
అక్రమదాడులపై వెల్లువెత్తిన నిరసన
– 10లోu
విజయవాడలోని ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి నివాసంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా దాడులు చేయడాన్ని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్లబ్యాడ్జీ లు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏపీ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. – హన్మకొండ అర్బన్