులు, పీడీల పేర్లు వారికి వినియోగించిన నిధులు సెటిల్‌మెంట్స్ బిల్సుపై కమిటీవేసి విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని కోరారు. స్పోర్ట్స్ బోర్డు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన వీసీ ప్రతాప్‌రెడ్డి.. స్పోర్ట్స్ బోర్డుపై కమిటీతో విచారణ చేపడతామని హామీ ఇచ్చారని ఫిజికల్ ఎడ్యూకేషన్ కాలేజీ పరిశోధకుడు మహ్మద్‌పాషా తెలిపారు.