సొంత విత్తనాలే శ్రేయస్కరం | - | Sakshi
Sakshi News home page

సొంత విత్తనాలే శ్రేయస్కరం

May 8 2025 12:34 AM | Updated on May 8 2025 12:34 AM

సొంత

సొంత విత్తనాలే శ్రేయస్కరం

ఖిలా వరంగల్‌: ఏడాదంత శ్రమించినా.. పంట దిగుబడి లేకుంటే రైతుల కష్టం వృథా అవుతుంది. పంట దిగుబడి తగ్గడానికి ప్రకృతి వైపరీత్యాలు ఒక కారణమైతే.. మరో ప్రధాన కారణం విత్తనాల ఎంపిక. విత్తనాల వల్ల ఎందరో రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. వరంగల్‌ జిల్లాలో గత ఏడాది మిరప, పత్తి అంతకుముందు వరి రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. పూత, కాత దిగుబడి రాకపోవంతో అనేకమంది రైతులు ఆర్ధికంగా నష్టపోయారు. ఈనేపథ్యంలో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు గత రెండు ఏళ్ల నుంచి రైతులు సొంతంగా విత్తనాలను తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కల్తీల బెడద, కొనుగోలు భారం తగ్గించుకునేందుకు ఇంకొందరు మేలైన విత్తనాలను సేకరించుకుంటున్నారు. ఖరీదైన విత్తనాలు కొనుగోలు చేసినప్పుటికీ పంట ఏపుగా పెరుగుతుందే తప్ప దిగుబడి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని గత ఏడాది నష్టపోయిన రైతులు చెబుతున్నారు. నకిలీవిత్తనాలతో మిరప, మొక్కజొన్న, పత్తి సాగు చేసి కంపెనీల చుట్టూ పరిహారం కోసం తిరిగినా, గిట్టుబాటు అవడం లేదని వాపోతున్నారు. ఆకర్షనీయంగా సంచులతో విత్తనాలు నింపి ప్రత్యేక ఆఫర్ల పేరిట వ్యాపారులు రైతులకు ఎర చూపి అంటకడుతున్నారు. నష్టపోయిన రైతులను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. విసిగివేసారిన రైతులు కొందరు గత ఏడాది పండించిన పంటలో కొంత భాగాన్ని వేరుగా చేసి నాణ్యమైన విత్తనాలను తయారు చేసుకుంటున్నారు. దీని వల్ల ఆర్ధిక భారం తగ్గడంతోపాటు కల్తీల బెడద తగ్గనుంది.

నకిలీల బారిన పడకుండా

రైతుల ముందుచూపు

ప్రతి ఏడాది విత్తనాల

కొనుగోలుతో ఆర్థిక భారం

జాగ్రత్తలు పాటించాలి..

విత్తన షాపుల్లో మేలైన విత్తనాలుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగితే మొత్తం పరిహారం రైతు ఖాతాలో జమయ్యేలా చూడాలి. మార్కెట్లో లభ్యమయ్యే విత్తనాలు కొనకుండా సొంతంగా విత్తనాలు తయారు చేసుకోవడం మేలు. ప్రతి ఏడాది సొంత విత్తనాల ఉపయోగించి మేలైన దిగుబడిని సాధిస్తున్నా.

– పులి అశోక్‌, రైతు సూరిపెల్లి

ధాన్యాన్ని దాచి ఉంచాను..

గత ఏడాది వరకు విత్తనాలను కొనుగోలు చేశా. ఒక్కోసారి దిగుబడిలో తేడా వచ్చి పెట్టుబడి కూడా రాలేదు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టే మిరప పంటలో విత్తనాల ఎంపిక కీలకమైంది. లేకుంటే నష్టాలు తప్పవు. ఈ ఏడాది మేలైన వరి ధాన్యాన్ని దాచి ఉంచా. వాటితోనే సాగు చేసి అధిక దిగుబడి సాధించేందుకు ప్రయత్నిస్తా.

– జగపతి బాబు, రైతు,

రాంగోపాల్‌పురం, వరంగల్‌

సొంత విత్తనాలే శ్రేయస్కరం 1
1/1

సొంత విత్తనాలే శ్రేయస్కరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement