
యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపిక
కేయూ క్యాంపస్: ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌కు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఎంపికయ్యారని కాకతీయ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. కర్ణాటకలోని మంగళూరులో ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న ఐకాన్ యూత్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్–2025కు కేయూ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన జాతీయ సేవాపథకం (ఎన్‌ఎస్‌ఎస్) వలంటీర్లు శ్రీజ జాదవ్, గుజ్జర వికాస్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. వలంటీర్లను బయోటెక్నాలజీ విభాగం అధిపతి డాక్టర్ శాస్త్రి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ టి.రాధిక అభినందించారు.

యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపిక